సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, May 23, 2011

Alfalfa sprouts



మొన్న పొద్దున్న నాకు చాల ఇష్టమైన buffet breakfast కి వెళ్ళాం. అక్కడ మెనూ లో వేలంత పొడుగు మొక్కలు పెరిగిన ఐదారు రకాల sprouts పెట్టాడు. నేను పెసలు, మెంతులు, వేరుశనగ, శనగలు, గోధుమల sprouts చేస్తుంటాను. కానీ హోటల్లో వాడు ఒకట్రెండు కొత్త రకాలు పెట్టాడు. అవేమిటా అని నెట్లో వెతుకుతుంటే ఒక sprouts related లింక్ దొరికింది. అందులోపదిపన్నెండు రకాల sprouts, వాటిల్లోని మంచి గుణాల వివరాలు ఉన్నాయి. ఆ లింక్ ఇదిగో:
http://www.indiamart.com/sproutaminssuper/seed-sprouts.html



ఆ తరువాత నిన్న ఒక షాపింగ్ మాల్ లో అనుకోకుండా మొన్న పొద్దున్న buffet లో పెట్టిన ఒక రకం sprouts కనబడ్డాయి. వెంఠనే కొనేసా. వాటి పేరే "Alfalfa sprouts". నెట్లో వివరాలు వెతికితే అసలివేమిటి? వీటివల్ల ఉపయోగాలేమిటి? ఎలా మొక్క మొలిపించటం తదితర వివరాలు దొరికాయి. క్లుప్తంగా వీటి గురింఛి చెప్పాలంటే:

* శరీరంలో రోగనిరోఢక శక్తిని పెంచుతాయి ఇవి.
* ఎముకలను గట్టిపరిచే గుణాన్ని కలిగి, ఎముకలు త్వరగా పెరగటానికీ ఉపయోగపడతాయి.
* బ్రెస్ట్ ట్యూమర్స్ పెరగకుండా చెయ్యగల సక్తి వీటికి ఉంది.
* శరీరంపై వయసు ప్రభావాన్ని పడనివ్వవుట.. అంటే ముసలిరూపాన్ని త్వరగా దగ్గరకు రానివ్వవన్నమాట.
* బ్లడ్ ప్రజర్ ను తగ్గిస్తాయిట .

ఈ Alfalfa sprouts లోని మరిన్ని పోషక విలువలు, ఉపయోగాలు గురించి ఇక్కడ ఉన్నాయి:
http://webcache.googleusercontent.com/search?q=cache:At7H-IVEVWkJ:www.juicing-for-health.com/alfalfa-sprouts-nutrition.html+alfalfa+sprouts&cd=7&hl=en&ct=clnk&gl=in&source=www.google.co.in


sprouting ఎలా చెయ్యాలో బొమ్మలతో సహా ఇక్కడ వివరంగా రాసాడు:
http://webcache.googleusercontent.com/search?q=cache:5bxIBnoRk8wJ:www.backyardnature.net/simple/alf-spr.htm+alfalfa+sprouts&cd=9&hl=en&ct=clnk&gl=in&source=www.google.co.in


ఇక ఈ Alfalfa గింజలు ఎక్కడ దొరుకుతాయో ప్రయత్నాలు మొదలెట్టాలి !!

2 comments:

SHANKAR.S said...

alfalfa హోమియో టానిక్ చిన్నప్పుడు తాగేవాళ్లమండీ. ఆకలి,immunity పెంచుతుందని చిన్నప్పుడు ఇచ్చేవారు. అది గుర్తొచ్చింది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకి చాలా మంచిదట.

"ఇక ఈ Alfalfa గింజలు ఎక్కడ దొరుకుతాయో ప్రయత్నాలు మొదలెట్టాలి !! "
ఆల్ ది బెస్ట్. మీ ప్రయత్నాలు త్వరలో ఫలించుగాక :)

Ennela said...

mottaaniki peru baagundi...