సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Thursday, December 23, 2010
నాన్నతో మ్యూజిక్ స్టోర్స్ కి ..
ఈ మధ్యన కొన్ని(చాలానే) సినిమా సీడీలు, డివీడిలు కొన్నాకా మళ్ళీ ఇప్పట్లో మ్యూజిక్ షాప్ కు వెళ్లద్దనుకున్నా. మొన్నొక రోజు బయటకు వెళ్తుంటే నాన్న ఫోన్ చేసి ఈ మధ్యన "sa re ga ma" వాళ్ళు కొన్ని మంచి మంచి ఎం.పీ3 ఆల్బంలు రిలీజ్ చేసారు...చూస్తావేమిటీ వెళ్ళి" అనడిగారు. ఈ మధ్యన రెస్ట్ గా ఉండటంవల్ల ఆయన ఎక్కడికీ వెళ్లటం లేదు. సరే నా కోసం కాదులే నాన్న కోసం కదా అని దారిలోనే ఉన్న మ్యూజిక్ స్టోర్స్ కి వెళ్ళా. మాట్లాడుతూ మాట్లాడుతూ ఫోన్లోనే నాతో పాటూ నాన్నతో కూడా షాపింగ్ చేయించేసా. నేను ఒకో సీడీ లిస్ట్ చెప్పటం, కొనాలో వద్దో తను డిసైడ్ చెయ్యటం. తనకు కావాల్సినవి కొనేసా. నా భ్రమ కానీ మ్యూజిక్ షాపుకెళ్ళి నేనెప్పుడూ ఖాళీగా వచ్చాను...? పనిలో పని నాన్న చెప్పిన సీడీలతో పాటూ నేనూ రెండు మూడు కొనేసుకున్నా.
ఏమైనా "sa re ga ma"వాళ్ళు మంచి ఎం.పి౩లు చేసారు. ఎంపిక చేసిన పాటలు కూడా మంచివే ఉన్నాయి. ఒకోసారి పేరు బాగుంటుంది తప్ప ఆల్బంలో పాటలన్నీ బాగుండవు. వేటూరిగారివి రెండు సీడిలు చూశాను. ఎవరు కంపైల్ చేసారో కానీ రెండింటిలోనూ పెద్దగా కొని దాచుకోవాల్సిన కలక్షన్ లేదు. ఇంతకీ ఈ "sa re ga ma"వాళ్ళు సీడీల్లో కొన్నింటికి కర్టసీ విజయవాడలో ఉండే నేమాని సీతారాం గారు. బోలెడు పాత పాటల కలక్షన్ ఉంది ఆయన దగ్గర. హెచ్.ఎం.వి వాళ్ళు కూడా కొన్ని సీడీలకూ, కేసెట్లకూ పాటలకోసం ఆయనను సంప్రదిస్తూ ఉంటారు. నా దగ్గర నాకిష్టమైన పాత పాటల లిస్ట్ ఒకటి ఉండేది. నేను కూడా విజయవాడలో ఉండగా ఆ పాటలన్నీ ఆయన దగ్గర రికార్డ్ చేయించుకున్నాను. డివోషనల్, డ్యూయెట్స్, మేల్ సోలోస్, ఫీమేల్ సోలోస్, పేథోస్...అంటూ వాటిని డివైడ్ చేసి దాదాపు పది కేసెట్లు దాకా చేయించుకున్నా.
ఇంతకీ నే కొన్న సీడీల దగ్గరకు వచ్చేస్తే, చాలా వరకూ మా దగ్గర ఉన్నవే కాబట్టి లేనివాటి కోసం వెతికాము.(షాపులో నేను, ఫోనులో నాన్న..)
1)"హిట్ పైర్ - మాధవపెద్ది సత్యం ఽ పిఠాపురం నాగేశ్వరరావు" సీడి ఒకటి. ఇందులో
* అట్టు అట్టు పెసరట్టు
* భలే చాన్సులే
*అయ్యయో చేతిలో డబ్బులు పోయెనే
*సైకిల్ పై వన్నెలాడి
*సోడా సోడా
*వివాహభోజనంబు
*ఏం పిల్లో తత్తరబిత్తరగున్నవు
మొదలైన సరదాపాటలు ఏభై దాకా ఉన్నాయి. కొనేసా.
