పనులేమీ చెయ్యకుండా బధ్ధకంగా గడపాలనిపించే ఓ శీతాకాలపు మధ్యాహ్నం..
చలికి తట్టుకోలేక తలుపులూ, కిటికిలన్నీ మూసేసి..
స్వెట్టరు, సాక్స్ వేసేస్కుని, స్కార్ఫ్ కట్టేసుకుని..
మంచంపై మందపాటి రగ్గు కప్పేసుకుని,
తలకు, భుజాలకు ఆసరాగా రెండు దిళ్ళు వెనుక పెట్టుకుని..
చేతిలో ఎంతో ఆసక్తికరంగా ఉన్న పుస్తకం పొద్దుట్నుండీ చదువుతూ...
గతంలో నే చదివిన ఆథ్యాత్మిక పుస్తకాలూ, ముఖ్యంగా "ఒక యోగి ఆత్మకథ" గుర్తుచేసుకుంటూ..
పాల్ బ్రంటన్ తో పాటూ అతని ఆలోచనలను నావి చేసుకుంటూ..
రహస్య భారతంలోకి అతనితో పాటే అన్వేషణ సాగిస్తూంటే...
కలుగుతున్న అలౌకిక ఆనందపు అనుభూతిని...
ఇలా మాటల్లో చెప్పడం కష్టం...!
ఇప్పటివరకు నే చదివిన అతి తక్కువ పుస్తకాలన్నింటిలో భారతదేశ సంస్కృతినీ, అందులోని ఆధ్యాత్మికతనూ, గొప్పతనాన్నీ తెలియచెప్పే గొప్ప పుస్తకం ఇదని మాత్రం చెప్పగలను.
బహుశా పుస్తకంలో చెప్పినట్లు మనిషి తీవ్రంగా దేని గురించి తపన పడతాడో.. దానికి సంబంధించిన దారి ఏదో విధంగా అతనికి ఎదురౌతుందన్న మాట నిజమనిపించింది!!
పుస్తకప్రదర్శనలో మొదటిరోజు కొన్న నాలుగైదు పుస్తకాల్లో ఇదీ ఒకటి. ఆ రోజు ఒక స్టాల్లో ఒకావిడ నా చేతిలో ఈ పుస్తకం చూసి.. 'చాలా మంచి పుస్తకం..చదవండి' అన్నారు.
చదువుతుంటే ప్రపంచం నుండి విడివడిపోయి పైన ఫోటోలో లాగ దట్టమైన అడివిలో, ఆ చిన్న కుటీరంలో ఉన్న అనుభూతి!! ఎంత గొప్ప ఆనందమో.. ఎంత సంతృప్తో...!!
ఈ బధ్ధకపు శీతాకాలపు మధ్యాహ్నం ఇంతటి అలౌకికానందాన్ని కలిగించగలదని కల్లోనైనా ఏనాడూ అనుకోలేదు...
Thank you God!
5 comments:
మీ అనుభూతులను ఎంత అందంగా వ్యక్తపరిచారు !! లిటిల్ & లవ్లీ పోస్ట్ తృష్ణ గారు..Enjoy your reading :-)
wow!
just started reading that book ma'm
@ A Homemaker's Utopia: thanks naginiji :)
@Krishna Palakollu: great!i am sure you'll enjoy every chapter..!నా దృష్టిలో ప్రతి భారతీయుడూ చదవాల్సిన పుస్తకమిది.
Thank you.
మంచి పోస్ట్ తృష్ణగారు. అభినందనలు.
naakO book please!
Post a Comment