సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, October 22, 2012

దేవీ ప్రణవ శ్లోకీ స్తుతి




ప్రముఖ భారతీయ సంస్కృత పండితుడు, కవి కాళిదాసు రచించిన "శ్యామలా దండకం" బహుళ ప్రచారాన్ని పొందింది. కాళిదాసుచే లిఖింపబడిన మరో అందమైన స్తుతి "దేవీ ప్రణవ శ్లోకీ స్తుతి". కాళి కి సేవకుడు కాబట్టి "కాళిదాసు" అనే పేరు కాళిదాసుకి స్థిరపడింది అంటారు. కాళికాదేవి ఆయనకు జ్ఞానాన్ని ప్రసాదించిన వెంఠనే ఆశువుగా కాళిదాసు చేసిన దేవీ స్తుతే ఈ "దేవీ ప్రణవ శ్లోకీ స్తుతి". ఈ రచనలో కాళిదాసు ఉపయోగించిన పదజాలం క్లిష్టమైనది కావటం వలన ఇది ఎక్కువ ప్రచారంలోకి రాలేదేమో మరి. 

'వేగవంతమైన ఆడగుర్రము పరుగు కంటే తీవ్రమైన వేగము కల కవిత్వ ధాటిని తనకు హిమవంతుని కుమార్తె అయిన పార్వతి ప్రసాదించుగాక' అని ప్రార్ధిస్తూ అశువుగా చెప్పిన స్తుతి ఇది. అందుకనే అశ్వధాటితో చెప్పబడినది అని కూడా అంటారు. పది శ్లోకాలు గల ఈ స్తుతిని "దేవీ దశశ్లోకి" అని, "దేవీ ప్రణవ శ్లోకీ స్తుతి" అని కూడా అంటారు. 

 ఈమధ్యన కొన్న ఒక (స్తోత్రాలు,అష్టకాలు ఉన్న) పుస్తకంలో "అంబాష్టకమ్" పేరుతో ఉన్న ఈ స్తుతి 'శంకరాచార్య విరచితం' అని రాసారు. అందువల్ల ఈ స్తోత్ర రచన ఎవరు చేసారన్నది కూడా సందిగ్థమేనన్నమాట అనుకున్నా. 
సందిగ్థత సంగతి ఎలా ఉన్నా ఈ స్తోత్రం మాత్రం చాలా బావుటుంది. నాకు ఈ "దేవీ ప్రణవ శ్లోకీ స్తుతి" గురించి ఎలా తెలిసిందో, ఆఖరికి ఎలా దొరికిందో ఈ టపాలో  రాసాను..:)


దేవి ప్రణవ శ్లోకీ స్తుతిని ఇక్కడ వినవచ్చు:

http://www.raaga.com/play/?id=39246



క్రింద రాసినవి నాకు దొరికిన పుస్తకం లోని "దేవీ దశశ్లోకి" పద్యాలు:


చేటీభవన్నిఖిల ఖేటీ కదంబవవనవాటీషు నాకిపటలీ
కోటీర చారుతర కోటీమణీకిరణ కోటీకరంబితపదా
పాటీరగంధ కుచశాఠీ కవిత్వ పరిపాటీ మగాధిపసుతాం
ఘోటీకులా దధికధాటీ ముదారముఖవీటీరసేనతనుతాం

బాలా మృతాంశునిభఫాలా మనాగరుణచేలా నితంబఫలకే
కోలాహలక్ష పితకాలామ రాకుశల కీలాల శోషణరవి:
స్థులాకుచే జలదనీలా కచే కలితలీలా కదంబవిపినే
శూలాయుధ ప్రణతిశీలా విభాతు హృది శైలాధిరాజతనయా

యత్రాశయో లగతి తత్రాగజా భవతు కుత్రాపి నిస్తులశుకా
సుత్రామ కాలముఖ సత్రాశన ప్రకర శుత్రాణ కారి చరణా
చత్రా నిలా తిరయ పత్రాభిరామ గుణ మిత్రా మరీ సమవధూ
కు త్రాన సహన్మమణి చిత్రాకృతి స్వరిత పుత్రాది దానవ పుణా

ద్వైపాయన ప్రభృతి  శాపాయుధ త్రిదివ సోపానధూళిచరణా
పాపాపహశ్వమను జాపానులీన జనతా పాపనోదనిపుణా
నీపాలయా సురభిధూపాలకా దురితకూపా దుదంచయతు మాం
రూపాధికా శిఖరి భూపాల వంశమణిదీపాయితా భగవతీ

యా ళీభి రాత్తతను రాళీ లసత్ప్రియ కపాలీషు ఖేలతి భవ
వ్యాలీనకుల్య సితచూళీభరా చరణధూళీలసన్మునిగణా
యాళీభ్రుతిశ్రవసి తాళీదలంవహతి యాళీకశోభితిలకా
సాళీ కరోతు మమ కాళీ మన: స్వపదనాళీకసేవనవిధౌ

న్యంకాకరే వపుషి కంకాలరక్త పుషి కంకాదిపక్షివిషయే
త్వం కామనా మయసి కింకారణం హృదయ పంకారి మేహి గిరిజాం
శంకాశిలానిశితటంకాయ మానపద సంకాశా మానసుమనో
ఝంకారి భ్రుంగతతి మంకానుపేత శశి సంకాశవక్త్ర కమలాం


ఇంధానకీరమణిబంధా భవే హృదయబంధా వతిన రసికా
సంధావతీ భువన సమ్ధారనేశ్యమృతసింధా వుదార నిలయా
గంధాను భావముహ రంధాళి పీతకచ బంధా సమర్పయతు మే
సంధామ భానురపి రుంధాన మాశు పదసమ్ధాన మస్య సుగతా

దాసాయమానసుమహాసా కదంబవనవాసా కుసుంభ సుమనో
వాసా విపంచి కృత రాసావిధుతమధుమాసా రవిందమధురా
కాసారసూనతతి భాసాభిరామతను రాసారశీతకరుణా
నాసామణి ప్రవరభాసా శివా తిమిరమాసాదయే దుపరతం

జంభారికుంభిపృథు కుంభాపహాసికుచ సంభావ్య హారలతికా
రంభా కరీంద్ర కరడంభాపహోరు గతిడింబానురంజితపదా
శంభా వుదారపరికుంభాంకురత్పులకడంభానురాగపిశునా
శంభా సురాభరణగుంభా సదా దిశతు శుంభాసుర ప్రహరణా

దాక్షాయనీ దనుజ శిక్షావిదౌ వితతదీక్షా మనోహరగుణా
భిక్షాశినో నటన వీక్షావినోదముఖి: దక్షాద్వర ప్రహరణా
వీక్షాం విదేహి మయి దక్షా స్వకీయజనపక్షా విపక్షవిముఖీ
యక్షేశసేవిత నిరాక్షేప శక్తి జయలక్ష్మ్యావధానకలనా

వందారు లోకవర సంధాయనీ విమలకుందావదాత రదనా
బృందార బృందమణి బృందారవింద మకరందాభిషిక్త చరణా
మందానిలాకలిత మందారదామభి రమందాభిరామమకుటా
మందాకినీ జవనభిందానవాచ మరవిందాననా దిశతుమే