పాట్ పైంటింగ్...దాంట్లో పెట్టిన ఫ్లవర్స్ కూడా నేను తయారు చేసినవే.
అప్పట్లో "ఉత్తరాలు" బాగా రాసుకునేవాళ్ళం కాబట్టి, ఉత్తరాలు పెట్టుకునేందుకు గోడకు పెట్టుకునేలాక్రాస్ స్టిచ్ తో చేసింది .. ఉత్తరాలు పెట్టుకుందుకు వెనకాల క్లాత్ తో మూడు అరలు కుట్టాను..







విశ్వకవి రవీంద్రుని(1861–1941) గురించి ప్రత్యేకించిన పరిచయం అవసరం లేనేలేదు. దాదాపు అన్నిసాహితీ విభాగాల్లోనూ అందవేసిన చెయ్యి ఆయనది. ఒక సంపూర్ణ కళాకారుడాయన. కవిగా, కథకునిగా, వ్యాస రచయితగా, నవలా రచయితగా, నాటక రచయితగా, సంగీతకారునిగా, గాయకునిగా, చిత్రకారునిగా ఎన్నో అవతారాలెత్తారు. కానీ అన్నింటిలోకీ ముఖ్యంగా ఆయన ఒక కవిగానే మనకు ఎక్కువ కనిపిస్తారు. ఏభైకు పైగా ఉన్న గేయ సంపుటిలు, అందులోని రెండువేలకు పైచిలుకు గేయాలు, 1913లో ఆయన సాహిత్యానికి అందిన "నోబుల్ పురస్కారం" అందుకు నిదర్శనం.
ఇక లిటిరేచర్ స్టూడెంట్ గా డిగ్రీలోనూ, పిజీలోనూ కూడా ఆయన రచనలు కొన్నయినా చదివే అవకాశం లభించటం, దాదాపు పదిహేనేళ్ళ క్రితం మా కలకత్తా ప్రయాణంలో "శాంతినికేతన్" ను చూడటం నా అదృష్టంగా భావిస్తాను నేను. ఆ ప్రయాణంలో కలకత్తాలో మాకు HMVవాళ్ళ రవీంద్రుని సొంత వాయిస్ తో రికార్డ్ చేయబడిన ఆయన కవితలూ,పాటలూ ఉన్న కేసెట్ ఒకటి దొరికింది. అందులో ని ఒక పాటనూ, ఒక రెసిటేషన్ నూ ఇక్కడ పెడుతున్నాను.
(young Tagore)
Tagore's recitations and one song in his own voice:
ఆయన పర్సనాలిటీని, ఫోటోలను చూసి ఆయన గొంతుక చాలా గంభీరంగా ఉంటుండని అనుకునేదాన్ని... కానీ విన్నాకా ఓహో ఇదా ఆయన గొంతుక అనిపించింది. పైగా ఇది ఆయనకు కాస్త వయసు పైబడిన తరువాత చేసిన రికార్డింగా నాకు తోచింది. రవీంద్రుడు స్వయంగా రాసి, స్వరపరిచి "రవీంద్ర సంగీతం"గా ప్రఖ్యాత గాంచిన కొన్ని గీతాల గురించి నా తరువాతి టపాలో....
కొన్ని "శాంతినికేతన్" ఫొటోలు...











అప్పటి "ఆంధ్రప్రభ" దినపత్రిక ఎడిటర్ దీక్షితులు గారి ఆధ్వర్యం లో తెలుగు సినిమా చరిత్ర గురించిన రకరకాల విశేషాలతో ప్రచురించబడిన "మోహిని(రెండు భాగాలు)" అనే పుస్తకంలో ఎందరో ప్రముఖుల చేత ఎన్నో వ్యాసాలు రాయించారు. ఆ పుస్తకం లో బాలూ ఇంటర్వ్యూ కోసం, విజయవాడ ఆకాశవాణి వార్తా విభాగం లో పనిచేస్తున్న బాలు చిరకాల మిత్రులు ప్రసాద్ గారితో పాటూ, ఆ ఇంటర్వ్యూ రికార్డ్ చేయటానికి నాన్నగారు కూడా నెల్లూర్లోని బాలుగారి ఇంటికి వెళ్ళారు. రెండు గంటలపాటు జరిగిన ఆనాటి ఇష్టాగోష్ఠి, చెప్పుకున్న కబుర్లు మరపురానివని నాన్న చెప్తూంటారు.
