సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, September 15, 2011

break at 400... !!


ఐదు బ్లాగులు..
వంద మంది నాతో నడిచేవాళ్ళు..
నాలుగొందలు టపాలు..
బోలెడు ప్రశంసలు..
మూడే మూడు ఘాటు విమర్శలు..
సులువుగా వేళ్ళపై లెఖ్ఖపెట్టుకునేంత తక్కువ పరిచయాలు..
ఒక మనసు చివుక్కుమనే బాధ..
ఇవన్నీ..
నా రెండున్నరేళ్ళ బ్లాగ్ ప్రయాణంలో మజిలీలు.


తోడొచ్చినవాళ్లకు కృతజ్ఞతలు
ప్రోత్సహించినవారికి వందనాలు
మిత్రులైనవారికి ధన్యవాదాలు
నొచ్చుకున్నవారికి క్షమాపణలు

నేనీ ఈ ఐదు బ్లాగ్లులూ నిర్వహించగలగటానికి అనుమతినిచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, అప్పుడప్పుడు మందలింపులతోనే ఎంతో ప్రోత్సాహాన్నీ అందించిన మావారికి బ్లాగ్ ముఖంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. తన ప్రోత్సాహం లేనిదే నేను వంద టపాలు కూడా పూర్తి చేయకుండానే బ్లాగ్ మూసేసేదాన్నేమో.

ఎప్పుడూ అందరూ ఆనందంగా, క్షేమంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష. జీవితంలోనూ, బ్లాగుల్లోనూ కూడా నేను ఎవ్వరి చెడునూ ఎప్పుడూ కోరలేదు. తోచింది రాసాను. అభిరుచులను పంచుకోవటానికీ, జీవితాల్లోని బరువునూ, భారాన్ని తేలిక చెసుకోవటానికి బ్లాగు ఒక చక్కని వేదిక. దీనిని సద్వినియోగ పరుచుకోవాలే తప్ప వాగ్వివాదాల్లోకి దిగి మనసులను మరింత భారం చేసుకోకూడదు అన్నదే నా అభిప్రాయం. అందమైన ప్రపంచంలో జీవించే అవకాశం దొరికినందుకు, మనిషి గా రకరకాల అనుబంధాలను ఆస్వాదించే అదృష్టం దొరికినందుకు ఆనందిస్తూ గడపాలి తప్ప చేదునీ, చీకటినీ, ద్వేషాన్నీ తల్చుకుని కాదు అన్నది నా జీవన విధానం.

ఇది నా బ్లాగ్ ఫాలోవర్స్ కోసం :
ఇలా బ్లాగ్ ద్వారా నా అభిప్రాయాలనూ, అభిరుచులనూ పంచుకునే అవకాశం దొరికినందుకు ఎప్పటికీ ఆనందమే. అయితే మాకు ఈ తెలుగు ప్రాంతం నుంచి తరలి వెళ్ళే సమయం దగ్గర పడింది. మరో కొత్త రాష్ట్రానికీ, కొత్త మనుషుల మధ్యకూ. అందువల్ల ఈ బ్లాగ్ ప్రయాణానికి కొన్ని నెలలు విరామం ఇవ్వక తప్పటం లేదు. అన్నీ సర్దుబాటు అయ్యాకా మళ్ళీ బ్లాగ్ జీవన స్రవంతిలోకి రావాలనే నా కోరిక. బ్లాగుల్లో, బజ్జుల్లో కూడా కనబడకపోతే నన్ను మర్చిపోకండేం !!

.
అందరికీ శుభాభినందనలతో..
మీ
తృష్ణ.




30 comments:

yashaswi said...

prati roju office lo relief kosam mee blog chadavadam alavaatu ipoindi...ippudu meeru konni rojulu gap anesariki chala diguluga undi...:-(

-Yashaswi

జ్యోతి said...

క్షేమంగా కొత్త ప్రదేశానికి వెళ్లి అన్నీ సర్దుకున్నాక మళ్ల కొత్త విశేషాలతో రండి.. మేము ఎదురుచూస్తూ ఉంటాం..

yashaswi said...

Prati roju office lo relief kosam mee blog chaduvutuntanu...kaani ippudu meeru konni rojulu blogs emi publish cheyyaru ante diguluga undi...:-(

-Yashaswi

కృష్ణప్రియ said...

oh! కొద్ది నెలలా! కొత్త ప్రాంతం త్వరగా సెటిల్ అయి వస్తారని ఆశిస్తున్నాను. శుభం!

