సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, May 12, 2010

చాలా మంచి కథ...


పొద్దుటే నాన్నగారింట్లో మొన్నటి సాక్షి ఆదివారం పుస్తకం(9-5-10) తిరగేస్తుంటే ఆసక్తికరమైన కథ చదవటం జరిగింది. "మహమ్మద్ ఖదీర్ బాబు" గారు రాసిన ఈ కథ నాకు చాలా నచ్చేసింది. రచనా శైలి అద్భుతంగా ఉంది. రాసినది ఎవరా అని చూస్తే, నాన్న దగ్గర నేను ఇదివరకు చదివిన "మన్ చాహే గీత్" అని హిందీ సినీ గీతాలూ, సంగీత దర్శకులూ, కొందరు సింగర్స్ గురించీ రాసిన పుస్తక రచయతే ఈయన అని అర్ధమైంది.

ఇక ఆయన వివరాల్లోకి వెళితే ఖదీర్ బాబు గారు సాక్షిలో ఆదివారం మాగజైన్ ఇన్చార్జ్ అనీ అదివరలో ఆయనకు 1999లో "కథా అవార్డ్" , ఇంకా "భాషా సమ్మాన్ అవార్డ్", "చాసొ అవార్డ్" మొదలైన పురస్కారాలు లభించాయని తెలిసింది. అంతేకాక "దర్గామిట్ట కథలు" "పోలేరమ్మ బండ కథలు" "పప్పూజాన్ కథలు " మొదలైన కధాసంపుటిలు రాసారని తెలుసుకున్నాను. నేను చదివిన "మన్ చాహే గీత్" పుస్తకం మాత్రం చాలా బాగుంటుంది. పాత హిందీ సినీగీతాలు ఇష్టపడే ప్రతివారూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. మిగిలిన పుస్తకాలు కూడా అర్జంట్ గా కొని చదివేయాలని డిసైడైపోయాను...:)


సాక్షిలో ప్రచురించబడిన కథ ఈలింక్ "ఇక్కడ"(page.no.12) చూడండి. కథలంతే ఇష్టమున్న ప్రతివారికీ ఈ కథ తప్పక నచ్చుతుందనీ, మొన్న ఆదివారం చదవటం మిస్స్ అయినవారు ఉంటే చదువుకోవటానికి వీలుగా ఈ లింక్ ఇస్తున్నాను.


12 comments:

శేఖర్ పెద్దగోపు said...

అవునండీ..చాలా మంచి కధ..నాకు తెగ నచ్చేసింది..సున్నితమైన హాస్యంతో చక్కగా అలరించారు..ఈ కధతో నేను ఖదిర్ బాబు గారికి ఫ్యాన్ అయిపోయాను..ఇది వరకూ కూడా ఒక కధ చదివాను ఆయనది...చాలా మంచి పాయింట్లతో రాస్తారు కధని...

విశ్వ ప్రేమికుడు said...

థాంకూ... :)

నాగేస్రావ్ said...

"ఇక ఆయన వివరాల్లోకి వెళితే ఖరిద్ బాబుగారు.."
పాపం ఆయన 'ఖరీద్' మార్చేసారేమిటండీ?

జయ said...

నిజంగానే ఇది చాలా మంచి కథ తృష్ణా. నేనూ చదివాను. చివరిదాకా నవ్వుతూనే ఉన్నాను. కాని ఈ కథలోని అంతర్మధనం ఆలోచింపచేస్తుంది.

VARA said...

Sakshi papers koodaa chadvochaa andi....ante kallu mossukoni ilaanti features pages ki velaalemo......main papers vadilesi.......

కొత్త పాళీ said...

థ థ .. కథ .. మీరు కూడా కధ అని రాయడం బావులేదు :(

తృష్ణ said...

@శేఖర్ : నరేటింగ్ స్టైల్ కూడా ఆకట్టుకుంటుందండీ. "మన్ చాహే గీత్" పుస్తకం చదివినప్పుడే నేనూ ఫ్యాన్ అయిపోయానండీ.

@విశ్వప్రేమికుడు: మీక్కూడా... :)

@నాగేస్రావ్: మొదటిపేరాలో పేరు రాసినప్పుడు సరిగ్గానే రాసానండి...రెండోసారి టైపింగ్ మిస్టేక్...సరి చేసాను..ధన్యవాదాలు.

తృష్ణ said...

కొత్తపాళీ: సరిచేసేసాను మాష్టారూ...!! కానీ నా తప్పు లేదండీ...నేను ఈ "తెంగ్లీషు" టైపు చేస్తున్న దాంట్లో ఎంత ప్రయత్నించినా ఆ పొట్టలో చుక్క రాలేదండీ...ఇప్పుడు కూడా మీ వ్యాఖ్య లోంచి ఆ పదం కాపీ చేసి పేస్ట్ చేసాను...:)

(కాగితం మీద రాస్తే మాత్రం ఖచ్చితంగా కరక్ట్ గానే రాస్తానండీ:))

కొత్త పాళీ said...

in RTS, (like lekhini, etc.) it is spelt "tha"

Bhãskar Rãmarãju said...

పొట్టలో చుక్క ఇలా కథ, katha రాసి సూడండి.

తృష్ణ said...

@kottapali: thanQ sir..i got it!!

@bhaskar ramaraju: finally got it...thanQ !!

Anonymous said...

ఈ కథ నాకు కూడా నచ్చింది.
వేరే ఏదో బ్లాగులో కామెంట్ కూడా వ్రాసాను.
ఖదిర్ బాబు గారి దర్గామిట్ట కథలు చాలావరకు చదివాను.