ఈ మధ్యన కొన్ని సూపర్ మార్కెట్లలో కూడా ఓ పక్కగా చిన్న రేక్ లో సీడిలను అమ్ముతున్నారు. అలా ఓ రోజు ఈ "ఘంటసాల, పి.లీల సినీ హిట్స్ " సీడీ చూడ్డం కొనటం జరిగింది. 'sa re ga ma' వాళ్ళ ఈ mp3 లో చాలా వరకూ పాటలు మనకు తెలుసున్నవే. చివరలో ఓ పదొ ఎన్నో నాకు తెలివు అంటే. మీరు గుర్తుపట్టడానికి వీరిద్దరూ పాడిన ఈ సీడీ లోని కొన్ని మంచి పాటలు:
*ఈనాటి ఈ హాయి
*కలవరమాయే మదిలో
*లాహిరి లాహిరి లాహిరిలో
*ఓహో మేఘమాల
*మనిషి మారలేదు
*అన్నానా భామిని
*చూపులు కలిసిన శుభవేళ
*ఎచటి నుంచి వీచెనో
*ఊరేది పేరేది
*సుందరాంగులను
కొని దాచుకోవటానికి మంచి కాంబినేషన్స్.