ఇవాళ రెండు విశేషాలు.. అన్ని బ్లాగుల్లో కలిపి 882 పోస్ట్ లు ఉన్నా, నాకెంతో ప్రియమైన 'తృష్ణ'లో ఆరొందల స్వగతాలు పూర్తయ్యాయి. ఒక నెల తక్కువ ఐదేళ్ళూగా నన్ను ప్రోత్సహిస్తున్న బ్లాగ్మిత్రులందరికీ మరోసారి కృతజ్ఞతలు.
రెండవది.. ఇవాళ సుప్రసిధ్ద గాయని ఎస్.జానకి పుట్టినరోజు! అందుకని స్పెషల్ గా ఆవిడ పాడిన తెలుగు పాటలు కాకుండా నాకు బాగా ఇష్టమైన ఓ తమిళ్ పాటని వినిపిస్తున్నాను. జానకి చాలా బాగా పాడిన పాపులర్ సాంగ్స్ లిస్ట్ లో తప్పక ఉండే పాట ఇది. తమిళంలో భారతీరాజా తీసిన "Alaigal Oyivathillai" (తెలుగులో "సీతాకోకచిలుక") చిత్రంలోని గీతం ఇది.
చిన్న క్విజ్ కూడా... ఈ పాట 'పల్లవి'ని ఇళయరాజా మళ్ళీ ఎక్కడ, ఏ రూపంలో వాడుకున్నాడో చెప్పగలరా ఎవరైనా?