ఈసారి రాఖీ పండుగ డల్లుగా ఉంది..:((
రాఖీ కట్టగానే "फोलों का तारोंका सबका कहना है.. लाखहजारो में मेरी बहना है.." అని పాడేందుకు అన్నయ్య ఉళ్లో లేడు, తమ్ముడు కూడా ఊళ్ళో లేడు ! ఊరేళ్ళేముందు ఇద్దరికీ రాఖీలు ఇచ్చి పంపేసా కట్టుకోండర్రా అని. ఏం చేస్తాం తప్పదు కొన్నిసార్లు. పోస్ట్ లో పంపగలిగినవాళ్ళకు రాఖీ పంపేసా. గ్రీటింగ్స్ మాత్రమే పంపటం కుదిరే వాళ్ళకు గ్రీటింగ్స్ పంపాను.
ఈసారి ఒకరికి మొదటిసారి రాఖీ పంపాను. అందిందని చెప్పి మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. మొదటిసారి మాట్లాడినందుకు. నా అభిమానంపై వారికి నమ్మకం ఉన్నందుకు. ఏ బంధం ఎక్కడ మొదలై ఏ రూపు దాలుస్తుందో ఎవరూ చెప్పలేరు...మనలోని నిజాయితీని అవతలివాళ్ళు నమ్మితే, అవతలవాళ్ళకు మనపై నమ్మకం ఉంటే, మనకూ వారి నిజాయితీ పై నమ్మకం ఉంటే, అది కాలాన్ని తట్టుకుని నిలబడితే ఏ బంధమైనా కలకాలం నిలుస్తుంది.

10 comments:
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు :)
నేను రాఖీ కట్టుకున్నానోచ్. :)
థాంక్ యు
నేనే అడుగు దామనుకున్నా
పని వత్తిడి లో కుదరలేదు
కానీ ఇలా ఈ- గ్రీటింగ్ కాదు
నిజ్జం రాఖీ
తిభువన్ దాస్ ఝవేరీ లో కొన్న డైమండ్ రాఖీ !!
గాడ్ బ్లెస్ యు!!
అన్న
మీక్కూడా రాఖీ శుభాభినందనలు తృష్ణా. తప్పకుండా మీ నమ్మకం నిలబడుతుంది. All the best.
@హరే కృష్ణ: ధన్యవాదాలు.
@శంకర్.ఎస్: చాలా సంతోషం..:) ధన్యవాదాలు.
@ఆత్రేయ: అయితే ఈసారి రాఖీనే పంపిస్తాలెండి. ధన్యవాదాలు.
@జయ: చాలా థాంక్సండి.
ఆత్రేయ గారూ, ఇందాకా మర్చిపోయానండీ...నేను రాఖీ మామూలుదే పంపుతాను కానీ మీరు అడిగిన చోట్లోంచి గిఫ్ట్ నాకు కొనిద్దురుగాని..:))(అప్పుడు మీరు ఇచ్చినట్లు ఎవరికీ చెప్పనులెండి)
తృష్ణ గారూ !
రాఖీ ( శ్రావణ ) పౌర్ణమి శుభాకాంక్షలు.
రాఖీ శుభాకాంక్షలు తృష్ణ గారు..
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తృష్ణ గారు...
రావు గారూ, వేణూ గారూ, రవికిరణ్ గారూ, ధన్యవాదాలు.
Post a Comment