సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, January 5, 2010

స్టీవియా


"స్టీవియా" ఒక హెర్బల్ ప్లాంట్. ఈ మొక్క ఆకులు పంచదార కన్నా ఇరవై,ముఫ్ఫై శాతం తియ్యదనం కలిగి ఉంటాయి. కొన్ని శతాబ్దాలుగా "సౌత్ అమెరికా"లో కల్టివేట్ చెయ్యబడుతున్న ఈ మొక్క పధ్ధెనిమిదవ శతాబ్దంలో మిగిలిన ప్రపంచ దేశాలకి పరిచయమైంది. ఇప్పుడిది ఒక "నేచురల్ స్వీట్నర్" గా ప్రసిధ్ధి చెందిన హెర్బ్.

దాదాపు ఒక పదేళ్ళ క్రితమేమో ఆదివారం ఈనాడు పుస్తకంలో "నేచురల్ సుగర్ సబ్స్టిట్యూట్" గా "స్టీవియా" గురించి ఉన్న ఆర్టికల్ చదివాను. కట్టింగ్ దాచలేదు కానీ నాకు ఆ ఆర్టికల్ బాగా గుర్తు. భవిష్యత్తులో నేను దాన్ని వాడతానని అప్పుడు అనుకోలేదు. 1 spoon sugar లో కనీసం 25 కేలరీస్ ఉంటాయట. "పందార" మానేసి ఆ అధిక కేలొరీలన్నీ తగ్గించాలని ఐదేళ్లక్రితం నిర్ణయించుకున్నాను. కొన్నాళ్ళు "తీపిలేని టీ" తాగాను.తరువాత కొన్నాళ్ళు మార్కెట్లో లభ్యమైన "ఆర్టిఫిషియల్ సుగర్ సబ్స్టిట్యూట్స్" కొన్ని ట్రై చేసా. కానీ "ఏస్పర్టీమ్", "సర్కోజ్" వంటివాటి దీర్ఘకాల వాడకం మంచిది కాదని చాలా చోట్ల చదివి వాడటం మానేసాను.

2,3ఏళ్ళ క్రితమేమో ఒక ఎగ్జిబిషన్ లో హెర్బల్ ప్రోడక్ట్స్ స్టాల్ లో "బయో ఫుడ్ సప్లిమెంట్" అంటూ అమ్ముతున్న "స్టీవియా పౌడర్" ను చూశాను నేను. స్టాల్ లో అబ్బాయి చాలా ఉపయోగాలు చెప్పాడు. దీనిలో
కేలరీలు ఉండవు ,
బ్లడ్ సుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది,
హై బ్లడ్ ప్రజర్ ను తగ్గిస్తుంది,
అధిక బరువు తగ్గిస్తుంది,
జీర్ణ ప్రక్రియను సరిచేస్తుంది,
దంత క్షయాన్ని నివారిస్తుంది,
గొంతు నెప్పి, జలుబు లను తగ్గిస్తుంది,
గాయాలూ, కురుపులకు, చర్మ సంబంధిత సమస్యలలో కూడా ఉపయోగకరం...
అంటూ...చెప్పుకువచ్చాడు. అవన్ని కరక్టేనని తరువాత నేను జరిపిన "నెట్ సర్వే"లో తెలుసుకున్నాను.

ఏదిఏమైనా ఇది ఒక "నేచురల్ స్విట్నర్" అన్న సంగతి నాకు నచ్చింది. మిగతా ఉపయోగాల సంగతి ఎలా ఉన్నా టీ లో వాడుకోవచ్చు అని ఆ "స్టీవియా పౌడర్" కొనేసాను. అయితే దీని వాడకానికి ఒక పధ్ధతి ఉంది. ఒక కప్పు పౌడర్ కి నాలుగు కప్పుల నీళ్ళు కలిపి, బాగా మరిగించి, అవి మూడు కప్పుల నీళ్ళు అయ్యాకా దింపేసుకుని 10,15 గంటలు ఆ ద్రావకాన్ని అలా ఉంచేసుకోవాలి. అలా చేయటం వల్ల ఆకు పొడిలోని సారం అంతా ద్రావకంలోకి వచ్చి, ద్రావకం బాగా తియ్యగా అవుతుంది. తరువాత దాన్ని పల్చటి బట్టలోంచి వడబోసుకుని, ఒక సీసాలోనో, ప్లాస్టిక్ బోటిల్ లోనో పోసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఇది ఒక 2,3 వారాలు నిలవ ఉంటుంది కాబట్టి కొద్దిగానే తయారు చేసుకుంటే మంచిది. ఇది వాడేప్పుడు ఒక 1/4 స్పూన్ కన్నా తక్కువ అంటే 3,4 చుక్కలు కాఫి, టి లలో డైరెక్ట్గా కలిపేసుకుని తాగచ్చు. లేకపోతే టి మరిగేప్పుడు దాంట్లో కూడా వేసుకోవచ్చు. కాని ఎక్కువ వేసుకుంటే అ తీపి అసలు భరించలేము. ఓ సారి వాడితే ఎంత వేసుకోవాలో ఎవరికి వారికే తెలుస్తుంది.

