సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, May 9, 2011

Tagore జయంతి ఉత్సవాల కబుర్లు

My love for Tagore is ardent. Reasons are many...may be because of his literary works i have studied in my literature books or because of his 'learnedness' or may be because of his bigger image my lecturers have shown or may be because of the one and only "Geetanjali"...and the reasons get multiplied..!! ఈ ప్రేమతోనే 'సంగీతప్రియ' బ్లాగ్ లో టాగూర్ స్వయంగా పాడిన ఆయన కవితలు, పాటలతో ఒక టపా పెట్టాను.
(http://samgeetapriyaa.blogspot.com/2010/06/tagore.html )


విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ 150వ జయంతి ఉత్సవాలను(may 7th) పురస్కరించుకుని "సంస్కృతి ఎక్స్ ప్రెస్" పేరుతో ఐదు బోగీల ఒక ప్రదర్శన రైలును ఊరూరా చాలా ఊళ్ళలో తిప్పారు. ఆ రైలులో ఆయన జీవిత విశేషాలు, ప్రముఖులతో ఫోటోలు, పైంటింగ్స్, రచనలు..బోలెడు ప్రదర్సనకు ఉంచారు. సికిందరాబాద్ లో ఆ రైలు ఉంచినప్పుడు వెళ్ళి బోలెడు ఫోటోలు తృప్తిగా తీసుకున్నాను. అప్పుడూ టపా రాసాను.(http://trishnaventa.blogspot.com/2010/09/tagores-rare-photos-from.html )


మొన్న ఆయన 150వ జయంతి ఉత్సవాలను ఢిల్లీ, కలకత్తా మొదలైన చోట్ల చాలా ఆర్భాటంగా జరిపారు. ఢిల్లీ లో ప్రధాని, సోనియా మొదలైన వారి సమక్షంలో జరిగిన సభలో టాగూర్ రచనల ఆధారంగా విడుదలైన ఆరు సినిమాల డివీడిల పేక్ ను విడుదల చేసారు.

రవీంద్రుని రచనలపై వచ్చిన మిగిలిన సినిమాలు వాటి కబుర్లు, కొత్తగా విడుదలైన డివీడి లోని సినిమాల వివరాలు అన్నీ క్రింద ఉన్న లింక్ లో ఆసక్తిగలవారు చదువుకోవచ్చు.
http://www.nfdcindia.com/tagorestoriesonfilm/gclid=COza1si42qgCFQd66wodmRIgHA


ఈ శోధనలో మరో సంగతి తెలిసింది. టాగూర్ నవల 'nauka Dubi' ఆధారంగా ప్రముఖ బెంగాలి దర్శకుడు Rituparno ghosh తీసిన సినిమా 41వ భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI)లో ప్రదర్శింపబడింది. అది చూసిన ప్రఖ్యాత హిందీచిత్ర దర్శకుడు Subhash ghai ఆ సినిమాను హిందీలో డబ్బింగ్ చేయటానికి అనుమతి పొండారుట. పేరొందిన సుకవి "గుల్జార్"కు సినిమా యొక్క అనువాద బాధ్యతలను అప్పగించారుట. "కష్మకష్" పేరుతో విడుదలవబోతున్న ఆ సినిమాకు గుల్జార్ హిందీలో రాసిన పాటలను చూసి సుభాష్ ఘై మైమరచిపోయాడుట. అంతటి సమ్మోహనాశక్తి మరి గుల్జార్ గారి సిరాలో తప్పకుండా ఉంది. "రైన్ కోట్", "చోఖేర్ బాలి" సినిమాలు చూసాకా ఈ డైరెక్టర్ కి ఫాన్ అయిపోయాను నేను. ఎనిమిది ఫిల్మ్ ఫేర్లు, మరికొన్ని అంతర్జాతియ అవార్డులు తెచ్చుకున్న ఘనత Rituparno ghoshది. మరిక ఆ సినిమా కోసం ఎదురు చూడటమే ప్రస్తుతం నేను చెయ్యగలిగినది.


ఇంకో సంగతి ఏంటంటే టాగూర్ నవల 'nauka Dubi' ఆధారంగానే మన తెలుగులో టి.రామారావు గారు "చరణదాసి"(1956) సినిమా తీసారు. ఎన్.టి.ఆర్, ఏ.ఏన్.ఆర్, సావిత్రి, అంజలీదేవి, ఎస్.వి.రంగారావు మొదలైన హేమాహేమీలు నటించారీ సినిమాలో.అసలు కథకూ ఈ సినిమాకూ కొద్దిపాటి మార్పులున్నట్లున్నాయి. ఇంకో విశేషం ఏమంటే ఈ సినిమాకు మాటలు, రీరికార్డింగ్ విశ్వనాథ్ గారు చేసారు. ఓ ఆన్లైన్ లింక్ దొరికింది. చాలా కాలం క్రితం ఓసారి టీవీలో చూసాను. మళ్ళీ చూడాలి. మీరూ చూసేయండి. ఆ లింక్ ఇదిగో:

http://webcache.googleusercontent.com/search?q=cache:uHL3ls0O37AJ:www.bharatmovies.com/telugu/watch/Charana-Daasi-movie-online.htm+charana+daasi&cd=2&hl=en&ct=clnk&gl=in&source=www.google.co.in



4 comments:

SHANKAR.S said...

కోల్ కతా మింట్ రవీంద్రుని 150 వ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన 150 రూపాయల కాయిన్ కు బుకింగ్స్ ఓపెన్ చేసినప్పుడు ఒకటి బుక్ చేశాను. ఎప్పుడు పంపిస్తాడో ఏంటో? ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.

SRRao said...

తృష్ణగారూ !
మంచి సమాచారం. ధన్యవాదాలు

Sharada said...

చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారండీ!
మొన్న మా అమ్మాయి ఇంగ్లీషు పొయిట్రీ పేపరు కోసం టాగూర్ ది
"Where the mind is without fear గురించి రాసి ఒక చిన్న ప్రెజెంటేషన్ కూడ చేసింది క్లాసులో. ఆ సందర్భంగా నేను మొన్నీ మధ్యనే పిల్లలకి రవీంద్రుని కవిత్వం గురించీ, గీతాంజలి గురించీ చెప్పాను.
ఇప్పుడు మీ టపాలో వున్న విషయాలు కూడా చెప్తాను. పంచుకున్నందుకు ధన్యవాదాలు.
శారద

Bolloju Baba said...

good info

here is the translation of Tagore Stray Birds telugu translation

http://sahitheeyanam.blogspot.com/2009/01/blog-post.html


http://www.scribd.com/doc/9674265/Tagore-Stray-Birds-Telugu-Translation

bollojubaba