Lakshmi Raghava said...

ఆస్వాదించా ప్రతిసారి......
ప్రేమతో,
అమ్మలాటి
లక్ష్మీ రాఘవ

ramesh said...

400 ల టపాలకు కృతఙ్ఞతలు. కొత్త ప్రాంతంలో త్వరగా సర్దుకుపోవాలని ఆకాంక్షలు.

శ్రీలలిత said...

తృష్ణగారూ,
ఎక్కువగా కామెంట్లు చేయకపోయినా మీ బ్లాగ్ లని ఇష్టంగా చదివేవాళ్లలో నేనూ ఒకదానిని.
తొందరలోనే భాషేతర రాష్ట్రంలో సర్దుకుని ఇంకా తొందరలో మళ్ళి మీ పోస్ట్ లు రావాలని ఆశిస్తూ...
వెళ్ళెచోట మీకూ, మీ కుటుంబానికీ అన్నివిధాలుగానూ అనుకూలంగా వుండాలని కోరుకుంటూ...
ముఖ్యంగా మీ పాప.. (మొన్న పట్టుపరికిణీతో వున్న ఫొటో చూసి చిన్నప్పుడు నేను మా అమ్మాయికి కుట్టిన పరికిణీలు గుర్తుకొచ్చేయి..)
సంగీత, సాహిత్యాలలో మంచి అభిరుచి ఏర్పరుచుకోవాలని ఆశిస్తూ...
మీనుంచి కాస్త విరామం తీసుకోడానికి మనసుని ఆయత్తం చెస్తున్నాను.

Indira said...

తృష్ణ గారు,రోజూ రాత్రి పడుకోబోయే ముందు మీరేం రాశారా అని చూడడం అలవాటై పోయింది.చాలా మంచి విభిన్నమైన అభిరుచులు మీవి.మీ ద్వారా తెలుగు లో రాయడం,ఇతర బ్లాగ్మితృల టపాలు చదవడం నేను బాగా ఏంజాయ్ చేస్తున్నాను.కొత్త ప్రదేశానికి వెళ్ళిన తరువాత సద్దుకుని మళ్ళి సాధ్యమైనంత తొందరగా మన ప్రపంచానికి వచ్చేయండి.మీ పాప తన బుజ్జి స్నేహితుణ్ణి ఎంత మిస్ అవుతుందో కదా!!మీకు నా శుభాభినందనలు.

వేణూశ్రీకాంత్ said...

All the very best and good luck తృష్ణ గారు, కొత్త ప్రదేశంలో సౌకర్య వంతమైన అన్ని వసతులు మీకు అతి త్వరగా సమకూరాలని మనసారా కోరుకుంటున్నాను.. నాలుగువందల టపాల మైలు రాయి చేరుకున్నందుకు అభినందనలు..

కొత్త పాళీ said...

good going. come back soon.

Saahitya Abhimaani said...

All the best to you and your Family.

Rao S Lakkaraju said...

Hope we will see you soon.

Sujata M said...

Bye bye ! Come back soon.

SRRao said...

తృష్ణ గారూ !

అభినందనలు. మళ్ళీ మీ బ్లాగుకోసం ఎదురు చూస్తూ....

బులుసు సుబ్రహ్మణ్యం said...

400 టపాలకి శుభాకాంక్షలు.

కొత్త ప్రదేశం త్వరగా అలవాటు కావాలని కోరుకుంటున్నాను. ఒక నెలలో మళ్ళీ మీరు బ్లాగులకు రావాలని ఆశిస్తున్నాను.

అల్ ద బెస్ట్.

మాలా కుమార్ said...

కొత్త ప్రదేశానికి అలవాటు పడి త్వరగా రండి .
all the best .

నైమిష్ said...

త్రుష్ణ గారు..మీరు క్రొత్త ప్రదేశానికి త్వరగా అలవాటూ పడి..బ్లాగు బజ్జుల పునః ప్రవేశం త్వరలోనే చేస్తారని ఆశిస్తూ.
"బ్లాగుల్లో, బజ్జుల్లో కూడా కనబడకపోతే నన్ను మర్చిపోకండేం !!"...భలేవారండీ..
తృష్ణ...జీవితాన్ని ప్రతిక్షణం జీవించాలని.
రుచి...the temptation The best way to a man's heart is through his stomach
మనోనేత్రం looking with the heart
సంగీతప్రియ
సినిమా పేజీ

ఇవన్నీ మర్చిపోగలమా?..Happy Journey!! and wishes for 400 posts ..

