ఇందాకా నెట్ లో వార్తలు చదువుతుంటే.. అమితాబ్ చెప్పిన వాక్యాలు విని లతాజీ కళ్ళల్లో నీళ్ళు తిరుగాయని, ఆవిడ ట్వీట్ చేసారన్న వార్త కనబడింది. (http://zeenews.india.com/entertainment/celebrity/when-amitabh-bachchan-made-lata-mangeshkar-cry_1500535.html)
ఆ వాక్యాలు ఒక ప్రముఖ గజల్ లోనివి. వెంఠనే గజల్ రారాజు మెహదీ హసన్ పాడిన "मोहब्बत करनेवाले कम ना होंगे" అనే ఆ అద్భుతమైన గజల్ వెతుక్కుని విని ఆనందించాను. నాలాంటి సంగీతప్రియుల కోసం ఇక్కడ షేర్ చేద్దామనిపించింది.
ఈ గజల్ సాహిత్యాన్ని రాసిన ఉర్దూ కవి పేరు అబ్దుల్ హఫీజ్. 'హోషియార్ పూర్' అనే ఊరివాడవడం వల్ల ఆయనను "హఫీజ్ హోషియార్ పురీ" అని పిలుస్తారు. మెహదీ హసన్ గళమే కాక ఈ గజల్ సాహిత్యం చాలా చాలా బావుంటుంది. ఇదే గజల్ ఇక్బాల్ బానో గారూ, ఫరీదా ఖన్నుమ్ గారూ పాడిన లింక్స్ యూట్యూబ్ లో ఉన్నాయి. కానీ మెహదీ హసన్ పాడినది వింటుంటే మాత్రం గంధర్వ గానం.. అనిపించకమానదు!ఆ ఆలాపనలు.. స్వరం నిలపడం.. ఆహ్.. అంతే!
మెహదీ హసన్ మాటలతో ఉన్న ఓల్డ్ రికార్డింగ్:
http://youtu.be/NQ3rRwSl__8
సాహిత్యం:
मोहब्बत करनेवाले कम ना होंगे
तेरी महफ़िल में लेकिन हम ना होंगे
ज़माने भर के ग़म या इक तेरा ग़म
ये ग़म होगा तो कितने ग़म ना होंगे
अगर तू इत्तफ़ाक़न मिल भी जाये
तेरी फुरक़त के सदमें कम ना होंगे
दिलों की उलझनें बढ़ती रहेंगी
अगर कुछ मशवरे बहम ना होंगे
'हफ़ीज़' उन से मैं जितना बदगुमाँ हूँ
वो मुझ से इस क़दर बरहम ना होंगे