సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Friday, September 2, 2011
Versatile కార్తీక్
ఒకానొకరోజున వాన సినిమాలోని "ఎదుటనిలిచింది చూడు.." పాట వింటూంటే ఎవరు పాడారా అని సందేహం వచ్చింది. నెట్లో వెతికితే "కార్తీక్" పాడినదని తెలిసింది. ఇక పరిశోధన మొదలుపెడితే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ప్రస్తుతం ముఫ్ఫై ఏళ్ళున్న ఈ తమిళ గాయకుడు ఇప్పటికే ఐదు భాషల్లోనూ(తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ) కొన్ని వందల పాటలు పాడాడు. అన్ని పాటల జాబితాలూ వెతికితే చాలావరకూ అన్నీ హిట్ సంగ్సే. ఈ విజయపరంపర వెనుక ఉన్నది ఒకే రహస్యం... అతని గొంతులోని versatility.
చిన్నప్పటి నుంచే కర్ణాటక సంగీతంలో ప్రవేశం ఉండటం వల్లనేమో కార్తీక్ అన్నిరకాల పాటలూ చాలా సులువుగానే పాడేస్తాడు. సినిమా పాటల్లో కోరస్ లు పాడుతున్న కార్తీక్ ను అతని దగ్గరి బంధువైన గాయకుడు శ్రీనివాస్ రెహ్మాన్ కు పరిచయం చేసాడు. తన అభిమాన సంగీతదర్శకుడైన రెహ్మాన్ కు కార్తిక్ చాలా పాటలనే పాడాడు. వయసు చిన్నదయినా గొంతులోని గాంభీర్యం, హెచ్చు స్థాయిలో పాడగలగటం అతని ప్లస్ పాయింట్స్. అందువల్లే అతను బాలీవుడ్ లో సైతం తనదైన స్థానాన్ని సంపాదించుకోగలిగాడు. పిన్న వయసులోనే బెస్ట్ మేల్ ప్లేబాక్ సింగర్ గా నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, ఒక నంది, మరెన్నో ఇతర అవార్డులు అతని సొంతమయ్యాయి. రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు తెలుగు పాటలకు(హేపీడేస్ లోని "అరెరే అరెరే", కొత్త బంగారు లోకం లోని "నిజంగా నేనేనా") రావటం విశేషం. ఇళయరాజా, రెహ్మాన్, యువన్ శంకర్ రాజా, హేరిస్ జైరాజ్, మణిశర్మ, దేవీశ్రీప్రసాద్ మొదలైన మేటి సంగీత దర్శకుల దగ్గర మళ్ళీ మళ్ళీ పాడే అవకాశాలు వచ్చాయి కార్తీక్ కు.
"పదహారూ ప్రాయంలో నాకొక గాళ్ఫ్రెండ్ కావాలి" అనే పాటతో పాటూ "బాయ్స్" సినిమాలో మరో రెండు పాటలు పాడిన తర్వాత కార్తీక్ కు అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకపోయింది. తెలుగు లో ’అరెరే అరెరే”, ’ఓ మై ఫ్రెండ్ ’ , నిజంగా నేనేనా’, 'ఎదుట నిలిచింది చూడు ', హిందీ గజనీ సినిమాలో ’బెహ్కా మై బెహ్కా, రావణ్ లో ’బెహనే దే’ , తమిళ్ లో (నాకు తెలిసీ) హస్లి ఫిస్లీ (సూర్యా s/o కృష్ణన్), ఉన్నాలే ఉన్నాలే (నీవల్లే నీవల్లే), ఒరు మాలై(గజిని) మొదలైనవి అతనికి మంచి పేరు తెచ్చిన పాటలు. తమిళ్ పాటలు ఇంకా మంచివి ఉండి ఉండచ్చు. నాకు అంతగా తెలీదు.
ఒక ప్రాంతపు గాయకుడు అదే ప్రాంతానికి పరిమితమవ్వకుండా మరెన్నో భాషల్లో పాడటం కొత్తేమీ కాదు కానీ పోటీ బాగా పెరిగిపోయిన ఈ రోజుల్లో బాలోవుడ్లో సైతం తనదంటూ ఒక చోటు ఏర్పరుచుకోవటం విశేషమే మరి. once upon a time in mumbai లో " iam in love ", Delhi-6 లో "Hey kala bandar", 13B లో "Bade se shehar mein ", saathiya లో "Chori pe Chori" (తెలుగు సఖి లో ’సెప్టెంబర్ మాసం” పాట), The legend of bhagat singh లో అద్భుతమైన డ్రం బీట్స్ తో పాటూ వచ్చే ఒక చిన్న వర్స్, Lahore లో కే.కేతొ పాటూ "ab ye kafila" మొదలైనవి కార్తీక్ పాడిన హిందీ పాటల్లో చెప్పుకోదగ్గవి.
