శ్రీ పి.బి. శ్రీనివాస్. నిన్న మరణించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాకినాడ కు చెందిన పి.బి. శ్రీనివాస్ గారి పూర్వీకులు "పసలపూడి" గ్రామానికి చెందినవారని వికీ చెప్తోంది. దక్షిణాది భాషల్లోనే కాక హిందీ లో కూడా పాటలు పాడిన శ్రీ పి.బి. శ్రీనివాస్ ఎనిమిది భాషల్లో బహుభాషా కోవిదుడు. తెలుగులో బోలెడు గజల్స్ కూడా రాసారు. తెలుగులో కంటే తమిళంలో జెమినీ గణేశన్ కూ, కన్నడంలో రాజ్ కుమార్ కూ ఎక్కువ సినిమా పాటలు పాడిన నేపధ్యగాయకుడు. పి.బి.శ్రీనివాస్ సినీ ప్రస్థానం ఒక హిందీ చిత్రం ద్వారా మొదలైంది. ఎంతో ప్రఖ్యాతి గాంచి ఇతర రాష్ట్రాల, దేశాల ద్వారా అవార్డులు పొందిన ఈ గాయకునికి మన రాష్ట్రప్రభుత్వం ద్వారా ప్రత్యేక పురస్కారాలేమీ అందకపోవటం బాధాకరం.
తనదైన ఒక ప్రత్యేకతను, ముద్రను పొందిన పి.బి గానాన్ని ఇట్టే గుర్తుపట్టగలం మనం. బాధ, ఆనందం, హాస్యం..ఇలా ఏ రకమైన అనుభూతినయినా అవలీలగా ఒలికించగల బహుముఖప్రజ్ఞాశాలి పి.బి. అటువంటి ప్రత్యేకమైన కొన్ని పి.బి పాటలను ఇవాళ ఆయన జ్ఞాపకాలుగా గుర్తు చేసుకుందాం.. ఆయన పాడిన కొన్ని వందల పాటల్లో కొన్నింటిని ఎంపిక చేయటం కష్టమే అయినా నాకు బాగా తెలిసిన కొన్ని పి.బి పాటలను ఈ టపాలో సమావేశపరిచే ప్రయత్నం చేస్తాను.
1968 లో Neil Armstrong చంద్రుడి మీద కాలు పెట్టాకా, శ్రీ పి.బి.శ్రీనివాస్ గారు రెండు పాటలు రాసి, వాటిని సంగీత దర్శకులు ఏం.ఎస్.శ్రీరాం గారు స్వరపరచగా, ఓ గ్రామ్‌ఫోన్ రికార్డ్(45 RPM)ను 1970లో రిలీజ్ చేసారు. బి.రాథాకృష్ణ గారు ఈ గ్రామ్‌ఫోన్ రికార్డ్ స్పాన్సర్ చేసారు. ఈ రికార్డ్ లో ఒక వైపు పి.బి. సోలో "Man to Moon", రెండో వైపు ఎస్.జానకి తో కలిసి పాడిన "Moon to God" అనే పాట ఉంటాయి. ఈ రికార్డ్ ను ఆయన Armstrong కు, అప్పటి అమెరిన్ ప్రెసిడెంట్ కు పంపగా, అమెరిన్ ప్రెసిడెంట్ వద్ద నుండి జవాబు కూడా వచ్చిందట. ఎం.ఎస్. శ్రీరాం గారు నాన్నగారికి స్వయంగా ఇచ్చిన ఈ రికార్డ్ కాపీ ఒకటి మా ఇంట్లో ఉండేది. ఇప్పుడు కూడా నాన్నగారి వద్ద ఉంది. గ్రామ్‌ఫోన్ రికార్డ్ లోంచి ఎం.పి ౩ చేసాకా త్వరలో అది కూడా వినిపిస్తాను.
పి.బి. డ్యూయెట్స్ లో నాకు బాగా ఇష్టమైనదీ పాట. ప్రేమించి చూడులో "అది ఒక ఇదిలే" ! ఈ పాట "Bésame Mucho" అనే Spanish song నుంచి ఇస్పైర్ అయ్యింది. ఈచిత్రంలో మిగిలిన పి.బి. పాటలు(బుచ్చబ్బాయ్ పని కావాలోయ్, మీ అందాల చేత్రులు కందేను పాపం, వెన్నెల రేయి) ఇక్కడ వినవచ్చు:
http://gaana.com/music-album/preminchi-choodu-14747
1) పాట: అది ఒక ఇదిలే
సంగీతం: మాష్టర్ వేణు
రచన: ఆత్రేయ
2) "చౌదవీ కా చాంద్ హొ" అనే ప్రఖ్యాత హిందీ పాట బాణీని "మదనకామరాజు కథ" చిత్రానికి వాడుకున్నారు. "నీలి మేఘమాలవో నీలాల తారవో" అనే ఈ పాటను అద్భుతంగా పాడారు పి.బి.
జి.కె.మూర్తి రచన,
సంగీతం: రాజన్ నాగేంద్ర
3) ఈ పాట సాహిత్యం చాలా బావుంటుంది..
"తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునేలాగైనా
మనసుకొక్క గాయమైనా మాసిపోదు చితిలోనైనా.."
చిత్రం: ఆడ బ్రతుకు
రచన: ఆత్రేయ
సంగీతం: విశ్వనాథన్ రామ్మూర్తి
4) ఓహో గులాబి బాలా
చిత్రం: మంచి మనిషి
రచన: సి.నారాయన రెడ్డి
సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
5) "మనసులోని కోరిక తెలుసు నీకు ప్రేమికా.."
