http://koumudi.net/Monthly/2014/november/nov_2014_navalaa_nayakulu.pdf
దాదాపు పదిహేనేళ్ల క్రితం ఈ నవల ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నాటకం గా తయారైంది. శ్రీకాంతశర్మ గారు ఆ పాత్రపై ఎంతో అభిమానంతో నాటకరూపాన్ని అందించారు. నాన్నగారు శబ్దరూపాన్ని ఇచ్చారు. రికార్డింగ్ సమయంలోనూ, ఆ తరవాత ఎన్నో ప్రశంసలను అందుకుందీ నాటకం. గుర్రపు డెక్కల చప్పుడు, అరుపులు, కోలాహలాలూ, ఆర్తనాదాలు, హుంకారాలు, యుధ్ధపు వాతావరణం మొదలైన ఎఫెక్ట్స్ శబ్ద రూపంలో తేవడం కోసం నాన్న ఎంతగానో శ్రమించారు. పూర్తయిన ఈ నాటకం కేసెట్ ను ఎన్నోసార్లో నాన్న వింటుంటే వినీ వినీ విసిగిపోయి అబ్బా..ఆపేద్దూ గోల అని మేము విసుక్కున్న రోజులు నాకు బాగా గుర్తు :)
..వెరీ నాస్టాల్జిక్.. అబౌట్ దిస్ ప్లే!!
నవల చదివిన ప్రతిసారీ చాలా రోజుల వరకూ యాసుఖై, యూలన్, టెమూజిన్, సుబూటిన్, చమూగా, కరాచర్,బుర్టీ, కూలన్.. మొదలైన పాత్రలు మదిలో మెదులుతూ కలవరపెడతాయి. అసలు వీళ్ళ మూలాలేమిటి.. వీరందరి నిజమైన చరిత్ర తెలిస్తే బాగుండు.. అని మనసంతా గోబీ ఎడారి చూట్టూ ప్రదక్షిణలు చేస్తుంది!!!
No comments:
Post a Comment