తెలుగులో కూడా కార్తీక్ కు చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఇటీవలి చిత్రం "కందిరీగ" సినిమాలోని "చంపకమాలా.." కూడా బాగా పాడాడు. కార్తీక్ తెలుగు సినిమాల్లో పాడిన నాకు తెలిసిన పాటలు కొన్ని:
* నీవల్లే నీవల్లే టైటిల్ సాంగ్ (నీవల్లే నీవల్లే)
* అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యొ (ఇంద్ర)
*కోపమా నాపైనా (వర్షం)
నిలువద్దం నిను ఎపుడైనా (నువ్వొస్తానంటే నేనొద్దంటానా)
* మెరుపై సాగారా (స్టైల్)
* పిలిచినా రానంటావా(అతడు)
* హేపీ...టైటిల్ సాంగ్ (హేపీ)
* కలనైనా ఇలనైనా (చుక్కల్లో చంద్రుడు)
* చిలకమ్మ (గుడుంబా శంకర్)
* అడిగి అడగలేక (దేవదాసు)
* చూడద్దంటున్నా (పోకిరి)
* దేవదాసు కన్నా (మధుమాసం)
* నీతో ఉంటే (జోష్)
* గోరే గోగోరే (కిక్)
*ఏమంటావే (కుర్రడు)
*సరదాగా (ఓయ్)
* గెట్ రెడీ (రెడీ)
*ఓరోరి యోగి (యోగి)
*నా మనసుకి (ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే)
* అరెరే(హేపీ డేస్)
* ఓ మై ఫ్రెండ్(హేపీ డేస్)
* డిస్టర్బ్ చెయ్యకు (అతిధి)
* ఎదుట నిలిచింది చూడు (వాన)
*నిజంగా నేనేనా(కొత్తబంగారు లోకం)
* వింటున్నావా (ఏం మాయ చేసావే)
*ప్రేమా ప్రేమా (మరో చరిత్ర)
* రేలారే రేలారే (వరుడు)
* ఉసురై పోయెను (విలన్)
* చంపకమాలా (కందిరీగ)
ఎవరికైనా ఇంకా తెలిస్తే రాయండీ..! ఇలానే మరెన్నో శిఖరాలను ఈ యువగాయకుడు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను.
బ్లాగ్మిత్రులు మధురవాణి గారు రాసిన పాటల లిస్ట్:180 - నీ మాటలో మౌనం నేనేనా!
ఆట - హొయ్ నా..
అనగనగా ఒక ధీరుడు - చందమామలా అందగాడిని
ఆవకాయ్ బిర్యాని - అదిగదిగో, నన్ను చూపగల అద్దం
ఆవారా - చుట్టేసేయ్ చుట్టేసేయ్
చందమామ - రేగుముల్లోలే
బృందావనం - నిజమేనా
దుబాయ్ శీను - once upon a టైం
గణేష్ - లైలా మజ్నూ, రాజా గణరాజా
గాయం -2 - రామ రాజ్యం (సీరియస్ పాట ఇది.. కార్తీక్ గొంతులానే ఉండదు అసలు.. :)
ఘటికుడు - అసలే పిల్లా
గోపి గోపిక గోదారి - బాల గోదారి
హరే రామ్ - సరిగమపదని, లాలి జో
ఝుమ్మంది నాదం - బాలామణి (సంక్రాంతి పాట)
కావ్యాస్ డైరీ - తెలుసుకో నువ్వే
కిక్ - I dont want love, గోరే గోరే
మహాత్మ - ఏం జరుగుతోంది
మిరపకాయ్ - గది తలుపులు
ఆరెంజ్ - చిలిపిగా చూస్తావలా
శుభప్రదం - నీ నవ్వే కడ దాకా
సూర్య s/o కృష్ణన్ - అదే నన్నే నన్నే
తకిట తకిట - కమాన్ కమాన్, మనసే అటో ఇటో
వీడొక్కడే - కళ్ళు మూసి యోచిస్తే
విలేజ్లో వినాయకుడు - నీలి మేఘమా
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
సేం వాన లో...'ఆకాశ గంగా కూడా అతనే పాడాడు తృష్ణగారు :) ఆకాశ గంగ సూపర్హిట్ కదా :)
అలాగే గనేష్[రాం]లో చలొ చలొరే!
బాయ్స్ సినిమాలో...'అలె...అలే
మహేష్ బబు అర్జున్ సినిమాలొ....'ఓ చెలి నీ వయ్యారాలే'
నాగార్జున మాస్ లో...'హే వాలుకళ్ళ వయ్యారీ
ఇలా ఇంకా చాలా ఉన్నాయండీఇ :) నేను పెద్ద కార్తీక్ ఫ్యాన్! తెల్సా! :)
He is one of my favorite singers. Few more songs from Karthik that I like:
Cheliya cheliya (Pothe poni)
Telusuko nuvve (Kavya's diary)
Aakasha ganga (Vaana)
Will post you some more soon.
