వైవిధ్య సుమధురగాయని ఎస్.జానకి గారు పాడిన రెండు కృష్ణుని గీతాలను ఈ కృష్ణాష్టమి పూటా బ్లాగ్మిత్రులకు వినిపించాలని...
మొదటిది ఎస్.జానకి గారు ఒక రేడియో ఇంటర్వూ లో వేసినది. తమిళం లో ఒక సినిమా కోసం ఆవిడ స్వయంగా ఈ రాసిన పాటను మళ్ళీ తెలుగులో రాసి ఒక స్టేజ్ ప్రోగ్రామ్ లో పాడినట్లు తెలిపారు. మూడేళ్ళ పాప కృషుడి కోసం పాడుతున్నట్లున ఈ పాటను , జానకి గారి మాటలని క్రింద లింక్ లో వినేయండి మరి ...
|
రెండవ పాట " అంత మహిమ ఏమున్నది గోపాలునిలో.." అనీ మద్రాసు ఆకాశవాణి రికార్డింగ్.
రచన: ఎం. గోపి (వీరు అతి తక్కువగా మంచి సినిమాపాటలు కూడా రాసారు)
|
కవిత్వంలో నిందాస్తుతి లాంటి ఈ పాట సాహిత్యం బావుంటుందని ఇక్కడ రాసాను:
నన్ను నేను మరిచేందుకు వాడి ధ్యాసలో
1చ: యశోదమ్మ తల్లైతే అంతా కన్నయ్యకే
రేపల్లె వంటి పల్లేలో అందరూ గోపాలురే
ఊరివారు భరియిస్తే ప్రతివారూ ఘనులే
అంత మంది వరియిస్తే అందరూ శ్రీకృష్ణులే ((అంత మహిమ))
2చ: చిరునవ్వులె తప్ప తనకు నిట్టూర్పులు తెలుసా
ఆలమందలేమో గానీ ఆలివెతలు తెలుసా
వెదురుల రుచి తెలిసినంత పెదవుల రుచి తెలుసా
గీత పలికెనేమో గానీ ఈ రాధ గీత తెలుసా ((అంత మహిమ))
------------------
12 comments:
మొదటి పాట చాలాసార్లు విన్నా.
రెండో పాట సాహిత్యం బాగుంది
మా నాన్న అక్బర్ అయితే నేను........లా అనుకోక పోతే
మంచి కుటుంబం లో పుట్టిన ఎక్కువ మంది మంచి వాళ్ళవుతారు అన్నది నిజం.
మంచి సమాజం కోసం మంచి కుటుంబం పునాది.
kRshNaashTami SubhaakaankshalanDee.
Janaki garu great kadaa!!!
మొదటి సారి జానకి గారు పూర్తి పాట చిన్న పిల్లల వాయిస్ లో పాడటం వింటున్నానండీ. "కృష్ణా నువ్వెక్కడా? రావా ఇక్కడికి" అని ఇంత ముద్దుగా పాడితే ఎందుకు రాడూ. రెండవ పాటలో తనని తాను మరచి పాడుతున్నట్టు గా ఉన్నప్పటికీ కృష్ణుడిని ఆడుకుందాం రా అని పిలిచిన మొదటి పాటే నాకు విపరీతం గా నచ్చేసిందండీ. కేవలం జానకి గారికి మాత్రమే స్వంతమైన శైలి ఇది. ఇంత అరుదైన పాట శ్రమకోర్చి మాకు అందించినందుకు మీకు బోలెడు థాంకులు.
dear thrishna,janakigaru is a versatile genius.i heard that she is a very good painter also.i think i've seen her KRISHNA paintings.i dont remember exactly.her voice is ageless.thanks for sharing.
@ఆత్రేయ: మీ వ్యాఖ్య అర్ధం కాలేదండి. తిట్టలేదని మాత్రం అర్దం అయ్యింది..:))
ధన్యవాదాలు.
@వెన్నెల: బాగున్నారా? వెన్నెల దాక్కుంటే ఎలా? అప్పుడప్పుడూ కనబడాలి కదా..
ధన్యవాదాలు.
@శంకర్.ఎస్: చిన్నప్పటి నుండీ వింటూ వచ్చినవి కాబట్టి నాకు రెండు పాటలూ చాలా ఇష్టం.నిజంగానే నాకు శ్రమేనండి.కేసెట్ లోంచి పి.సిలొకి,మళ్ళి దాన్ని ఎం ప్3,మళ్ళి దాన్ని నెట్ లో సేవ్ చెయ్యటం,లింక్ తెచ్చి బ్లాగ్ లో పెట్టడం సాంకేతిక విషయాలు తెలియని నాబోటి మామూలు మనుషులకు బ్రహ్మవిద్యే నండీ.
ధన్యవాదాలు.
@ఇందిర:అవునా..కనుక్కుంటానుండండి..
ధన్యవాదాలు.
ప్రతిపదార్ధం రాయమంటారా?
మీరిచ్చిన సాహిత్యం లో
యశోద లాంటి అమ్మ
రేపల్లె లాంటి ఊరు
గోపికల్లాంటి భక్తులు
కష్టం తెలియని జీవితం
భార్య పెట్టే నస లేకపోవటం
అంటూ కృష్ణుడిని దేప్పే ఆ సాహిత్యం
(పై పరిస్తితులన్నీ ఉంటే ప్రతీ వారు కృష్ణుడే )
మా నాన్న అక్బర్ అయితే నేనూ ...అన్న బ్రహ్మానందం లాగా
మంచి కుటుంబం లో పుడితే అందరూ మంచి వాళ్ళే
అలాంటి మంచి కుటుంబాల కలయికే మంచి సమాజం అని (నా) కవి హృదయం
అర్ధం చేస్కోరూ........!!
పెతీది ఇమర్స గా సెప్పాలంటే కుదర్దు మరి.
అసలు కామెంట్లు రాలేదని నాలాటోడు ఏడుస్తుంటే
వచ్చిన కామెంట్లు గబుక్కునే వేసేస్కోక
అర్ధం కాలేదని తిరుగు కామెంట్లా?
మిమ్మల్ని కనిమోలి పక్క సెల్ లో పెట్టా..!!
@ఆత్రేయ: అర్ధం కాలేదు కాబట్టే అడిగాను... అర్ధం రాసి ఊరుకోవచ్చు కదా.. ఈ శాపాలేంటండి..:((( అమ్మోయ్..బాబోయ్...ఎరక్కపోయి అడిగాను..:)
@ తృష్ణ, బాగుంది...
@ఆత్రేయ,
LOL
@ ఇందిర,
ఆవిడ పెయింటర్ అని తెలియదు నాకు. కొత్త విషయం తెలుసుకున్నాను.
అంత మహిమ ఏమున్నది గోపాలుడిలో నన్ను నేను మరిచేందుకు వాడి ధ్యాసలో
please post the above song
@ucgoud : sorry for the delayed reply. i forgot how i uploaded before and all that process. very sorry.
Post a Comment