భీష్మ
ఆరుద్ర
ఎస్.రాజేశ్వరరావు
6) "ఆడబ్రతుకు" సినిమాలొ ఆత్రేయ పాట
"బుజ్జి బుజ్జి పాపాయి
బుల్లి బుల్లి పాపాయి
నీ బోసి నవ్వులలో
పూచే పున్నమి వెన్నెల లోనే "
7) ప్రఖ్యాత హిందీచిత్రం "దిల్ ఏక్ మందిర్ " ఆధారంగా తీసిన "మనసే మందిరం" చిత్రంలోని ఈ సాహిత్యం కూడా ఆత్రేయ గారిదే !
"తలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు"
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
చిత్రం: మనసే మందిరం
http://www.raaga.com/play/?id=356479
8) పి.బి. పాటల్లో నాకు బాగా నచ్చే మరో పాట "ఇంటికి దీపం ఇల్లాలు" చిత్రంలో
" ఎవరికి ఎవరు కాపలా" బంధాలన్నీ నీకేలా
రచన: ఆత్రేయ
సంగీతం: విశ్వనాథన్ రామ్మూర్తి
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18317
9) చిగురాకుల ఊయలలో
అనిశెట్టి
ఆర్.గోవర్ధన్
కాన్స్టేబుల్ కూతురు
10) వెన్నెలకేలా నాపై కోపం
ఆర్.గోవర్ధన్
కాన్స్టేబుల్ కూతురు
11) "కాన్స్టేబుల్ కూతురు" లోదె మరో పాట..
రచన: ఆత్రేయ
"పూవు వలే విరిబూయవలె
నీ నవ్వు వలే వెలుగీయవలె
తావి వలే మురిపించవలలె
మనమెవ్వరము మరిపించవలె "
http://www.raaga.com/play/?id=356478
12) "ఋణానుబంధం" సినిమాలో ఎస్.జానకి తో కలిసి పాడిన "అందమైన బావా ఆవుపాలకోవా" హాస్య గీతం చాలా సరదాగా ఉంటుంది.
రచన: సముద్రాల జూనియర్
సంగీతం: పి.ఆదినారాయణరావు http://www.sakhiyaa.com/runanubandham-1960-%E0%B1%A0%E0%B0%A3%E0%B0%BE%E0%B0%A8%E0%B1%81%E0%B0%AC%E0%B0%82%E0%B0%A7%E0%B0%82/
13) "దేవా.. లోకములోని చీకటులన్నీ తొలగించే వెలుగువు నీవే.."
రచన: దాశరథి
చిత్రం: అత్తగారు కొత్తకోడలు
http://www.raaga.com/play/?id=235587
14) అనురాగము ఒలికే ఈ రేయి
మనసారగ కోర్కెలు తీరేయి
చిత్రం: రాణీ రత్నప్రభ
కొసరాజు
ఎస్.రాజేశ్వరరావు
http://www.sakhiyaa.com/rani-ratnaprabha-1960-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD/
15) శ్రీకృష్ణ పాండవీయం"లో పి.బి. పాడిన పోతన పద్యం "నల్లనివాడు..పద్మనయనంబులవాడు కృపారసంబు పై జల్లెడువాడు" క్రింద లింక్ లో ఆ పద్యం వినవచ్చు:
http://www.sakhiyaa.com/sri-krishna-pandaveeyam-1966-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80-%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%82%E0%B0%A1%E0%B0%B5%E0%B1%80%E0%B0%AF%E0%B0%82/
16) "అసాధ్యుడు" చిత్రంలో "చిట్టెమ్మా చిన్నమ్మా చూడవమ్మా, నన్ను అవునన్నా కాదన్నా వీడనమ్మా నిన్ను"
సంగీతం: టి.చలపతిరావు
రచన: సి.నారాయణ రెడ్డి
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3005
17) రామసుగుణధామ రఘురామసుగుణధామ
దశరథరామ తారకనామ రవికులసోమా రాజచంద్రమా
చిత్రం: మాయామశ్చీంద్ర
సంగీతం: సత్యం
రచన: దాశరథి
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8368
18) "అందాల ఓ చిలకా "
movie: లేత మనసులు
19) "రంగుల రాట్నం" సినిమాలో నారాయణ రెడ్డి రాసిన ఈ పాట కూడా బావుంటుంది.
"మనసు మనసు కలిసే వేళ మౌనమేలనే ఓ చలియా
కలలు నిలిచి పలికే వేళ పలుకలేనురా చెలికాడా..
కన్నుల దాగిన అనురాగం పెదవులపై విరబుయాలి
పెదవులకందని అనురాగం మదిలో గానం చెయాలి
http://mp3scorner.com/download-rangula-raatnam-1966-old-telugu-mp3-songs/
20) "అందమంటే నువ్వే ఆనందమంటే నువ్వే
నువ్వంటే నువ్వే నీవంటిది నువ్వే నువ్వే "
lyrics: ఆత్రేయ
movie: ఇల్లాలు
http://www.sakhiyaa.com/illalu-1965-%E0%B0%87%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/
21) "పవ మన్నిపు" అనే తమిళ సినిమాలో పి.బి.శ్రినివాస్ కు ఎంతో పేరు తెచ్చిన పాట.."Kalangalil Aval Vasantham". కణ్ణాదాసన్ రాసారు. తెలుగులో ఈ చిత్రాన్ని "పాప పరిహారం" అనే పేరుతో డబ్బింగ్ చేసారు.
22) "మంటలు రేపే నెలరాజా.. ఈ తుంటరితనము నీకేలా" అని "రాము" సినిమాలో ఘంటసాల పాడిన పాటను తమిళంలో పి.బి పాడారు.
ఆ పాట :
పి.బి ఎక్కడ ఉన్నా ఇంత చక్కని పాటల రూపంలో వారు మన మధ్యనే ఎప్పటికీ చిరస్మరణీయులై ఉంటారు.