వచ్చింది....మళ్ళీ వచ్చింది...మళ్ళీ వచ్చింది. ఈసారి అతనికి కాక మరెవరికి? అతని కంటే ఘడెవ్వరు? అన్ని ప్రాంతీయ సినిమాల్లో ఎంతో మంది గొప్ప కళాకారులు ఉన్నారు. తప్పకుండా ఒప్పుకుని తీరాలి. కానీ యావత్ భారత దేశంలో 67ఏళ్ల వయసులో కూడా 'వాహ్! ఈ పాత్రను అతనొక్కడే చెయ్యగలడు' అనిపించాడు, నిరూపించాడు "పా" సినిమాతో. ఫిల్మ్ ఫేర్ వచ్చింది. ఇవాళ 2009 national awards లో best male actor award మరోసారి సాధించుకున్నాడు.
దేశంలో ఎన్నో రకాల అవార్డ్ లు ఇవాళ. ఎంతో మందికి ఎన్నో రకాల అవార్డ్ లు వస్తూంటాయి. కానీ ఈసారి ఇది ప్రత్యేకం ఎందుకంటే ఈ "ఆరో" పాత్ర అంతటి ప్రత్యేకం. వయసులో ఉన్న నటులు ఎన్ని రకాల పాత్రలైనా ప్రయోగాలు చేయవచ్చు...పోషించవచ్చు. కానీ వయసు మళ్ళిన వ్యక్తి అటువంటి చాలెంజింగ్ రోల్ ను ఈజీగా, సమర్ధవంతంగా చేయటం ఇక్కడి విశేషం.
గత డిసెంబర్లో అనుకుంటా "పా పాటల కబుర్ల"తో ఒక టపా రాసాను. ఈ సినిమా చూడాలని రిలీజ్ కు ముందు నుంచీ ఎంతో ఎదురుచూసాను...కుదరలేదు. ఒక ఆరు నెలల తరువాత సీడీ కొనుక్కుని చూడగలిగాను. అమితాబ్ ఎంత మంచి నటుడో నేను కొత్తగా చెప్పనక్కరలేదు. అందరికీ తెలిసున్నదే. కాని సినిమా చూసాకా నాకు అనిపించినది మాత్రం చెబుతాను...
మొదటిసారిగా అమితాబ్ సినిమాలో అమితాబ్ కనిపించడు. అది "పా" ద్వారా సాధ్యమైంది. సినిమాలో అమితాబ్ "ప్రోజేరియా" అనే అరుదైన జెనిటిక్ డిసాడర్ ఉన్న ఒక పిల్లవాడే మనకు కనిపిస్తాడు. ఒక పదమూడేళ్ళ కుర్రవాడుగా మాత్రమే కనిపిస్తాడు. విడిపోయిన తల్లిదండ్రులను కలిపాలని తాపత్రయపడే కొడుకుగా కనిపిస్తాడు. ఇంకా చెప్పాలంటే, తన క్లోజ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నప్పుడు ఒక జీనియస్ ఛైల్డ్ లా...అమ్మమ్మతో అల్లరి చేస్తున్నప్పుడు కొంటె మనవడుగా... తల్లితో ఉన్నప్పుడు ఒక వారిద్దరి అప్యాయానుబంధాన్ని చూపే అనురాగంలా...అముల్ తన తండ్రి అని తెలిసాకా తండ్రి ప్రేమ కోసం తహతహలాడే కొడుకుగా... తన చివరి క్షణాలు దగ్గరగా ఉన్నాయని తెలిసినప్పుడు ఓ గొప్ప
తాత్వికుడిగా... వివిధ కోణాల్లో కనిపిస్తాడు. అమితాబ్ ఇమేజ్ నూ, ఫాన్ ఫాలోయింగ్ నూ, స్టార్డం నూ మనం ఫీలవ్వము.
అది డైరక్టర్ ఆర్.బాలకృష్ణన్ ప్రతిభ, పి.సి.శ్రీరామ్ కెమేరా పనితనం, Stephen Dupuis ("Mrs. Doubtfire" సినిమాలో రోబిన్ విలియమ్స్ కు మేకప్ చేసినతను) మేకప్ వల్ల అనచ్చు. కానీ....కానీ ఈ పాత్ర కు అమితాబ్ తప్ప వేరెవారూ అంతటి న్యాయాన్ని చేసేవారు కాదేమో అనటం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అది తండ్రీ-కొడుకుల సినిమా అని ప్రచారమైతే చేసారు కాని సినిమా చూసాకా ఇది ఒక తల్లీ-కొడుకుల బంధం అనిపించకమానదు.
మీరేమన్నా అమితాబ్ పంఖనా? అని అడగవచ్చు ఎవరన్న....కాదు !! కానీ భారతదేశం లోని గొప్పనటులలో ఒకనిగా, ఒక అత్యుత్తమ అభినయ నైపుణ్యం ఉన్న వ్యక్తిగా అతనంటే అభిమానం. గౌరవం.
Hats off to BIG Paa and a Standing Ovation to Amitabh..!!
మీరేమన్నా అమితాబ్ పంఖనా? అని అడగవచ్చు ఎవరన్న....కాదు !! కానీ భారతదేశం లోని గొప్పనటులలో ఒకనిగా, ఒక అత్యుత్తమ అభినయ నైపుణ్యం ఉన్న వ్యక్తిగా అతనంటే అభిమానం. గౌరవం.
Hats off to BIG Paa and a Standing Ovation to Amitabh..!!