సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, November 20, 2014

కొన్ని రోజులు..



కొన్ని రోజులు ఝామ్మని జారిపోతూంటాయి
దూకే జలపాతంలా..

కొన్ని రోజులు సాదాగా నడిచిపోతూంటాయి
నిఠారైన నిలువుగీతలా..

కొన్ని రోజులు గజిబిజిగా ప్రశ్నిస్తూంటాయి
బోలెడు చుక్కల మెలికల ముగ్గులా..

కొన్ని రోజులు నిశ్శబ్దంగా గడిచిపోతుంటాయి
స్తబ్దుగా నిశీధిలా.. 

కొన్ని రోజులు దిశారహితంగా ఉంటాయి 
అచ్చంగా జీవితంలా..


5 comments:

పరిమళం said...

:) :)

లక్ష్మీ'స్ మయూఖ said...
This comment has been removed by the author.
తృష్ణ said...

@పరిమళం: చాలా రోజులకి కనబడ్డారు....:)
వీలు చూసుకుని బ్లాగ్ రాస్తూండండి!

@swarajya lakshmi mallampalli: ఈ చిరు కవిత నచ్చినందుకు, మీ వాళ్లకు చదివి వినిపించినందుకు ధన్యవాదాలండీ..

అనంతం కృష్ణ చైతన్య said...

నిజం చెప్పాలంటే మీ బ్లాగ్ చదవడం అంటే ఒక చిన్ననాటి స్నేహితుడ్ని కలిసి ఆరోజులు గుర్తు చేసుకోవడం. విదేశాల నుండి వచ్చిన కొడుకు, అమ్మ ఒళ్ళో తల పెట్టుకోవడం వంటిది.

తృష్ణ said...

@అనంతం కృష్ణ చైతన్య: చాలా కాలంగా నీళ్ళు పోయని చెట్టుకి నీళ్ళు పోస్తే..ఎక్కడో ఓ మూల నుంచి రెండు చిట్టి చిట్టి పచ్చని చివురులు మొలకెత్తుతాయి కదా... అలా ఉంది :)