దీనికి కొన్ని" సైడ్ ఎఫెక్ట్స్" ఉన్నాయని అంటారు. కానీ అది ఎక్కువగా వాడితేనే. పైగా నేను వాడేది ఒక్క "టీ" లోకే కాబట్టి, కాఫీ టీల వరకూ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కన్నా వాడకానికి వంద రెట్లు ఇదే నయం అని నా అభిప్రాయం. ఈ "స్టీవియా" గురించి తెలుసుకోవాలి అనుకునేవారు "ఇక్కడ" మరియూ "ఇక్కడ" చూడవచ్చు.


పైన లింక్ పనిచేయనివారు ఈ క్రింది విధంగా ప్రయత్నించి చూడండి:

1)"www.healthy.net" లోకి వెళ్ళి search లో
"stevia - The Natural Sweetener: Resources and additional links " అని కొట్టి చూడండి..

2) "http://en.wikipedia.org/wiki/Stevia." ఈ లింక్ లో చూడండి.

ఈ పౌడర్ వెల వెల వంద గ్రాములు Rs.70/- ఒకసారి కొంటే రెండు,మూడు నెలలు వస్తుంది. నాకు రెగులర్గా దొరికేది
"Trishakti farms"వారు తయారుచేసినది. పేకెట్ మీద ఉన్న అడ్రస్,ఫోన్ నంబర్ క్రింద ఇస్తున్నాను:
Trishakti Enterprises
H.no.5-115,chinnamamgalaram,
moinabad Mandal, R.R. dist
A.P.-501504
cell:9391157340

Hyd branch:
16-Vikaspuri,
ESI-AG Colony road,
S.R.nagar(PO)
HYD-38
ph:23811220

17 comments:

శేఖర్ పెద్దగోపు said...

ఉపయోగకరమైన సమాచారం అందించారు. థాంక్స్. అన్నట్టు మీరిచ్చిన రెండు లింక్ లు క్లిక్ చేస్తుంటే ఆ పేజీల్లో వైరస్ ఉందని నా Anti virus (AVG)హెచ్చరిస్తుందండి.

Unknown said...

నేను షుగర్ సప్లిమెంట్ గా 'స్ప్లెండా' వాడతాను. మీరు చెప్పిన 'స్టీవియా' గురించి ఇప్పుడే వింటున్నాను. ట్రై చేసి చూస్తాను.

:)

వీరుభొట్ల వెంకట గణేష్ said...

Very informative post.
Could you let me know the price range for this?
BTW, can we use this with Green Tea?
Also, from how long you have been using this?
Again, thanks for this post.

Anonymous said...

చాలా ఇన్ఫర్మటిక్ గా ఉందండి.

శ్రీలలిత said...

చాలా ఉపయోగకరమైన విషయం చెప్పారు.. ధన్యవాదాలు.

Unknown said...

manchi vishayam chepparu. vedaka boyina tiga kaliki tagilinattu. thanka amma

తృష్ణ said...

శేఖర్ గారూ,
1)"www.healthy.net" లోకి వెళ్ళి search లో
"stevia - The Natural Sweetener: Resources and additional links " అని కొట్టి చూడండి..

2) "http://en.wikipedia.org/wiki/Stevia." ఈ లింక్ లో చూడండి.

తృష్ణ said...

వేణూగారూ, ట్రై చేసి చూడండి...

గణేష్: నేను టపాలో రాసినట్లుగా సుమారు రెండు,మూడేళ్ళ నుంచీ వాడుతున్నానండీ. నాకయితే బానే ఉంది.
వంద గ్రాములు Rs.70/- అండీ. నాకు రెగులర్గా దొరికేది Trishakti farms వారు తయారుచేసినది. అడ్రస్,ఫోన్ నంబర్ క్రింద ఇస్తున్నాను:
Trishakti Enterprises
H.no.5-115,chinnamamgalaram,
moinabad Mandal, R.R. dist
A.P.-501504
cell:9391157340

Hyd branch:
16-Vikaspuri,
ESI-AG Colony road,
S.R.nagar(PO)
HYD-38
ph:23811220

తృష్ణ said...

ganesh, we can use this for "Green tea" also. I use this in my Green tea everyday..:)

తృష్ణ said...

