కొన్ని రోజులు ఝామ్మని జారిపోతూంటాయి దూకే జలపాతంలా.. కొన్ని రోజులు సాదాగా నడిచిపోతూంటాయి నిఠారైన నిలువుగీతలా.. కొన్ని రోజులు గజిబిజిగా ప్రశ్నిస్తూంటాయి బోలెడు చుక్కల మెలికల ముగ్గులా.. కొన్ని రోజులు నిశ్శబ్దంగా గడిచిపోతుంటాయి స్తబ్దుగా నిశీధిలా.. కొన్ని రోజులు దిశారహితంగా ఉంటాయి అచ్చంగా జీవితంలా..