"మో" ఎవరు అని అడిగే ఎవరన్నా రేడియోలో ప్రసారమైన ఈ ప్రసంగం వినవలసిందే...
"నేనెందుకు రాస్తున్నాను.." అని 28 -11 -89 లో (అంటే సుమారు 22 సంవత్సరాల క్రితం) ప్రసారమైన మోహన్ ప్రసాద్ గారిది ఒక రేడియో ప్రసంగం ఉంది. అది కేసెట్లో రికార్డ్ చేసాం ప్రసారమైనప్పుడు. చాలా సార్లు వింటూ ఉండేవాళ్ళం. ఎంతో బాగా మాట్లాడారు మోహన్ ప్రసాద్ గారు ఇందులో. క్రిందన ఇస్తున్నాను. నాన్న ద్వారా తెలిసిన ఆయనపై అభిమానంతో ఈ ఆడియో లింక్ ఇక్కడ పెడుతున్నాను..
|
కొన్నేళ్ళ తర్వాత మళ్ళి ఇవాళ ఈ కార్యక్రమం వింటుంటే కాలం ఎలా పరుగులు తీస్తుందో కదా అనిపించింది...ఒకనాడిలా వీరిని గురించిన దుర్వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు..! మొన్న వారికి తనికెళ్ళ భరణి సాహితీ అవార్డ్ వచ్చినప్పుడు కూడా నాన్న అనుకున్నారు వెళ్లి కలవాలి అని..ఇంతలోనే ఈ దిగ్భ్రమ వార్తా !
*** *** ***
పొద్దున్నే టివిలో స్క్రోలింగ్ లో ఒక వారట చూసి వెంతనే నాన్నకి ఫోన్ చేశా..ఇది నిజమేనా? అని..
నిజమేనన్నారు... ఎంతో దిగులు వేసింది..
ఏవో జ్ఞాపకాలు అలా ముసిరాయి..
ఆకాశవాణి వార్షిక పోటీలకు రేడియో వాళ్ళు చేసిన ప్రతి అవార్డ్ ప్రోగ్రాం ఢిల్లీ కి వెళ్ళే ముందు వాటిని అక్కడి జడ్జస్ చదవటానికి వీలుగా తెలుగుతో పాటుగా హిందీ లోకీ, ఇంగ్లీషు భాషల్లో కీ మొత్తం కార్యక్రమాన్ని అక్షర రూపంలో ట్రాన్స్లేట్ చేసి , వాటికి ఓ పుస్తకం గా బైండ్ చేసి కార్యక్రమంతో పాటుగా పంపేవారు. అలా నాన్న చేసిన కొన్ని కార్యక్రమాలను ఇంగ్లీషు లోకి అనువదించారు ఆధునిక తెలుగు కవులలో 'మో' గా ప్రసిధ్ధి చెందిన శ్రీ వేగుంట మోహన్ ప్రసాద్ గారు. వారు నాకు మొదట తెలిసింది నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో. వారు నాకు మొదట తెలిసింది నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో. అప్పుడు ఆయన విజయవాడ సిద్దార్ధా కాలేజిలో ఇంగ్లీషు లెక్చరర్ గా చేసేవారు. మొదట వారు అనువదించినది 'నేను కాని నేను' అనే కార్యక్రమాన్ని. అది మోహన్ ప్రసాద్ గారికి చాలా నచ్చింది. నాన్న కలవటానికి వెళ్ళినప్పుడు లోపలి తీసుకువెళ్ళి ఎంతో అభిమానంగా మాట్లాడారుట. ' ఇలా ఇంటి లోపలి చాలా తక్కువమందిని అనుమతిస్తాను..' అన్నారని నాన్న సంతోషంగా చెప్పటం నాకింకా గుర్తు.
రేడియో కార్యక్రమాలను అనువదించేప్పుడు సాధారణంగా తెలుగు స్క్రిప్ట్ చదివి ఆంగ్లంలోకి రాసేస్తుంటారు. కానీ మోహన్ ప్రసాద్ గారు ప్రోగ్రాం కేసెట్ అడిగి , వినీ ఆంగ్లంలోకి అనువాదం చేసేవారుట. ఢిల్లీలో జడ్జీలు కూడా ఎవరు అనువాదం చేసారు అని అడిగి, చాలా బావుందని మెచ్చుకునేవారుట . ఈ అనువాదాల కారణంగా నాన్నకు అపురూపమైన వారి స్నేహం లభించింది. అప్పుడప్పుడు కలిసినప్పుడు కబుర్లు మాతో చెప్పేవారు. అలా 'మో' గారిని ఎప్పుడూ కలవకపోయినా నాన్న ద్వారా తెలుసు. అప్పుడప్పుడు మోహనప్రసాద్ గారివి కొత్త పుస్తకాలు ప్రచురణ జరిగినప్పుడు నాన్నకు ఒక కాపీ పంపేవారు. క్రింద ఫోటోలోది అలా వారు పంపిన పుస్తకంలోని వారి సంతకం..
శ్రీ వేగుంట మోహన్ ప్రసద్ గారి గురించి రచయిత్రి చంద్రలత గారు పుస్తకం.నెట్ లో రాసిన వ్యాసం ఇక్కడ చూడవచ్చు.
10 comments:
తృష్ణా
చాలా మంచి పని చేశారు ఇక్కడ ఈ ఆడియో ఇవ్వడం ద్వారా...
@afsar: మోహన్ ప్రసాది గారికి నేనందించగలిగిన అంజలి ఇదేనండి..
ధన్యవాదాలు.
నేను 'మో' గారి గురించి మొదటి సారి ఆయనకు తనికెళ్ళ భరణి గారి అవార్డు ఇచ్చినప్పుడే విన్నానండీ. అంతలోనే ఈ వార్త. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.
ఇంకా ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారూ!! మీరు చాలా లక్కీ మీ నాన్నగారివల్ల బోలెడుమంది పరిచయమయ్యే భాగ్యం దక్కింది.
తృష్ణా,
ఎలా థాంక్స్ మీకు చెప్పుకోవాలో తెలియటం లేదు. మీ నాన్నగారు అంత శ్రద్ధగా వాటిని దాచిపెట్టడం, మీరు ఈ విషాద సమయంలో మళ్ళీ మాకు మో స్వరాన్ని, అరుదైన కొన్ని జ్నాపకాలను మాకు అందివ్వటం చాలా విషాదకర సన్నివేశం లో కొంత ఓదార్పు.
నాన్నగారికి నమస్కారాలు తెలియచేయండి.
తృష్ణ గారూ !
చాలా బావుంది, ' మో ' గారికి నివాళిగా అందించిన ప్రసంగం. ఆ సాహితీమూర్తికి నీరాజనాలతో...
చాలా గొప్ప కానుక ఇచ్చారండీ, మో అభిమానులకే కాదు, కవిత్వమంటే ఇష్టపడే వారందరికీనీ.
@afsar gaaru,
@shankar.s gaaru,
@ indu gaaru,
@ kalpana gaaru,
@ S.R. Rao gaaru,
@ kottapali gaaru,
Thanks a lot.
సర్ ఆ ఆడియో ఫైల్ లింక్ కనిపించడం లేదు .
మా లాంటి వాళ్ళు తెలుసుకోడానికి ఆ లింక్ కానీ ఆడియో కాని అప్లోడ్ చేయగలరా మల్లోసారి
@Margaret Mercy: will surely update..thank you.
Post a Comment