2)రెండవది "మొక్కజొన్న తోటలో - మెలొడీస్ ఆఫ్ సుశీల". ఇందులో
* మొక్కజొన్న తోటలో
*నీవు రావు నిదుర రాదు
*అందెను నేడే
*గోరొంక కెందుకో
*నిదురించే తోటలోకి
*కన్ను మూసింది లేదు
*నీ కోసం
*నీ చెలిమి నేడే కోరితిని
*మీరజాలగలడా
మొదలైన మధురమైన పాటలు ఉన్నాయి. ఇదీ కొనేసా.
3) మూడవది "మసక మసక్ చీకటిలో...ఎల్.ఆర్.ఈశ్వరి హిట్స్". ఇందులో
*మసక మసక చీకటిలో
*ఏకాంతసేవకు
*మాయదారి లోకం
*అలాటిలాటి
*కలలో కనిపించావులే
మొదలైన పాటలు ఉన్నాయి. పదే పదే వినదగ్గవి కాకపోయినా ఒక రేర్ వాయిస్ గల గాయని పాటలుగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఈ సీడీని. సో, కొనేసా.
4) "సరసాల జవరాలను....డాన్స్ సాంగ్స్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్స్" అని ఇంకో సీడి. ఇది కొనుక్కో దగ్గ మంచి సీడీ. నాకు బాగా నచ్చినది. ఇందులో మంచి జావళీలు, ఇంకొన్ని ప్రఖ్యాతిపొందిన డాన్స్ సాంగ్స్ ఉన్నాయి.
* అందాల బొమ్మతో
*సరసాల జవరాలను
*బాలనురా మదనా
*నిను చేర మనసాయెరా
*పిలిచిన బిగువటరా
*చూచి చూచి నా మనసెంతో
*ఇంతా తెలిసియుండి
*ముందటీవలే నాపై
*ఎంతటి రసికుడవో
మొదలైన రసభరితమైన పాటలు జావళీలపై ఆసక్తి ఉన్నవారికి బాగా నచ్చుతాయి. కొనేసా..!!
5)తరువాత ఆదిత్యవాళ్లది "సిరివెన్నెల హిట్స్" ఒకటీ సాంగ్స్ కాంబినేషన్ బాగుందని తీసుకున్నాను.
*ఉన్నమాట చెప్పనీవు
*ఏ శ్వాసలో
*వేయి కన్నులతో
*చెప్పవే ప్రేమా
*ఏ చోట నువ్వున్నా
*నీకోసం ఒక మధుమాసం
*దేవుడు కరుణిస్తాడని
*నీకోసం నీ కోసం
*ఇవ్వాలి ఇవ్వాళైనా మీరు
*కొంచెం కారంగా
*గుమ్మాడి గుమ్మాడి
*పెదవిదాటని
ఇలా రాస్తు పోతే సీడీలోని పాటలన్నీ రాసేయాలి. అంత మంచి పాటలున్నాయి దాంట్లో.
ఇంకా ఏం తీసుకున్నానంటే..(6)"ఆదిత్యా" వాళ్ళ కొత్త రిలీజ్ "జెమ్స్ ఆఫ్ దీక్షితార్ ". ఇక ఫైనల్గా గజల్స్ కొనుక్కోకుండా నా పాటల షాపింగ్ అవ్వదు కాబట్టి (7)"mementos" అని ఒక గజల్స్ ఆల్బం కొన్నా. ఇంకా నాన్న మాట్లాడుతున్నారు...ఇంక కళ్ళు మూసుకుని బయటకు వెళ్పోతా నాన్నా చాలా బిల్లయింది అన్నా. సర్లెమ్మని పెట్టేసారు. అదీ రీసెంట్ గా నే చేసిన సీడీ షాపింగ్.
Subscribe to:
Posts (Atom)