సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, July 4, 2013

“జల్తే హై జిస్కే లియే”


సామాజిక సమస్యలపై సినిమాలు తీయడంలో నిపుణుడైన “బిమల్ రాయ్” దర్శకత్వంలో వచ్చిన సినిమా “సుజాత(1959)”. అంటరానితనం ప్రబలంగా ఉన్న అప్పటి రోజుల్లో, అది నేరమని చెప్తూ, ఆ జాడ్యాన్ని విమర్శిస్తూ, ‘అంటరానితనం’ ముఖ్య నేపథ్యంగా తీసిన చిత్రమిది. సుబోధ్ ఘోష్ అనే ప్రముఖ బెంగాలి రచయిత రచించిన కథ ఆధారంగా ఈ చిత్రం తయారైంది. సుబోధ్ రాసిన మరెన్నో కథలు హిందీ, బెంగాలీ సినిమాలుగా రూపొందాయి. 1959లో మూడవ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికవటంతో పాటుగా, నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లను కూడా ఈ చిత్రం సంపాదించుకుంది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శింపబడింది.


ఈ సినిమాలో  “జల్తే హై జిస్కే లియే” అనే ‘ఫోన్ పాట’ నాకు చాలా ఇష్టం. అధీర్ ప్రేమను అంగీకరించి ఇంటికి వచ్చిన వెంఠనే తల్లి తనకు ఒక హరిజనుడితో వివాహాన్ని కుదిర్చిందని తెలిసి సుజాత బాధపడే సమయంలో అధీర్ ఈ ప్రేమగీతాన్ని ఆమెకు ఫోన్ లో వినిపిస్తాడు. కన్నీరు నిండిన కళ్ళతో, బాధతో అధీర్ ఉత్సాహంగా పాడే ఈ పాటను మౌనంగా వింటుంది సుజాత. అప్పటి సినిమాల్లో ‘ఫోన్ లో పాట’ ఒక ప్రయోగమే అయ్యుంటుంది.





పాట వాక్యార్థం వాకిలి పత్రికలో చూడండి:
http://vaakili.com/patrika/?p=3295


3 comments:

Padmarpita said...

తలక్ మహ్మూద్ గారి పాట.....నాకూ చాలా ఇష్టం

Sharada said...

తలత్ గొంతులో ఒక రకమైన ఒణుకూ..
"దిల్ పె రఖ్ లేన ఇసే హాథోన్ సె యే ఛూటే న కభీ,
గీత్ నాజుక్ హై మెరీ శీషే సే భీ, టూటే న కహీ," అన్న నాజూకైన మాటలూ...

శారద

తృష్ణ said...

@padmarpita,@sharada: అవునండి.. తలత్ ది పెక్యూలియర్ వాయిస్ అవడం వల్లనే ఆ పాటలు చిరస్మరణీయాలయ్యాయి..!
ధన్యవాదాలు.