నాకెంతో ప్రియమైన హిందుస్తానీ గాయకులు శ్రీ పండిట్ జస్రాజ్ గారు...
సంగీతఙ్ఞుడిగానే గాక వ్యక్తిగా కూడా ఇష్టుడు నాకీయన. సాదాసీదాగా, చలాకీగా ఉంటారెప్పుడూ. ఎనభై ఏళ్ళ పైబడినా ఇంకా ఎంతో ఎనర్జిటిక్ గా చెక్కుచెదరని చిరునవ్వుతో కనబడుతూ ఉంటారు.
పూర్వజన్మ పుణ్యాన ఇలా భారతావనిపై జన్మించి వారి ఖాతాలో ఉన్న సంగీతామృతాన్ని మనలపై చల్లేసి మాయమైపోయారు మన దేశంలో ఎందరో సంగీత విద్వాంసులు..