@నా గోల: నాకు తెలిసిన కొన్ని మంచి విషయాలు ఎవరికైనా ఉపయోగపదతాయని ఆశండీ...థాంక్స్.

@శ్రీలలిత : ధాంక్స్ అండీ. వివరాలు కావాలంటే పైన జవాబులో రాసానండీ.

@చివుకుల: ధన్యవాదాలు. స్టీవియా వివరాలు కావాలంటే పైన జవాబులో రాసానండీ చూడండి..

వేణూశ్రీకాంత్ said...

చాలా మంచి విషయం చెప్పారు తృష్ణా, నాకు వెంటనే స్టీవియాకు మారిపోవాలని అనిపిస్తుంది. నేను కూడా స్ప్లెండా వాడేవాడ్ని ఇది ఒక హెల్తీ ఆల్టర్నేటివ్. స్టీవియా లాంటి నేచురల్ హెర్బ్ దొరికితే ఇక ఆలోచించాల్సిన పనేలేదు. ఎక్కడ దొరుకుతుందో వివరాలు కూడా ఇచ్చి చాలా మంచి పని చేశారు. ధన్యవాదాలు.

జయ said...

ఈ స్టీవియా పౌడర్ ఏదో బాగున్నట్లుంది. నేను కూడా ట్రై చేసి చూస్తాను. ఇప్పటి ఇండస్ట్రియల్ ఎక్జిబిషన్ లో దొరుకుతుందనుకుంట. ఇంకా ఎక్జిబిషన్ కి పోలేదు. అక్కడ ట్రై చేస్తాను.

తృష్ణ said...

వేణూగారు, తప్పక ప్రయత్నించండి. ఇతరత్రా కూడా మంచి ఉపయోగాలు దీని వాడకం వలన. కాకపోతే లిక్విడ్ ప్రిపరేషన్ కు కాస్త కొంచెం ఓపిక అవసరం...:)


జయగారు, ఎక్జిబిషన్ లో ఒకవేళ దొరకకపోతే, మీరు హైదరాబాద్ అయితే టపాలోని ఫొన్ నంబర్ కు ట్రై చేయండి ఎక్కడ దొరికేది చెప్పవచ్చు వాళ్ళు.

చంద్ర మోహన్ said...

చాలా ఉపయోగకరమైన విషయం చెప్పారు! స్టీవియా గురించి ఎక్కడో విని కొన్ని మొక్కలు తెప్పించి మా సంస్థఆవరణలో నాటించాను. మొక్కలైతే పెరిగాయిగాని ఎలా వాడాలో తెలియక అలాగే ఆకులను తెంపి నమిలేస్తున్నాం. పచ్చి ఆకులు అంత తీయగా ఉండవు. చివరన చిరు చేదుగా కూడా అనిపిస్తాయి. ఇప్పుడు మీరు చెప్పినట్లు కషాయం చేయిస్తాను. క్రెడిట్ మీ బ్లాగుకే ఇస్తానులెండి:)

ధన్యవాదాలు!

తృష్ణ said...

చంద్రమోహన్: చాలా థాంక్స్ అండీ. లిక్విడ్ ఎమ్డిన ఆకులతోనే చేయాలండీ మరి.ఆకులు ఎండబెట్టేసి మిక్సీ తిప్పేయండి. ఆ తరువాత 1:4 పాళ్ళలో నీటితో మరిగించి లిక్విడ్ ప్రెపేర్ చేయండి...!
నేను కూడా బొటానికల్ ఎగ్జిబిషన్ లో ఈ మొక్కలు చూశానండీ...కొనలేదు...నెక్స్ట్ టైం కొంటాను.

భావన said...

వావ్ ఏకంగా స్టివియా చేసేస్తున్నారా.. కూల్ కదా. నేను కొనుక్కుంటున్నా ఇక్కడ ట్రువియా వాడతాము మేము ఇకడ స్టివియా లాన ఇది కూడా. బాగుంది. మీరు బలే ఇన్ఫ్ర్మేషన్ తెస్తారు తృష్ణ.. వెరీ నైస్. :-)

Anonymous said...

చలా వుపయోగించే సమాచారం. ముఖ్యంగా ఇండియాలో తయారవుతున్న ప్రాడక్ట్.
మన ఇంట్లోనే ఆ మొక్కలు పెంచుకుంటే, తులసి తీర్థంలా సేవించవచ్చు. :)
గత దశాబ్దకాలంలో దేశంలో డయాబిటిక్ వ్యాధి శరవేగంగా విస్తరించిందట. ఆస్పర్టేం సైడెఫెక్ట్స్ ఏమిటో ఓ అనుభంధ టపా చెప్పండి.
మంచి పోస్ట్.