సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, November 1, 2010

కొసమెరుపు : నాన్న స్వరం + పైంటింగ్స్



నాన్నగారి వాయిస్ వినిపించమని కొందరు బ్లాగ్మిత్రులు అడిగినందువల్ల కథ అయిపోయినా, ఈ చిన్న కొసమెరుపు దానికి జోడిస్తున్నాను.
నాన్న చేసిన "29minutes in 4th dimension" అనే కార్యక్రమంలో నాన్న చదివిన కొన్ని కవితలు ఇక్కడ పెడుతున్నాను. ఈ కవితలు నాన్నగారి రేడియోమిత్రులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారి "నిశ్శబ్దం గమ్యం" అనే కవితా సంపుటిలోనివి.


మౌనం ఖరీదైనది..  


2)మెలికలు తిరిగిన ..  

3)కుప్పించి ఎగసి ..


***  
నాలుగైదు వాయిద్యాలు వాయించటం, మిమిక్రీ చేయటం, ఫొటోగ్రఫీ, ఏడ్స్ కు రాయటం-వాయిస్ ఇవ్వటం, కవితలు రాయటం, బొమ్మలతో జోక్స్ రాయటం, పైంటింగ్స్ వేయటం మొదలైన హాబీ లన్నింటిలో నాన్న ఎక్కువగా చేసినది పైంటింగ్స్ వేయటమే. చాలావరకూ ఎందరికో బహుమతులుగా ఇవ్వటానికి మాత్రమే వేసారు ఆయన. ఇంట్లో మిగిలిన అతికొద్ది నాన్న పైంటింగ్స్ కూడా ఇక్కడ పెడుతున్నాను.











నాన్న గీసిన ఈ రేఖాచిత్రం ఒక పత్రికలో ప్రచురితమైనప్పుడు ఒక అభిమాని ఆ బొమ్మను ఇలా వెల్డింగ్ చేయించి తీసుకువచ్చి ప్రెజెంట్ చేసారు. (మా చిన్నప్పుడు నాన్న వేసిన బొమ్మలు, బొమ్మలతో రాసిన జోక్స్ కొన్ని పత్రికలలో ప్రచురితమయ్యేవి.)




నాన్న బయటకు వెళ్ళినా, ఆఫీసుకు వెళ్ళినా భుజానికి ఎప్పుడూ ఒక బేగ్ ఉండేది. అందులో ఒక స్కెచ్ బుక్స్ ఉంటూ ఉండేవి. ఎక్కడైనా మంచి సీనరీ or మంచి కన్స్ట్రక్షన్ కనబడితే ఒక రఫ్ స్కెచ్ గీసేసుకునేవారు. సరదగా Doodling కూడా చేస్తూండేవారు. వాటిని మళ్ళీ వేయటానికి నేనూ, తమ్ముడూ ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళం. ఆ స్కెచ్ బుక్స్లోని కొన్ని బొమ్మలు..






======================================

Small Note:

మౌనంగా ఆగిపోవటం "తృష్ణ" కు రాని పని...:)
There won't be any posts in this blog for some days..!
till then..Keep smiling...bye bye :)


19 comments:

భాను said...

మీరు మౌనంగా...ఏంటండీ. ఇంకా విశేషాలు పంచుకోండి. మీ నాన్న గారి గొంతు వినడం బాగుంది. ఆ గొంతులో కవితలు కుడా బాగున్నాయి. చిత్రాలు కూడా బావున్నాయి.నెనర్లు :)

Anonymous said...

నెనర్లు. కొంత కాలం తర్వాత మరల కనిపిస్తారు కదూ :)

Unknown said...

mee nanna gaari mrudu madhuramaina, mardhavamaina gonthu vinagaane aascharyam, anandam kalagalpina oka vichitraanubhoothi, nijangaa gundelo jhallumanna feeling. nenu chinnappatninchi vinna gonthe, kaanee aayane raamam gaaru anee, mee nannagaaranee naaku theliyadu,
ayana gonthu lo entha adbutha shakthi vundo, ayyana vesina chitraalu antha adbuthanga unnayi, meerentha adrushtavanthulandee!!!!!
please convey my regards to him.

