సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, June 4, 2010

పుట్టినరోజు "బాలు" ని rare photos..!!

తెలుగు సినీ గేయ ప్రపంచం లో ఒక యునీక్ సింగర్ గా బాలుగారు అధిరోహించిన శిఖరాలను బహుశా మరెవ్వరూ చేరుకోలేరు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ మహానుభావుని తాలుకూ కొన్ని రేర్ ఫొటోస్ ను, కొన్ని జ్ఞాపకాలనూ ఈ టపాలో పంచుకుంటున్నాను.

1971లో నాన్నగారు ఆకాశవాణి హైదరాబాద్ స్టేషన్లో పని చేస్తున్నప్పుడు , 'సంబరాల రాంబాబు' సినిమా రిలీజ్ తరువాత మద్రాస్ నుంచి బాలుగారు వచ్చినప్పుడు జరిగిన ఒక ఇంటర్వ్యు ఫోటో ఇది. ఆకాశవాణి తరఫున ఇంటర్వ్యు చేస్తున్నది మా నాన్నగారు.


బాలుగారి పాటకు నలభై వసంతాలు పూర్తయినప్పుడు "నయనం" అనే మాసపత్రిక వారు 2007లో ఆయన గురించిన విశేషాలతో,ఆర్టికల్స్ తో ఒక ప్రత్యేక సంచిక వేసారు. గొల్లపూడి గారి "ఎలిజీలు" పుస్తకం ఆవిష్కరణ సభ + బాలు పాటకు నలభై వసంతాలు సందర్భంగా జరిగిన సన్మాన సభ తాలూకూ విశేషాలు ఆ పత్రిక లో ప్రచురించారు. అందులోనివే ఈ క్రింది ఫోటోస్ :










ఆ పుస్తకంలో ప్రచురించిన బాలుగారి బయోడేటా :

అప్పటి "ఆంధ్రప్రభ" దినపత్రిక ఎడిటర్ దీక్షితులు గారి ఆధ్వర్యం లో తెలుగు సినిమా చరిత్ర గురించిన రకరకాల విశేషాలతో ప్రచురించబడిన "మోహిని(రెండు భాగాలు)" అనే పుస్తకంలో ఎందరో ప్రముఖుల చేత ఎన్నో వ్యాసాలు రాయించారు. ఆ పుస్తకం లో బాలూ ఇంటర్వ్యూ కోసం, విజయవాడ ఆకాశవాణి వార్తా విభాగం లో పనిచేస్తున్న బాలు చిరకాల మిత్రులు ప్రసాద్ గారితో పాటూ, ఆ ఇంటర్వ్యూ రికార్డ్ చేయటానికి నాన్నగారు కూడా నెల్లూర్లోని బాలుగారి ఇంటికి వెళ్ళారు. రెండు గంటలపాటు జరిగిన ఆనాటి ఇష్టాగోష్ఠి, చెప్పుకున్న కబుర్లు మరపురానివని నాన్న చెప్తూంటారు.

అప్పుడే 'మా అమ్మాయి కోసం' అని నా పేరుతో ఒక ఆటోగ్రాఫ్ చేయించుకున్నారు. నా పేరు అడిగి ఒక జోక్ కూడా వేసారుట ఆయన. (ప్రస్తుతం ఆ లెటర్ కాని ,ఆటోగ్రాఫ్ కానీ దొరకలేదు టపాలో పెడదామంటే..) ఆ తరువాత కమల్ హాసన్ కు డబ్బింగ్ చెప్పటమే కాక బాలు సొంతంగా ప్రొడ్యూస్ చేసిన "మహానది" సినిమా చూశాకా, బాగా నచ్చేసి, నాన్న ఆయనకు ఒక లెటర్ రాసారు. దానికి ఆయన సమాధానం రాస్తూ చివరలో నా పేరు గుర్తుంచుకుని అమ్మాయికి ఆశీస్సులు అని కూడా రాసారు. అంతటి జ్ఞాపక శక్తి ఆయనది.


24 comments:

యమ్వీ అప్పారావు (సురేఖ) said...

బాలుగారి గురించి ,అపురూప చిత్రాలతో ఆయన పుట్టిన రోజున మాకు
అందించినందుకు ధన్యవాదాలు. నా కార్టూన్ సంకలనం "సురేఖా కార్టూన్స్"
బాలుగారికి పంపినప్పుడు ఆయన అభిమానంతో వ్రాసిన ఉత్తరం పదిలపర్ఛు
కున్నాను. రేఖాచిత్రం సురేఖ

SRRao said...

తృష్ణ గారూ !
బాలు గారి అరుదైన, మంచి ఫోటోలు అందించారు. సంతోషం. ధన్యవాదాలు.

SRRao said...

తృష్ణ గారూ !
మీ ఫోటోలకు చిన్న మేక్ అప్ చేసాను. మీకభ్యంతరం లేకపోతే పంపిస్తాను. మీ అంగీకారం తెలియజెయ్యండి.

మధురవాణి said...

Thanks a lot for posting these rare photographs!
Happy Birthday to our own Balu garu! :-)

శేఖర్ పెద్దగోపు said...

బాగున్నాయండి ఫోటోలు...

గీతాచార్య said...

బాలుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మమ్చి టపా అందించారు

మరువం ఉష said...