SHANKAR.S said...

మీకు గరిష్టంగా రెండు నెలలు సమయం మాత్రమే ఇవ్వబడుతోంది. గడువు ముగిసే లోగా మీరు తిరిగి బ్లాగ్ప్రవేశం చేయాలని మీ బ్లాగాభిమానుల కోర్టు ఆదేశించడమైనది. లేనిచో సకల బజ్జర్ల/బ్లాగర్ల సమ్మెకు పిలుపు ఇవ్వడం జరుగుతుంది.

మనసు పలికే said...

వావ్.. 400 టపాలా..అభినందనలు తృష్ణ గారు.
మీరు అనుకునే కొన్ని నెలల విరామం ఇంకాస్త చిన్నదవాలని ఆశిస్తూ, ఆ కొత్త రాష్ట్రం కొత్త ప్రదేశం మీకు అనుకూలంగా ఉండాలని మనసారా కోరుకుంటూ..
బెస్ట్ ఆఫ్ లక్.

prabandhchowdary.pudota said...

మరీ నెలలు అనకండి...యెంత త్వరగా కుదిరితే అంత త్వరగా మళ్ళీ రాయడం మొదలెట్టండి..All The Very Best And Take Care తృష్ణ గారు.

Anonymous said...

మీకు మీ కుటుంబానికి నూతన ప్రదేశంలో మంచి జరగాలని కోరుకుంటూ,

కొంపతీసి మా మద్రాసుకు కాని రావటం లేదుకదా.

కాముధ

గీతిక బి said...

తృష్ణ గారూ..
మీరు వెళ్ళబోయే కొత్త ప్రదేశం మీకు మరింత అనుకూలంగా ఆహ్లాదంగా ఉండాలని... మరెన్నో విషయాల్ని, విశేషాల్నీ మీరు మాతో పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

All the best...

siva said...

మీ "అనుబందం" టపా చదివేటప్పుడే అనుకున్నాను, ఇలాంటిది వుంటుందని. అయినా బ్లాగులతొ మీ అనుబందం విడతీయలేనిది. దూరమైన కొద్దీ పెరుగును ..... జ్ఞాపకాలే మీ బ్లాగులు అయినప్పుడు మర్చిపోవడం ఏలా సాద్యం?

మురళి said...

Come back soon!!

Ennela said...

400 టపాల్ని ఎంత అవలీలగా వ్రాయగలిగారండీ!!!నిజంగా చాలా గ్రేట్ !!
కొత్త ప్రదేశం ఇంకా మంచి పోస్టులు వ్రాయడానికి అవకాశం ఇస్తుందని ఆశిస్తూ...ఆల్ ద బెస్ట్ తృష్ణ గారూ

srinivas said...

తృష్ణ గారూ..
400 టపాలకి శుభాకాంక్షలు.
ఎక్కువగా కామెంట్లు చేయకపోయినా మీ బ్లాగ్ లని ఇష్టంగా చదివేవాళ్లలో నేనూ ఒకడిని.
మీరు వెళ్ళబోయే కొత్త ప్రదేశం మీకు మరింత అనుకూలంగా ఆహ్లాదంగా ఉండాలని... మరెన్నో విషయాల్ని, విశేషాల్నీ మీరు మాతో పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మళ్ళీ మీ బ్లాగుకోసం ఎదురు చూస్తూ....

తృష్ణ said...

వ్యాఖ్యలు రాసిన బ్లాగ్మిత్రులందరికీ మన:పూర్వక ధన్యవాదాలు.

Anonymous said...

Wishing you all the best and join back blogworld soon
ramakrishna

PRASAD said...

I am a silent follower of your "Trushnaventa.blogspot.com" I am not familiar in tying telugu, that s why I am writing in English. I am rather addicted to read ur posts on various topics. The very thought that we have to wait for some time to read your blogs itself is making me worried. I wish that you settle well in your place with all facilities and find time to enter into your blogging activity at the earliest. Thank you very much for the wonderful 400 posts.

Regards,

Prasad

సత్యసాయి కొవ్వలి Satyasai said...

కాలూ చేయీ కూడదీసుకుని ఓ కామెంటేసేసరికి మీ బ్లాగు సెలవ వార్త. తొందరగా వచ్చేయండి.