పాట url + సాహిత్యం :
http://www.youtube.com/watch?v=_fhR8g_oj6g
మౌనమె నీ భాష ఓ మూగ మనసా (2)
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమె నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో ( 2)
మౌనమె నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా
మౌనమె నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా
కోర్కెల సెల నీవు ఊరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ( 2)
మౌనమె నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా
మౌనమె నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా
************************************************
రెండవది బాపుగారి "స్నేహం" చిత్రంలోనిది.కె.వి.మహదేవన్ గారు సంగితం సమకూర్చిన ఈ పాటని ఆరుద్రగారు రచించగా బాలుగారు పాడారు.
ఈ పాట నాదగ్గర ఉన్నది పెడుతున్నాను.quality కొంచం తక్కువగా ఉంటుండి. http://www.savefile.com/files/2148877
సాహిత్యం:
నవ్వు వచ్చిందంటే కిలకిల ఏడుపొచ్చిందంటె వల
వలగొదారి పారింది గల గలదానిమిద నీరెండమిల మిల(ప)
నది నిండా నీళ్ళు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా(2)
నది నిండా నీళ్ళు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా(2)
కడవైతే కడివెడు నీళ్ళే గరిటైతే గరిటెడు నీళ్ళే(2)
ఎవరెంత చేసుకుంటే(2) అంతే కాదా దక్కేదినవ్వు వచ్చిందంటే కిలకిల ఏడుపొచ్చిందంటె వల వల..
ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ
నడమంత్రపు అధికారానికి గోతులెక్కువ
కొత్త మతం పుచ్చుకుంటె గుర్తులెక్కువ
చేతకానమ్మకే చేష్టలెక్కువ
చెల్లని రూపాయికే గీతలెక్కువ
నవ్వువచ్చిందంటే కిలకిల ఏడుపొచ్చిందంటె వల వల..
తమసొమ్ము సొమవారం ఒంటిపొద్దులుంటారు
మందిసొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు
పరులకింత పెట్టినదే(2) పరలోకానికి పెట్టుబడి
నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల
గోదారి పారింది గల గల
కధలెన్నో చెప్పింది ఇల ఇల...