సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, November 29, 2010

మెంతి పులకింత



చిట్టి చిట్టి మెంతులు కుండీలో పోసి
కాస్తమట్టి తెచ్చి వాటిపై వేసి
కాసిన్నీళ్ళు పోసి, రెణ్నాళ్ళు ఆగి
పొద్దున్నే చూస్తే.. మొక్కలెచ్చేసాయి...:)

ఒక సరదా ఇన్నాళ్ళకు మళ్ళీ వెలుగు చూసింది. ఇది కొన్నేళ్ళ తరువాత నే వేసిన చిరు మెంతి మడి...!
మట్టి చీల్చుకుని బయటకు వచ్చి చిన్న చిన్న తలలను బయటకు పెట్టి ఇవాళ వెలుగు చూసిన కుండీ లోని మెంతి మడి..ఎలా పెరిగిందో మీరూ చూడండి...











గార్డెనింగ్ ఆసక్తి ఉన్నవాళ్ళు సరదాకి ఈ లింక్ కూడా చూడండి.




10 comments:

veera murthy (satya) said...

"జండా వందన" (aug 15th)దినానికి ఆరు రోజుల ముందు భారత దేశ ఆకారంలో మెంతులని ఒక వలయాకారంలో నాటే వాళ్ళం....

జండావందనం నాడు దాని మద్యలో జండా ఎగుర వేసేవాళ్ళం ....ఆ మొలకలని గమనించడం , ప్రతిరోజు ఉదయాన్నే చూసి మురిసి పోవడం ఒక మధురానుభూతి గా గుర్తుండి పోయింది.

వేణూశ్రీకాంత్ said...

:) బాగుందండి.

జయ said...

మిగతావన్నీ కూడా అలాగే పండించేయండి మరి. ఎంతైనా స్వాతంత్ర్య గృహం కదా! ఎప్పుడైనా నేనొచ్చి నాక్కావాల్సినవి తీసుకెళ్ళిపోతాను.

కొత్త పాళీ said...

చాలా చాలా బావుంది. ఈ సారి వేసవికి మా కూరగాయల వనాన్ని నేను కూడా ఫొటోలు తీస్తా వివిధ దశల్లో.

తృష్ణ said...

@సత్య: బాగుందండి ఐడియా...మొలకెత్తుతున్న చిట్టి చిట్టి మొక్కల్ని, ఏ మొక్కకయినా మొదటగా వచ్చే ఆ రెండు ఆకులు చూడటానికి రెండు కళ్ళు చాలవండి. ఆ ఆనందం..అదో వింత పులకింతే.

@వేణూశ్రీకాంత్: థాంక్స్ అండి.

తృష్ణ said...

@జయ: ఓ తప్పకుండా. మీ కోసం ఎదురుచూస్తాను మరి...:)

@కొత్తపాళీ: భలే ఉంటుందండీ. తప్పక photos తీయండి.

ఇందు said...

మెంతి మొలకలకి పుట్టినరోజు శుభాకాంక్షలు :) అదేనండీ...మొదటిసారి తలలు బైటపెట్టాయి కదా అందుకని అన్నమాట :)

sunita said...

naenu maa pedda paapa renDoe puTTina roejuku ee mentimokkalatoe Happy Birth Day molakettinchi mokkalaku talavaipu KrishnuDi vigrahampeTTi choopinchaanu. appaTloe daaniki krishnuDanTae chaalaa ishTamgaa unDaedi. mee Tapaatoe adi gurtochchindi.

తృష్ణ said...

@ఇందు: ఓహ్..థాంక్స్ అండి.

@సునీత:పైన సత్యగారు చెప్పిన "జండా వందన"ఐడియానే బాగుండందంటే మీరు రాసిన ఐడియా ఇంకా ఇన్నోవేటివ్ గా బాగుంది. మా పాపకు కూడా వాళ్ళ తాతగారిలాగ(నాన్న) కృష్ణుడంటే మహా ఇష్టం.పడుకునేప్పుడు ఓ కృష్ణుడి ఫోటో పక్కన పెట్టుకుని మరీ పడుకుంటుంది. మోడ్రన్ మీరావా అంటూంటాను నేను.

గీతాచార్య said...

:) ఎక్సెలెంట్