ఎప్పట్లానే మీదైన ప్రత్యేకత తృష్ణా...వచ్చేవారి తృష్ణ మాత్రం తీర్చే పంపుతారు..ఇదేమాదిరి టపా మరొకటి చూసా..http://blogavadgeetha.blogspot.com/2010/06/blog-post_04.html
+ బాలు గారి స్వంత సైట్ http://www.spbindia.com/ ఇక నేను పాటల సందడిలోకి వెళ్ళనా మరి! :)

Unknown said...

తృష్ణ గారూ ! బాలు గారి అరుదైన ఫోటోలు అందించారు! ధన్యవాదాలు!!

భావన said...

తృష్ణ.. చాలా బాగున్నాయి ఫొటోలు. మంచి కలక్షన్. మళ్ళొక్క సారి బాలు గారి కి మన్స్పూర్తి గా జన్మ దిన శుభాకాంక్షలు.

Padmarpita said...

మంచి ఫోటోలు అందించారు...Thank Q!

Unknown said...

excellent collection
thanks a lot

Saahitya Abhimaani said...

చాలా బాగున్నాయి మీరిచ్చిన వివరాలు. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని రేడియో ఇంటర్వ్యూ ఫోటో అందచేసినందుకు ధన్యవాదాలు.

Srujana Ramanujan said...

అప్పుడే 'మా అమ్మాయి కోసం' అని నా పేరుతో ఒక ఆటోగ్రాఫ్ చేయించుకున్నారు
***

అచ్చు ఇలాగే for my kid అంటూ నాదల్ దగ్గర రెండో ఆటోగ్రాఫ్ తీసుకున్నా :-)

Unknown said...

trishna gaaru
mee blog lo pillalaara paapallaara paata vinalani choosthe raavatledu, oka saari veelaithe choodara please!
alage mee daggara "merupulu poovulu dandaga" ane paata unda?adi nenu chinnappudu nerchukunnaanu.

తృష్ణ said...

@హార్ట్ స్ట్రింగ్స్: అపర్ణా,మీరు తెలుగులో వ్యాఖ్య రాయండీ. చక్కగా ఉంటుంది.. lekhini కానీ baraha notepad గానీ మీ సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోండి రాయటానికి వీలుగా .

"మెరుపులె పూవుల దండగా
మబ్బులె మెత్తని దిండుగా
హాయిగానుండవె తారకా..."
అదేనా?? నేనూ నేర్చుకున్నాను చిన్నప్పుడు.
పాట లేదు గానీ సాహిత్యం ఉండాలి వెతుకుతాను.

తృష్ణ said...

@సురేఖ: చాలా సంతోషమండీ..ధన్యవాదాలు.

@ఎస్.ఆర్.రావ్ : చాలా థాంక్స్ అండీ ఫొటోస్ బ్రైట్ చేసి ఇచ్చినందుకు.

@మధురవాణి: థాంక్యూ టూ..:)

తృష్ణ said...

@శేఖర్ ,
@గీతాచార్య,
ధన్యవాదాలు.

@ఉష: మంచి బ్లాగ్ ను పరిచయం చేసారు నాకు. చాలాఅ బాగుందండి ఆ బ్లాగ్.Thanks a lot.

తృష్ణ said...

@ధరణీరాయ్ చౌదరి:
@భావన:
@పద్మార్పిత:
@హిమ:
@శివ:
మీ అందరికీ కూడా ధన్యవాదాలు.

తృష్ణ said...

@srujana: oh,thats really great. Your interview is also really nice...Good translation.

Unknown said...

ఇదిగో తెలుగు లొ నా వ్యాఖ్య, రాయడం తెలుసు కానీ రాయడానికి బద్దకం, ఇక నుంచి తెలుగు లొనే రాస్తాను. మెరుపుల పూవుల దండగ సాహిత్యం నాకు దొరికింది, పాట దొరకటం లేదు , పాట గుర్తుంది కానీ ఎప్పుడో నేర్చుకున్నది కదా ఒక సారి విని ఎమైనా తప్పులుంటె సరి చేసుకొని మా పిల్లలలకి నేర్పిద్దామని. కానీ ఎంత వెతికినా దొరకట్లేదు .
మీ ఆరోగ్యం ఎలా ఉంది ? మీ పాప బావుందా ? స్కూల్ మొదలైందా?
పిల్లల్లార పాపల్లార పాట???????
అపర్ణ

తృష్ణ said...

@అపర్ణ: పాప స్కూల్ మొదలైందండి. నేను కులాసా. థాంక్స్.
పాట రీలోడ్ చేసాను చూడండి.ITs a wonderful song.మీపిల్లలకు తప్పక నేర్పించండి.

Unknown said...

చాలా థాంక్స్ అండీ , మీకేమైన శ్రమ ఇస్తే సారీ
అపర్ణ

హరే కృష్ణ said...

నమస్తే బాగున్నారా
ఆరోగ్యం ఎలా ఉంది మీకు
మీ అమ్మాయి స్కూల్ మొదలిపెడితే మళ్ళీ వెల్కం పార్టీ ఉంటుంది కదా
ఆ టపా కోసం వెయిటింగ్

తృష్ణ said...

@aparna: nothing like that...:)

@hare krishna:స్కూల్ నాకు మొదలైందండి...:) పుస్తకాలకు అట్టలు వేసుకున్నాను నిన్ననే..!
ఆరోగ్యం...బండి నడుస్తోంది. పర్వాలేదండి.