Aparna

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

suuuuuuper

..nagarjuna.. said...

Thanks for sharing :)

వేణూశ్రీకాంత్ said...

తృష్ణగారు మీనాన్నగారి స్వరం వినిపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరు రాసినది చదివినపుడు ప్రోగ్రాంల పేర్లు చెప్పినపుడు పోల్చుకోలేకపోయాను కానీ తన స్వరం వినగానే చాలా పరిచయమైన స్వరం ఎన్నోసార్లు విన్నట్లు అనిపించిందండీ. పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయ్. Once again thanks a lot for the series. మీ మౌనం అత్యల్పకాలానికే పరిమితమవ్వాలని కోరుకుంటున్నాను.

తృష్ణ said...

@భాను: చెప్పా కదండి నాకసలు మౌనంగా ఉండటం రాదు..:(
వీలుకాగానే మళ్ళీ ప్రత్యక్ష్యమైపోతాలెండి. ధన్యవాదాలు.

@మనవాణి: తప్పకుండానండి. ధన్యవాదాలు.

@అపర్ణ: చాలా రోజులకు కనిపించారు...నాన్నగారి వాయిస్ మీకు తెలుసా.....చాలా సంతోషం కలిగింది చదివి. ఇలాగే ఇంకెవరన్నా కూడా గుర్తుపడతారనే క్లిప్పింగ్ పెట్టానండీ.
ధన్యవాదాలు.

తృష్ణ said...

@చైతన్య: Thank you.

@నాగార్జున:థాంక్సండి.

@వేణూ శ్రీకాంత్: మొత్తం చదివినందుకు మీక్కుడా చాలా థాంక్స్...:)
ఇక నా మౌనం సంగతి చెప్పేదేముందండి...పరిస్థితులు ఎలా ఉన్నా,ఏ మాత్రం వీలున్నా బ్లాగటం మానని ఏకైక బ్లాగ్పక్షిని...:)
ప్రస్తుతానికి కొన్నాళ్ళు బ్లాగులు చూట్టం కూడా కుదరదు.. పనులు పూర్తి కాగానే వచ్చేస్తాలెండి. ధన్యవాదాలు.

తృష్ణ said...

@చైతన్య: Thank you.

@నాగార్జున:థాంక్సండి.

@వేణూ శ్రీకాంత్: మొత్తం చదివినందుకు మీక్కుడా చాలా థాంక్స్...:)
ఇక నా మౌనం సంగతి చెప్పేదేముందండి...పరిస్థితులు ఎలా ఉన్నా,ఏ మాత్రం వీలున్నా బ్లాగటం మానని ఏకైక బ్లాగ్పక్షిని...:) ప్రస్తుతానికి కొన్నాళ్ళు బ్లాగులు చూట్టం కూడా కుదరదు.. పనులు పూర్తి కాగానే వచ్చేస్తాలెండి. ధన్యవాదాలు.

జయ said...

తృష్ణా, అన్ని భాగాలు పూర్తిగా చదివాను. మీ నాన్నగారి గురించి చాలా బాగా వివరించారు. మీ నాన్నగారి పైంటింగ్స్ చూడాలన్న నా కోరిక కూడా తీరింది. మీ నాన్నగారికి నా వందనాలు, అభినందనలు తెలియజేయండి.

Srujana Ramanujan said...

Felt sad that a good series came to an end in a very short span. Not even 20 days, and seven episodes

SRRao said...

చాలా మంచి స్వరం, పెయింటింగ్స్ అందించారు. ధన్యవాదాలు తృష్ణ గారూ !
మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు
- శి. రా. రావు
శిరాకదంబం

శేఖర్ పెద్దగోపు said...

