ఒకప్పుడు పండగ అంటే పూజకు చాలావరకూ అవసరమైనవి రైతులో, తెలిసినవాళ్ళో తెచ్చి ఇచ్చేస్తూ ఉండేవారు అన్నీ ఫ్రీగా..!!
మరి ఇప్పుడో...
కొబ్బరికాయ పదిహేను రూపాయిలు..
పది తమలపాకులు పాతిక రూపాయిలు..
డజను అరటిపళ్ళు ముఫ్ఫై ఐదు రూపాయిలు..
పావు కిలో పువ్వులు ఎనభై రూపాయిలు..
అమ్ముతున్నారని ముచ్చటగా "మొగలిపువ్వు" కొనబోతే ఏభై రూపాలట..
ఇక సరదాలకి పోయి తామర పూలు, అరటి పిలకలు ...అనుకుంటే ఇక పర్సు ఖాళీ...
బస్సు ఎక్కలేక ఆతో పిలిస్తే మీటరు తిరగదు కానీ వాళ్ళు చెప్పే రేటు వింటే కళ్ళు తిరుగుతున్నాయి...!!
12 comments:
ఎప్పటినించో పండగలంటే బెంబేలు పడే పరిస్థితి.ఈమధ్య మరీ ధరలు పెరిగిపోయినా....పండగ సరదాలు,సంబరాలు జరుపుకోవాలని ఆశపడేవారు ఉన్నంతకాలం ఈ దోపిడీ జరుగుతునే ఉంటుంది :)
భక్త జన సులభుడు, ఆశ్రిత మందారుడు మనస్ఫూర్తిగా ఒక నమస్కారం పెట్టితే కాదంటాడా? వరాలు ఇవ్వడా?
ha ha ha ....
ee rojullo pandaga ante jebulaku chillulu.....
హహహ నిజమే!! బయట కొనుక్కుంటే ఇలానే ఉంటోంది. కొన్నిటిని ఇంట్లో పెంచుకుంటూ మిగతావి కొనుక్కుంటే కానీ వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడయినట్టు ఉండదు.
అదేంటో నండీ
జీతాలు పెరిగినప్పుడూ,
డీఏ పెరిగినపుడూ,
అప్రైజల్ అయి బాగా లాభ పడినప్పుడూ
పెరిగాయని ఫీల్ అవ్వం
ఇలా తమల పాకులూ పూలూ పళ్ళ రేట్లు పెరిగాయని
ఎందుకనుకుంటాము..?
ఎందుకంటే
మొదటిది అర్థమేటిక్ ప్రోగ్రెషణ్
రెండోది జామేట్రిక్ ప్రోగ్రెషణ్ !!
అంతేనా?
బావుంది. నిజంగానే దోచేస్తారు పండగలప్పుడు. (అందరికీ లచ్చిం దేవి పండగే ! వాళ్ళకి నాలుగు కాసులు రాలొద్దూ !) :D
panduga vaste dandaga...anta...:))
చూసారా ఇలాగైనా పండక్కి ముందే దేవుడు కనిపించేస్తున్నాడు. :)))). కొన్నాళ్ళు పోతే ఆన్లైన్ లో పూజ చేసుకోవడమే బెటరవుతుందేమో.
భియ్యం కిలొ 35/-
కంది పప్పు కిలొ 70/-
నునె 82/-
మరి ఇవన్ని కొనాలి కదా .....
ఈ ధరలకి అమ్మితె కాని వాల్లకి కుదరదు.........
వాల్లకీ ఒక రేసొన్ ఉంది.
@ ఇందు: కరక్టేనేమో..ధన్యవాదాలు.
@ బులుసు సుబ్రహ్మణ్యం: కాదనడండీ..కానీ అలా అని ఓ దణ్ణం పెట్టి ఊరుకోలేము కదా..సరదాలు శృతి మించకుండా ఉంటే వాటిక్కూడా భక్తిలో భాగమివచ్చనిపిస్తుందండీ నాకు..ధన్యవాదాలు.
@ వంశీ మద్దిపాటి: అలాగే ఉందండీ పరిస్థితి..ధన్యవాదాలు.
@రసజ్ఞ: పెంచుకోవాలని ఆశ ఉన్నా అన్నివేళలా అన్నీ కుదరవు కదండీ..ధన్యవాదాలు.
@ఆత్రేయ : నాకు ఈ లెఖ్ఖల భాష అస్సలు అర్ధం కాదండీ ...అయినా మాకు డిఏలూ గట్రాలు తెలీదండి ...మేము ప్రభుత్వేతర ఉద్యోగులం కాబట్టి మాకాలాభాల సంగతి తెలీదు మరి..:))
ధన్యవాదాలు.
@sujata:అవునవును..అంతేనేమో..ధన్యవాదాలు.
@ సాయి: :) ధన్యవాదాలు.
@ శంకర్.ఎస్: 'ఆన్ లైన్ 'లో పూజ..ఈ కాన్సెప్ట్ ఏదో బానేఉండండీ..:) ధన్యవాదాలు.
@సిరి: పైవాళ్ళకీ, క్రిందవాళ్ళకీ అందరికీ రీజన్ ఉందండీ.. ఎటొచ్చీ మధ్యలో ఉన్న మనకే ఏ రీజనింగూ సూటవ్వట్లేదు..:)
ధన్యవాదాలు.
Post a Comment