image from google |
1990 లో ఉత్తమ హిందీ చిత్రం జాతీయ పురస్కారాన్ని అందుకున్న చిత్రం "దృష్టి". గోవింద్ నిహలానీ దర్శకత్వంలో శేఖర్ కపూర్, డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలు చేసారు. ఈ చిత్రానికి ప్రముఖ హిందుస్తానీ గాయని కిశోరీ ఆమోంకర్(Kishori Amonkar/किशोरी आमोणकर) సంగీతాన్ని చేసారు. నాలుగు పాటలూ హిందుస్తానీ శాస్త్రీయ సంగీతబాణీలే. పాటలు కూడా ఆమే పాడారు. ఒకటి మాత్రం డ్యూయెట్ ఉంది. అది కూడా హిందుస్తానీ శాస్త్రీయ బాణిలోనే ఉంటుంది. సాహిత్యం వసంత్ దేవ్.
ఈ చిత్రంలో రెండు పాటలు యూట్యూబ్ లో దొరికాయి.. రెండూ చాలా బావుంటాయి.
1.)మేఘా ఝర్ ఝర్ బర్సత్ రే..
ఇది ఏ రాగమో గానీ అద్భుతంగా అనిపిస్తుంది ఈ పాట..
(సంగీతం మరియు గాయకురాలు: కిశోరీ ఆమోంకర్)
2) ఏక్ హి సంగ్ హోతే.. జో హమ్ తుమ్.. కాహే బిఛురారే... (ఈ పాట క్రింద ఇచ్చిన గానా.కామ్ లింక్ లో క్లియర్ గా ఉంది) ఈ పాట వింటుంటే 'రుడాలీ' లో "సునియో జీ అర్జ్ మ్హారీ.. " పాట గుర్తుకు వస్తుంది.. బహుశా రెండూ ఒకటే రాగమై ఉంటాయి.
'ఆలాప్' తో పాటూ చిత్రంలో అన్ని పాటలూ gaana.com లింక్ లో వినచ్చు: http://gaana.com/album/drishti-hindi
No comments:
Post a Comment