ఎన్ని చికాకులు ఎన్ని గందరగోళాలు ఎన్ని దిగుళ్ళు ఎన్ని నిట్టూర్పులో బతుకుబండి నడవాలంటే దాటాల్సినవెన్ని ఆటుపోటులో ! ఎన్ని మాటలు ఎన్ని మౌనాలు ఎన్ని కూడికలు ఎన్ని తీసివేతలో.. మంచితనపు చట్రంలో నిలవాలంటే భరించాల్సినవెన్ని సమ్మెటపోటులో !!
ఒక రోజు గర్భగుడికి ఉన్న గుమ్మం మూలవిరాట్టుని అడిగిందట - 'స్వామీ నువ్వూ నేనూ ఇద్దరమూ రాయితోనే చేయబడ్డాము. కానీ నన్ను తొక్కుతారూ, నిన్ను మొక్కుతారేందుకు?'
దానికి స్వామి - 'నేను కొన్ని వేల ఉలి దెబ్బలు తట్టుకుని కూడా నిలబడి ఉన్నాను. నువ్వు కొన్ని దెబ్బలకే పడిపోయావు.' అన్నారు.
8 comments:
శిల శిల్పంగా మారాలంటే సమ్మెటదెబ్బ తినక తప్పదండీ...
తప్పదు కదండీ మరి :)
ఒక రోజు గర్భగుడికి ఉన్న గుమ్మం మూలవిరాట్టుని అడిగిందట - 'స్వామీ నువ్వూ నేనూ ఇద్దరమూ రాయితోనే చేయబడ్డాము. కానీ నన్ను తొక్కుతారూ, నిన్ను మొక్కుతారేందుకు?'
దానికి స్వామి - 'నేను కొన్ని వేల ఉలి దెబ్బలు తట్టుకుని కూడా నిలబడి ఉన్నాను. నువ్వు కొన్ని దెబ్బలకే పడిపోయావు.' అన్నారు.
అదీ సంగతి :)
ఆటు పోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి
ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా
కంచి కెళ్ళిపోయేవే కధలన్నీ...
అందుకే మంచిగా ఉండాలని ప్రయత్నించకూడదండీ..:P..(J/K)
చాలా బాగుంది
sri lalita gaaru, Pranav gaaru, chandra, nagini, kamudha gaaru, thanks a lot for the comments.
sisira gaaru, thank you too :)
Post a Comment