పి.బి. శ్రీనివాస్ పాడిన సోలో పాటల్లో ఆత్రేయ రాసిన "ఎవరికి ఎవరు కాపలా" గీతం నాకు బాగా నచ్చుతుంది...
ఈ పాటను ఇక్కడ వినవచ్చు:
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18317
movie: ఇంటికి దీపం ఇల్లాలు
lyrics: ఆత్రేయ
music: విశ్వనాథన్ రామ్మూర్తి
lyrics:
ప: ఎవరికి ఎవరు కాపలా
బంధాలన్నీ నీకేలా
ఈ బంధాలన్నీ నీకేలా
1చ: తనువుకు ప్రాణం కాపలా
మనిషికి మనసే కాపలా
తనువును వదిలి తరలే వేళ
మన మంచే మనకు కాపలా
2చ: కంటికి రెప్పు కాపలా
కలిమికి ధర్మం కాపలా
కలిమి సర్వము తొలిగిన వేళ (2)
పెట్టినదేరా గట్టి కాపలా
3చ: చిన్నతనాన తల్లి కాపలా
వయసున వలచిన వారు కాపలా
ఎవరి ప్రేమకున నోచని వేళ
కన్నీరేరా నీకు కాపలా