ఎంత బాగుందో నాన్నగారి గొంతు...ఆడియోలు పెట్టినందుకు థాంక్స్...'మెలికలు తిరిగిన' చాలా నచ్చింది నాకు...ఆడియోలు అటు ఇటు మారినట్టున్నాయి...పెయింటిగ్స్ కూడా బాగున్నాయి...

sudhama said...

Naanaa garu poddunna phone chesinappudu maatallo chebite telugu blogers lo search chesi mottaaniki mee blog pattukunnaanu.Chaalaa baagundammaa ! naannagari krishini ilaa Nikshiptam chestunnanduku neeku Special thanks.Aaayana Aarogyamgaa manakosam nindu noorellu vuntaaru.Best of luck-Sudhama

మధురవాణి said...

తృష్ణ గారూ,
మీ నాన్నగారి గురించి రాసిన అన్ని భాగాలు చదివాను. చాలా బాగా రాశారు. అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఇంకొంచెం వివరంగా రాసుంటే బాగుండేదేమో అనిపించింది. ;) మీ నాన్నగారి జీవిత విశేషాలు చాలా ఆసక్తికరంగా, స్పూర్తిని కలిగించేలా ఉన్నాయి. ఆయన గొంతు చాలా ఆహ్లాదంగా ఉంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది. మీకో ఉచిత సలహా! :) మీ నాన్న గారి పేరు మీద మీరే ఒక వెబ్సైటు పెట్టి అందులో ఆయన ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టే అవకాశం ఏమన్నా ఉందేమో ప్రయత్నించకూడదూ! నాకైతే ఆయన ప్రోగ్రామ్స్ అన్నీ వింటే బాగుండుననిపిస్తోంది. :) బొమ్మలు కూడా ఎంత బాగున్నాయో! :) మీ నాన్న గారూ, ప్రతీ క్షణం ఆయన వెన్నంటి నిలిచే మీ అమ్మ గారూ, ఇంకా ముచ్చటైన పిల్లలు మీరు.. అందరూ అదృష్టవంతులే అనిపిస్తోంది. మీ అందరికీ అభినందనలు! :)

మైత్రేయి said...

మీ నాన్నగారు మాకు బాగా తెలుసండోయ్. గొంతు వింటే గానీ గుర్తు పట్టలేదు. నిజంగా ఎంత గొప్ప కళాకారులు ఉండేవాళ్ళు విజయవాడ ఆకాశవాణిలో. ఎంతమంది శ్రోతల జీవితాలను ప్రభావితం చేసి ఉంటారోకదా చక్కటి మాటలతో. వారి జీవితాలు ధన్యం.
అద్బుతమైన పెయింటింగ్స్.
మీరు వారిగూర్చి రాసి చాలా మంచి పని చేసారు. మొత్తం చదివాకా మళ్ళీ కామెంట్ రాస్తాను.

తృష్ణ said...

@జయ: తప్పకుండానండి. ధన్యవాదాలు.
సృజన: ఎక్కువ రాస్తే ఈమాత్రం విజిటర్స్ కూడా ఉండరని భయం మరి...:)

@ఎస్.ఆర్.రావ్: ధన్యవాదాలు.

@శేఖర్ పెద్దగోపు: మార్చానండి. థాంక్స్.

తృష్ణ said...

@సుధామ: చాలా చాలా సంతోషం కలిగిందండి మీ వ్యాఖ్య చూసి. మీ ప్రశంస అపురూపం. హృదయపూర్వక ధన్యవాదాలు.

తృష్ణ said...

@మధురవాణి: ఆ అళొచన మాకు చాలా కాలం క్రితమే వచ్చింది. కార్యరూపం దాల్చటానికి సమయం పడుతుంది. కానీ ఐడియా అయితే ఉంది. ధన్యవాదాలు.

@మైత్రేయి: అవునాండీ. బాగుంది. ధన్యవాదాలు.