హృదయం ముక్కలవుతుంది
దెబ్బతిన్న ప్రతిసారీ..
మౌనం వెక్కిరిస్తుంది
మాటలు కరువైన ప్రతిసారీ..
మనసు విలవిలలాడుతుంది
అభిమానం అవమానింపబడిన ప్రతిసారీ..
గాయం మాననంటుంది
లోతుగా తగిలిన ప్రతిసారీ..
కన్నులు మసకబారతాయి
ఆరని మంటలు ప్రజ్వలించిన ప్రతిసారీ..
ఆత్మ ఆక్రోశిస్తుంది
చేయని తప్పుకు శిక్ష పడిన ప్రతిసారీ..
ఏదేమైనా లేవాటానికే ప్రయత్నిస్తాడు మనిషి
క్రిందపడిన ప్రతిసారీ..
ఒక అపార్ధం నుంచి వచ్చిన నిరసన, నిర్లక్ష్యం వల్ల కలిగిన ఆవేదనలోంచి వచ్చిన వాక్యాలు ఇవి...అవుట్లెట్ కోసం రాసినవి మాత్రమే! ఎందుకంటే మనిషికి కలిగే బాధ స్వయంకృతం. అది మనం ఎదుటి వ్యక్తికీ ఇచ్చే విలువను,ప్రాధాన్యతను బట్టి ఉంటుంది. ఈ ఇహలోకపు భ్రమల్లో సంచరిస్తూ ఉన్నంతకాలం మనకు మనం విధించుకునే సంకెళ్ళు ఈ భావోద్వేగాలు...వీటిని అధిగమించటానికి భగవదనుగ్రహం కావాలి...అంతవరకు తప్పవు ఈ గాయాలు..
*******************************************
నేను పరిచయం చేస్తున్న సీరియల్ చదువుతున్న ఒకరిద్దరు ఎవరన్నా ఉంటే వారికి ఈ గమనిక...
నిన్న కష్టపడి ఒక గంట కూర్చుని మూడవ భాగం రాసాను..కానీ రాస్తున్నది ఆన్లైన్లో అవటం వల్ల చివరి క్షణంలో కరెంట్ పోయి మొత్తం డిలిట్ అయిపోయింది. నా సిస్టం పాడయిపోవటం వల్ల కలుగుతున్న తిప్పలు... చదివేవారు కొందరైనా మొదలెట్టినది పూర్తి చేయాలి కదా..మళ్ళీ ఓపిక తెచ్చుకున్నాకా, ఈ బ్లాగ్లో టపాలు తాత్కాలికంగా ఆగిపోయేలోపు తప్పక పూర్తి చేయటానికి ప్రయత్నిస్తాను.
--తృష్ణ.

8 comments:
గాయం మాననంటుంది
లోతుగా తగిలిన ప్రతిసారీ..
జీవితాన్ని చక్కగా విశ్లేషి౦చారు...
తృష్ణ గారూ !
" ఏదేమైనా లేవాటానికే ప్రయత్నిస్తాడు మనిషి
క్రిందపడిన ప్రతిసారీ.. "
నిజంగా ఇది నిజం. ఆత్మ స్థైర్యానికి సూచిక ఈ వాక్యం. మనిషి ఎప్పుడూ అది కోల్పోకూడదు. అపార్థాలకు ఆయుర్దాయం చాలా తక్కువ. సున్నితమైన మనసుకు అయిన గాయం అమితంగా బాధించినా, నిండైన ఆత్మ స్థైర్యం ముందు ఓడిపోక తప్పదు. మీ సీరియల్ మూడోభాగం కోసం ఎదురుచూస్తూ....
పొడుగాటి టపా ఎప్పుడు రాసుకున్నా ముందు ఏదన్నా ఆఫ్‌లైన్ ఎడిటర్లో రాసుకోండి. నాలుగు పేరాలు టైపు చేశాక కరంటు పోతే ప్రాణం ఉసూరుమంటుంది.
గాయం పెద్దదౌతుంది
దాన్ని పొడిచిన ప్రతీసారి (పొడిచిన = పోక్ ఇంటు ఇట్)
కాబట్టి, గాయాలు అవటం ఎంత సజహమో, పాజిటివ్ గా మానే ఆలోచన చేస్కోటం కూడా అంతే ముఖ్యం. స్ట్రెస్ అనేదానికి మందు లేదు, అధవా ఉన్నా, ఆ మందు మరోరకంగా స్ట్రెస్ ని ముందుకు తెస్తుంది.
పైఅన్నిటికన్నా, నాలుగు సార్లు గోటిరాయి తగిలితే అరోసారి తగిలిన దెబ్బ అలవాటైపోతుంది. దాన్నే రాటుతేలటం అంటాం. కష్టమో నిష్టూరమో రాటుతేలాల్సిందే, రప్పదు.
క్యూబ్ గారూ, ధన్యవాదాలు.
రావుగారూ, మీ వ్యాఖ్య చాలా ఓదార్పునిచ్చిందండీ...ధన్యవాదాలు.
కొత్తపాళీ గారూ, నా సిస్టం ఉంటే టపా రాసేప్పుడు ప్రతి 2,3లైన్లూ సేవ్ చేసేస్తూ ఉండేదాన్ని. కానీ ప్రస్తుతం నేను రాస్తున్న సిస్టంలో ఆఫ్ లైన రాసే అవకాశం లేదు..ఏదైనా సాఫ్ట్ వేర్ డౌన్లోడ్ చేసుకునే పర్మిషన్ లేదండీ... కానీ ఏదైనా పధ్ధతి తెలుసుకోకపోతే ఇలా మొత్తం రాసాకా డిలీత్ అయిపోతే రాయాలన్న ఆసక్తే పోతోంది...
భాస్కర్ గారూ, మీరన్నది చాలా నిజం అండీ...రాటుతేలటం అన్నది తప్పనిది..కానీ ఎన్ని దెబలు తగిలినా అది అలవడటం లేదు...నా విషయంలో "manufacturing defect" ఉండి ఉంటుంది...అనుకుంటూ ఉంటాను...:) :)
meeru rasina prathi aksharaniki naa hatsoff..!!1
Post a Comment