"Paap" అని నటి పుజాభాట్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఒకటి ఉంది. పెద్దగా ఆడినట్లు లేదు. జాన్ అబ్రహం పర్వాలేదు కానీ ఆ హీరోయిన్ను అసలు చూడలేం. దాంట్లో రెండు పాటలు చాలా బావుంటాయి. ఒకటి 'అనురాధా పౌడ్వాల్' పాడినది. అప్పట్లో పత్రికల్లో వచ్చిన కారణాలు నిజమో కాదో తెలిదు కానీ చాలా బాగా పాడే ఈవిడ ఎక్కువ హిందీ పాటలు పాడలేకపోవటం దురదృష్టకరం. ఆవిడ పాడిన మంచి పాటల్లో ఇది ఒకటి అనిపిస్తుంది ఈ పాట వింటే. "ఇంతేజార్.." అనే ఈ పాట సాహిత్యం చాలా నచ్చుతుంది నాకు. ఓ సారి వినేయండి మరి..
సంగీతం: Anu Malik,
సాహిత్యం: Sayeed Quadri
*** *** ***
రెండవ పాట "లగన్ లాగీ తుమ్సే మన్ కి లగన్.." అనీ '
రాహత్ ఫతే అలీ ఖాన్' పాడినది. "నస్రత్ ఫతే అలీ ఖాన్" మేనల్లుడైన ఈ గాయకుడు ఈ పాటతో బాలీవుడ్లో అడుగుపెట్టి మరేన్నో అద్భుతమైన పాటలను పాడాడు.
.
పాట: మన్ కి లగాన్
సంగీతం : Shahi,
సాహిత్యం: Amjad Islam Amjad
ఇతను పాడిన మిగిలిన పాటల జాబితా
ఇక్కడ చూసేయండి .