"ఎదుట నిలిచింది చూడు" పాట పాడింది ఇతనా? లిస్టు లో చాలా సూపర్ హిట్స్ ఉన్నట్టున్నాయి. నిజం చెప్పాలంటే నాకు కొత్త తరం సింగర్ల పేర్లు భలే కన్ఫ్యూజనండీ :) . రెహ్మాన్ ఎడా పెడా గొంతుల్ని పరిచయం చేసేస్తూ ఉండటం, వాళ్ళలో కొన్ని మఖలో పుట్టి పుబ్బలో పోయే స్వరాలు కావడంతో నా పరిజ్ఞానం హరిహరన్, ఉన్ని కృష్ణన్ ల దగ్గరే ఆగిపోయింది. ఈ కుర్రాడి పాటల లిస్టు చూస్తే ఇంకా ముప్ఫై ఏళ్లే కాబట్టి భవిష్యత్ బ్రహ్మాండం అని ఈజీగా తెల్సిపోతోంది.
@ ఇందు
అమ్మా ఇందూ మళ్ళీ మాట్లాడితే మహేష్ ఫ్యాన్ అంటావు. మహేష్ "బబు" కాదమ్మా మహేష్ "బాబు". ఇప్పుడు "మహేష్ బాబు" అని ఒక రెండొందల సార్లు ఇంపోజిషన్ రాసుకుని కరెక్ట్ చేసుకో. :))
(బజ్జులో భాస్కర్ గారి సవరణ కి కొనసాగింపుగా :)))) )
బాగారాశారు తృష్ణ గారు.. ఈ మధ్య విడుదలైన "నాపేరు శివ" అనే సినిమాలోని "మనసే గువ్వై" పాట కూడా చాలా బాగా పాడాడు. వినండి.
కార్తిక్ పేరుంటే నేను ఆ పాట ఒకటి రెండు సార్లన్నా విని చూస్తాను.. అది ఎంత అనామక సినిమా అయినా, ఫ్లాప్ సినిమా అయినా.. :)
నాకు తెలిసిన ఇంకొన్ని మంచి పాటలు కార్తీక్ పాడినవి:
గజినీ - ఒకమారు కలిసిన అందం
మిస్టర్ పర్ఫెక్ట్ - బదులు తోచని
విధేయుడు - మనసా (ఇది కార్తిక్, సుమంగళి పాడారు. చాలా బావుంటుంది. ట్రై చేసి చూడడని ఒకసారి)
180 - నీ మాటలో మౌనం నేనేనా!
ఆట - హొయ్ నా..
అనగనగా ఒక ధీరుడు - చందమామలా అందగాడిని
ఆవకాయ్ బిర్యాని - అదిగదిగో, నన్ను చూపగల అద్దం
ఆవారా - చుట్టేసేయ్ చుట్టేసేయ్
చందమామ - రేగుముల్లోలే
బృందావనం - నిజమేనా
దుబాయ్ శీను - once upon a టైం
గణేష్ - లైలా మజ్నూ, రాజా గణరాజా
గాయం -2 - రామ రాజ్యం (సీరియస్ పాట ఇది.. కార్తీక్ గొంతులానే ఉండదు అసలు.. :)
ఘటికుడు - అసలే పిల్లా
గోపి గోపిక గోదారి - బాల గోదారి
హరే రామ్ - సరిగమపదని, లాలి జో
ఝుమ్మంది నాదం - బాలామణి (సంక్రాంతి పాట)
కావ్యాస్ డైరీ - తెలుసుకో నువ్వే
కిక్ - I dont want love, గోరే గోరే
మహాత్మ - ఏం జరుగుతోంది
మిరపకాయ్ - గది తలుపులు
ఆరెంజ్ - చిలిపిగా చూస్తావలా
శుభప్రదం - నీ నవ్వే కడ దాకా
సూర్య s/o కృష్ణన్ - అదే నన్నే నన్నే
తకిట తకిట - కమాన్ కమాన్, మనసే అటో ఇటో
వీడొక్కడే - కళ్ళు మూసి యోచిస్తే
విలేజ్లో వినాయకుడు - నీలి మేఘమా
@ఇందు: చాలా థాంక్స్. నాకు”వాన’లోఆ పాట బాగా ఇష్టమవటం వల్ల నా కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంది..:))
@మయూఖ: మీరు రాసిన పాటలకు కూడా థాంక్స్ అండి.
@శంకర్.ఎస్: కొత్త సింగర్స్ గొంతులు గుర్తుపట్టడం నిజంగా కష్టమే నండీ. పాటలు బాగా నచ్చితే తప్ప ఎవరా అన్నది నేనూ పట్టించుకోను.
హన్నా, మా ఇందుని ఏమన్నా అంటే ఊరుకోము..!!
@వేణు శ్రీకాంత్: అవునాండీ? తెలీడు.వినాలయితే. ధన్యవాదాలు.
@మధురవాణి: ఆహా...మధురా, లిస్ట్ కు బోలెడు థాంక్యూలు. ఇవన్నీ టపాలో ఏడ్ చేసాను.ఇవన్నీ తెలిసిన పాటలే కానీ కొన్ని కార్తీక్ పాడినట్లు తెలీదు..కొన్ని దమయానికి గుర్తురాలేదు..:((
Post a Comment