సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, October 10, 2025

OTT Entertainment 5 : మేఘాలు చెప్పిన ప్రేమ కథ


సినిమా పేరు ఎంత బాగుందో కథలో ప్రేమ కూడా అంతే బాగుంది ! అందమైన ప్రకృతి.. తమిళనాడులోని "వాల్పరై" కొండప్రాంతాల రమణీయమైన అందాలు, చిత్రీకరణ చాలా చాలా బాగుంది. స్టన్నింగ్ ఫోటోగ్రఫీ!  హీరో అబ్బాయిని ఇదివరకూ "వికటకవి" వెబ్ సిరీస్ లో చూసి బాగా నటించాడనుకున్నాము. ట్రైలర్ చూసినప్పుడే సినిమా చూడాలని ఫిక్సయిపోయాము. ఈ చిత్ర కథ ఎలా ఉన్నా, నాయికా,నాయకుల మధ్య ప్రేమ చిత్రీకరించిన విధానం బాగుంది. వెరీ డీసెంట్ ఇన్ టుడేస్ టైమ్స్ అనే చెప్పాలి. సినిమాలో వీరిద్దరి  ప్రేమకథ పార్ట్ చాలా చాలా బాగుంది. ఎంతో హృద్యంగా ఉంది. ఇద్దరి మధ్య డైలాగ్స్, ఇంకా పేరెంట్స్ తో హీరో హీరోయిన్ మాట్లాడే డైలాగ్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ కొత్తమ్మాయి. కేరెక్టర్ చాలా బాగుంది. భలే సరదాగా ఉంది ఆ అమ్మాయి స్క్రీన్ మీద ఉన్నంతసేపూ. బాగా నటించింది. కానీ మొత్తం మీద ఇంకా బాగుండచ్చేమో అనిపించింది. బామ్మగా, శాస్త్రీయ సంగీత గాయనిగా రాధిక పాత్ర, ఆవిడ చీరలు, జువెలరీ, మేకప్ బాగా తనకి సెట్ అయ్యాయి. ముఖ్యంగా తను పెట్టుకున్న ముక్కుపుడక బాగా నచ్చింది నాకు. హీరోయిన్ ముక్కుపుడక కూడా అందరు హీరోయిన్ లూ ఈమధ్య పెట్టుకునే నోస్పిన్ లా కాకుండా కాస్త డిఫరెంట్ గా బాగుంది. గాయకులు ప్రిన్స్ రామవర్మ గారు ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు. ఒక అందమైన డీసెంట్ ఫిల్మ్ కేటగిరీలోకి ఈ సినిమా వస్తుంది. Sun NXT లో ఈ సినిమా చూడవచ్చు.


క్రింద ఇన్సర్ట్ చేసిన పాట ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను. ముఖ్యంగా వర్షం, గాలి, అందమైన ప్రకృతి, చిత్రికరణ, సాహిత్యం అన్నీ చాలా బాగున్నాయి. చరణ్ గళం మరోసారి బాలుని గుర్తు చేసింది. వాయిద్యాల హోరు కాకుండా నేచరల్ సౌండ్స్ ని ఉపయోగించుకున్న విధానం సృజనాత్మకంగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట.

https://www.youtube.com/watch?v=mawyH673nq0&list=PL0ZpYcTg19EHUh9wA_NZQtSVD0O2GBbUZ&index=6 



సినిమా ట్రైలర్:

https://www.youtube.com/watch?v=gHbiVKq0jtY






No comments: