సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, June 18, 2010

ఒక పాత కవిత...

ఏవో పుస్తకాలు సర్దుతూంటే ఎప్పుడో '97లో రాసిన కవిత ఒకటి కనిపించింది...చాలా రోజుల్నుంచి ఇది ఎందులో, ఎక్కడ ఉందా అని వెతుకుతున్నా..!


పట్టుచీరల రెపరెపలు, ఘాటు సెంట్ల గుబాళింపులు...
మొహమాటపు చిరునవ్వులూ, ప్రెస్టేజీ షోఅప్ లూ...
మనిషినే శాసిస్తున్న కరన్సీ నోట్లు, బ్యాంక్ బేలన్సులు...

ఇవి ఏవీ దాచలేవు - మనిషి మనసు తహతహలూ
అవి - ఎగసిపడే అంతులేని ఆశాకెరటాలు

ఇవి ఏవీ దాచలేవు - పిడికెడు గుండె సవ్వడులు
అవి - గొంతు చీల్చుకు పైగెగసే అనురాగసౌధాలు

ఇవి ఏవీ దాచలేవు - మూగకళ్ళ కన్నీటి వ్యధలు
అవి - మోముపై కదలాడే మనోభావతరంగాలు

కానీ ఇవి అన్నీ...
వెలికి రానీయవు మనిషిలోని మమతను
అజ్ఞాతమైపోయిన మానవత్వపు వెలుగును !!

7 comments:

జయ said...

జీవిత సత్యం తెలియచేసే ఈ కవిత చాలా బాగుంది . అన్నట్లు ఆరోగ్యం ఎలా ఉంది.

హరే కృష్ణ said...

సూపర్

పరిమళం said...

ఓహ్ ...కవిత బావుంది ...బొమ్మ అతికినట్టు సరిపోయింది ముసుగువేయ్యొద్దు మనసు మీద ...అన్నట్టు !

Somasekhar said...

చాలా బావుందండీ. 97 లోనే (బహుశా ఇంకా ముందు నుంచే) మీరు కవితలు రాయటం మొదలు పెట్టారంటే ఈ పాటికి మీ దగ్గర వాటివి ఒక పెద్ద సంకలనం తయారై ఉండాలి. వాటిలో నుంచి ఇలా ఇంకా మరెన్నో మేము భవిష్యత్తులో ఈ బ్లాగులో చదవగలమని ఆశిస్తున్నాము.

శివ చెరువు said...

baagaa raasaarandi..

తృష్ణ said...

@జయ: పర్వాలేదండీ..బండి నడుస్తోంది...:)thankyou verymuch for the concern.

@హరేకృష్ణ: ధన్యవాదాలు.
@పరిమళం:ధన్యవాదాలండి.

తృష్ణ said...

@సోమశేఖర్ : నేను ఇంటర్లో ఉన్నప్పటినుంచీ రాసేదాన్ని...(తెలుగులోనే కాక షాయరీలు కూడా) చిన్నప్పుడైనా కొన్ని మంచివి ఉండేవి కూడా...కానీ దాచుకోలేకపోయాను...ప్రస్తుతం ఉన్నదంతా వర్తమానమే..:)

@శివ చెరువు: థాంక్స్ అండి.