ఒకప్పుడు పండగ అంటే పూజకు చాలావరకూ అవసరమైనవి రైతులో, తెలిసినవాళ్ళో తెచ్చి ఇచ్చేస్తూ ఉండేవారు అన్నీ ఫ్రీగా..!!
మరి ఇప్పుడో...
కొబ్బరికాయ పదిహేను రూపాయిలు..
పది తమలపాకులు పాతిక రూపాయిలు..
డజను అరటిపళ్ళు ముఫ్ఫై ఐదు రూపాయిలు..
పావు కిలో పువ్వులు ఎనభై రూపాయిలు..
అమ్ముతున్నారని ముచ్చటగా "మొగలిపువ్వు" కొనబోతే ఏభై రూపాలట..
ఇక సరదాలకి పోయి తామర పూలు, అరటి పిలకలు ...అనుకుంటే ఇక పర్సు ఖాళీ...
బస్సు ఎక్కలేక ఆతో పిలిస్తే మీటరు తిరగదు కానీ వాళ్ళు చెప్పే రేటు వింటే కళ్ళు తిరుగుతున్నాయి...!!