గుణింతం గుర్తులు |
ఇక గుణింతాలు రాయటం, పలకటం నేర్చుకుంటున్నాం(నేనూ,పాప). దాదాపు అన్ని గుణింతాలు వచ్చేసాయి. "క" నుంచి "స" వరకూ, ఆఖరుకి "హ" "క్ష" గుణింతాలు కూడా పలకటం వచ్చేసాయి. కానీ ఒక్క గుణింతం మాత్రం నాకు పలకటం రావట్లేదు. అది కూడా మొత్తం కాదు. రెండే రెండు అక్షరాలు. అదీ "ళ" గుణింతం. ళ, ళా, ళి, ళీ, ళు, ళూ వరకూ వస్తోంది ఇకపై నాలిక పలకటం లేదు... "ళృ ...ళౄ" నేను పలికిన తీరు చూసి మా పాప పడీ పడీ నవ్వుతోంది...:(
మీకెవరికైనా పలకటం వస్తోందేమో కాస్త చెబుదురూ...