సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, September 14, 2011

రెండు CDలు

ఏ సినిమానో, నటీనటులెవరో తెలియకపోయినా పదే పదే వినటం వల్ల కొన్ని పాటలు అలా గుర్తుండిపోతాయి. ఇటీవల కొన్న రెండు సీడీలు వింటుంటే చిన్నప్పుడు రేడియోలో పదే పదే విన్న ఆ పాటలన్నీ గుర్తుకు వచ్చి భలేగా ఉంది. ఒక కేసెట్ షాప్ లో నాకు ఇద్దరు సంగీతదర్శకుల పాటల సీడిలూ దొరికాయి. రమేష్ నాయుడు గారు, సత్యం గారూ...ఇద్దరివీ. 60 - 80 ల దాకా గుర్తుంచుకోదగ్గ తెలుగు సినిమా పాటలనందించిన మేటి సంగీత దర్శకులలో ఈ ఇద్దరికీ వారి వారి ప్రత్యేక స్థానాలు ఉన్నాయి.




మొదటిదైన " మెలొడీస్ ఆఫ్ రమేష్ నాయుడు" పాటల సీడీలో గతంలో రమేష్ నాయుడు టపాలో నే రాసిన పాటల లిస్ట్ లోవి దాదాపు చాలా ఉన్నాయి. అందుకని ఆ సీడి లోని పాటల లిస్ట్ రాయటం లేదు.


ఇక రెండవ సీడీ "సత్యం" గారి పాటలది. సీడి లోని ఏభై పాటలూ నాకు తెలియవు గానీ చాలా వరకూ విన్నవే. వాటిలో నాకు ఇష్టమైనవి కొన్ని ఇక్కడ రాస్తున్నా...


నీ కౌగిలిలో _ కార్తీక దీపం
ఏ రాగమో _ అమర దీపం
ఓ బంగరు రంగుల చిలకా _ తోటరాముడు
కలిసే కళ్లలోన _ నోము
ఇది తీయని వెన్నెల రేయి _ ప్రేమలేఖలు
కురిసింది వాన _ బుల్లెమ్మ బుల్లోడు
ఏ దివిలో విరిసిన _ కన్నెవయసు
సిరిమల్లె సొగసు _ పుట్టినిల్లు మెట్టినిల్లు
ఆకాశం దించాలా _ భక్త కన్నప్ప
రాధకు నీవేరా ప్రాణం _ తులాభారం
ఇది మౌన గీతం _ పాలూ నీళ్ళూ
పూచే పూల లోన _ గీత
స్నేహ బంధమూ _ స్నేహ బంధం
అమ్మా చూడాలి _ పాపం పసివాడు

"పాపం పసివాడు” లోని పాట చిన్నప్పుడు రేడియోలో వస్తుంటే పాడేసుకోవటం బాగా గుర్తు నాకు. అప్పట్లో హిట్స్ అయిన పాటలు వింటుంటే ఒక రకమైన ఉత్సాహం అనిపించింది. నేరుగా ఈ పాటలు తెలియకపోయినా రేడియో స్మృతులలో ఓలలాడాలంటే ఈ సీడీలు కొనేసుకోవటమే. అన్నీ గొప్ప పాటలు కాకపోయినా కొన్ని పాటల కోసమైతే కొనుక్కుని తీరాలి అనిపించింది నాకైతే.

6 comments:

Anonymous said...

మీరు లిస్టు చేసిన సత్యం గారి అన్ని పాటలు నేను మనసులో "వినే" పాటలే. "గౌరీ" లో "గల గల పారుతున్న గోదారిలా" , "ఎదురీత" లో "గోదారి వరదల్లో..." కూడా ఈ లిస్టు లో చేర్చదగ్గ పాటలే..
రామకృష్ణ

Indira said...

పూచే పూలలోన సత్యం గారిదా!రాజన్ నాగేంద్ర గారిదని అనుకున్నాను.చాలా మంచి కలెక్షన్.

sunita said...

రమేష్ నాయుడిది ఓ పాట చాలా కాలం నుండీ వెతుకుతున్నాను, దొరకలేదు. మీకేమన్నా దొరుకుంటుందేమో ట్రై చెయ్యగలరా?

మాకూ స్వాతంత్రం కావాలి అనే సినిమాలోది అని డవుటు. "చల్ల గాలి ఈస్తూ ఉంటే కళ్ళల్లోకి చూస్తూ ఉంటే మనసు ఈల వేస్తుంటదీ ఓ బుల్లెమ్మో !సొగసు గోల చేస్తుంటదీ" ---ఈ పాట

SHANKAR.S said...

"రమేష్ నాయుడు" ఈ పేరే చాలండీ. లేత కొబ్బరి నీళ్ళలాంటి సంగీతం గుర్తొస్తుంది. ఒకటా రెండా.... ఎన్ని మెలోడీలు. అసలు ఆయన ఇంకా ఎక్కువకాలం జీవించి ఉంటే తెలుగు సినిమా సంగీతం మరోలా ఉండేదేమో.
ఇందిర గారిలాగే నేను కూడా పూచే పూల లోన పాట రాజన్-నాగేంద్ర గారిదే అనుకుంటున్నా ఇన్నాళ్ళూ. ఎందుకో ఆ పాట వాళ్ళ స్టైల్ లో ఉందనిపిస్తుంది నాకు.

Anonymous said...

"ఏ దివిలో విరిసిన" ఒక మ్యూజికల్ మాస్టర్ పీస్ అని స్వాభిప్రాయం! సంగీత దర్శకుడెవరో ఇన్నాళ్ళకి తెలిసింది! ధన్యవాదాలు తృష్ణ గారూ.
శారద

నైమిష్ said...

"సీతారాములు" లో "తొలిసంజె వేళలో " కూడా best composition..చిన్నప్పుడు రేడియోలో చాలా frequent గా వినే పాట ఇది..good post as usual ...