సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, May 20, 2011

కాకరపాదే !!


బుజ్జి బుజ్జిగా తలలెత్తిన కాకరపాదు తాలుకూ "బుజ్జి మొక్కలు" ఫోటోలు పెడితే రావికొండలరావుగారి "ఆనప్పాదా? బీరపాదా" జోక్ లాగ ఇవి కాకరపాదు మొక్కలేమిటి? అని సందేహం వచ్చింది కదా మిత్రులకు...అందుకని ఇదిగో అసలు ఆకులు వచ్చాయి. ఇందాకా తీసాను ఫోటోలు. జాగ్రత్తగా గమనిస్తే కాకరపాదుకే ఉండే స్ప్రింగ్ లాంటి సన్నని తీగెలు కూడా కనిపిస్తాయి. ఆ స్ప్రింగ్ లాంటి తీగెలను దేనికి చుడితే దానిపైకి(కర్ర్ర, తాడు etc) పాదు పాకుతుంది.





హమ్మయ్యా ! నమ్మారా ! ఇక హాయిగా బుజ్జి బుజ్జి కాకరకాయల గురించి కలలు కంటా !
గింజ గట్టిపడని లేత కాకరకాయలు కాయ పడంగా వండుకుని తింటే... ఆహా...!!


6 comments:

సుజాత వేల్పూరి said...

రావి కొండల రావు గారి జోకు గుర్తున్నందుకు సంతోషం, ఆశ్చర్యం కూడా!

సరే, కాకరపాదే! ఒప్పుకుంటున్నాం! ఇందుకు కాను ఒక అరకిలో కాకరకాయ్లు...ఏవి, మీ పాదుకు కాసినవి పంపండి! అసలే కాకరకాయ నాకిష్టం!

తృష్ణ said...

@సుజాత: హై...same pinch. నాక్కూడానండీ..:)

అనిర్విన్ said...

తృష్ణగారు, రెండాకుల మీద ఉన్నప్పుడు ఆకులు పెళుసుగ ఉండి అలా అనిపించింది. ఇప్పుడు సిసలైన కాకరతీగ కనిపిస్తుంది. Thanks for sharing the pics once again.

Sunita.R said...

తృష్ణ గారు,
ఇలాంటి గార్డెనింగ్ బ్లాగులు దొరుకుతాయేమోనని ఇంటర్నెట్ అంతా వెతికానండి. చివరికి మీ బ్లాగ్ లో దొరికింది. మొన్న కట్టె పొంగలి తిన్నప్పటినుంచి మిరియాలు చెట్టు నాటాలని ఒక వెరైటీ కోరిక వచ్చిందండీ. ఇంత వరకూ ఎవరూ ఇంటిలో పెంచటం చూడలేదు అనుకోండి. దీనికి విత్తులు బయట దొరులుతాయా? వివరాలు తెలిస్తే చెప్పగలరు

తృష్ణ said...

సునీత గారు,
నాది పెద్ద గార్డెన్ కాదండి. ఏదో సరద కొద్ది పెంచుకునే కుండీల్లో మొక్కల కబుర్లే నావి. మిరియాల చెట్లు ఎలా పెంచుతారో నాకు తెలీదండి. ఆ చెట్ల ఫోటోలు క్రింద లింక్లో చూడండి:
http://www.google.co.in/search?q=black+pepper+tree&hl=en&rlz=1G1GGLQ_ENIN330&biw=1003&bih=591&prmd=ivns&tbm=isch&tbo=u&source=univ&sa=X&ei=jtX-TfL_FcXirAfx04gE&ved=0CCcQsAQ

గార్డెనింగ్ కి రిలేటెడ్ ..నాకు తెలిసీ ఒక మంచి బ్లాగ్ ఉంది -- "http://beekaydaily.blogspot.com/".ఈవిడని అడగి చూడండి, మిరియాల చెట్లకు సంబంధించి మీకేమన్నా సలహా చెప్పగలరేమో.
Thank you for the visit.

Sunita.R said...

తృష్ణ గారు,
ఓ మీకు అలా అనిపించిందా? నేను రాసిందాన్ని బట్టి పెద్ద గార్డెన్ మైన్టైన్ చేస్తున్నట్టు పోజ్ ఇచ్చాను. మావీ కుండీలో మొక్కలే. మీ బ్లాగు చదివాక ఆలూ, కాకర, టమోటా వంటివి నాటుదామని కంకణం కట్టుకున్నాను. అవును మీరు టమోటా నాటి నట్టు లేరు.