జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైన "భజగోవిందం" అంటే నాకు చాలా చాలా ప్రీతి. అందులోనూ ఎమ్మెస్ గళంలో ! వింటూంటే మనసంతా ప్రశాంతంగా మారిపోతుంది. ఒక భజనగా పాడుకునే "భజగోవిందాన్ని" వేదాంతసారంగా పరిగణిస్తారు. ఈ సంసారం, ధనం, ప్రాపంచిక సుఖాలు అన్నింటిలోనూ ప్రశాంతత ఎందుకు పొందలేకపోతున్నాము? జీవితం ఎందుకు? జీవితపరమర్ధం ఏమిటి? సత్యమేమిటి? మొదలైన ప్రశ్నలకు అర్ధాన్ని చెప్పి, మనిషిలోని అంత:శక్తిని మేల్కొలిపి సత్యాన్వేషనకు పురిగొల్పుతుందీ భజగోవిందం.
"భజగోవిందం" సాహిత్యం pdf ఇక్కడ చూడవచ్చు.
యూ ట్యూబ్ లో దొరికిన ఆంగ్ల అర్ధంతో పాటూ ఉన్న ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగారి గళం క్రింద వినండి. అదే లింక్ లో క్రిందుగా శంకరాచార్యులవారు దీనిని రచించిన సందర్భం కూడా వివరించబడి ఉంది.