నిన్న సాయంత్రం పాపకి హోమ్ వర్క్ లేదు కదా అని టి.వి.పెట్టాను.టి.వి ముందు కూర్చుని పుర్తి సినిమా చూసి చాలా రొజులు అయ్యింది...చానల్స్ తిప్పుతున్న నా కళ్ళు స్టార్ మూవీస్ దగ్గర ఆగిపొయాయి."outsourced" అనే కిచిడీ సినిమా(సగం హిందీ,సగం ఇంగ్లీషు కలిపి ఉండేవి) వస్తోంది.సగం అయిపోయింది.ఎందుకొ కట్టేయాలనిపించలేదు.మిగిలిన సగం సినిమా చూసేసాను.అబ్బ! అనేలా లేదు కానీ...బానే ఉంది.Josh Hamilton, Ayesha Dharker ప్రధాన పాత్రధారులు.ఉద్యొగరీత్యాఇండియా వచ్చిన ఒక అమెరికన్ కి ఎదురైన రకరకాల అనుభవాలు,అవి అతనిలొ తెచ్చిన మార్పు కధాంశం.మనదేవుళ్ళ గురించి,గుడీలో శివలింగం ఆ రూపంలో ఎందుకు ఉంటుంది,బొట్టుఎందుకుపెట్టుకుంటారు....ఇలాటి కొన్ని విషయాలను హీరోయిన్ అమెరికనబ్బాయికి చెప్పిన వాక్యాలు బాగున్నాయ్.నెట్లోకి వెళ్ళి సినిమాడీటైల్స్ చూసా.2006లో వచ్చిన ఈ సినిమా రకరకాల 6అవార్డ్ లుకూడా దక్కించుకున్నదట.ఇలాటి కిచిడీ సినిమా ఓటి అప్పుడెప్పుడో ఇంకోటి చూసా "Flavours" అని.అది చాలా నచ్చింది నాకు.అమెరికాలొ సెటిల్ అయిన కొందరు భారతియుల జీవితాలను విడి విడిగా చూపిస్తూ, అఖరుకి అందరి కధలనీ ఒకే plotలోకి అల్లిన ఆ స్క్రీన్ ప్లే బాగుంటుంది.
సినిమాలు అందరూ చూస్తారు.అదేంగొప్ప కాదు.కానీ ఎంపిక చేసుకుని సినిమాలు చూడటం అనేది నాకు అమ్మానాన్నలు నేర్పారు. సినిమాలు చూసే అలవాటు ఎలా అయ్యిందంటే....
బెజవాడలో మా ఇంటి దగ్గర "విజయ టాకీస్" అనే సినిమా హాలు ఉండేది. అందులో అన్నీ పాత తెలుగు సినిమాలు వచ్చేవి.మా అమ్మ అవన్ని మా పిల్లలకు చూపించేది.చిక్కడు దొరకడు,గండికోట రహస్యం,పాతాళభైరవి లాంటి జానపదాలు,సీతారామ కల్యాణం,లవకుశ,భీష్మ,శ్రీకృష్ణపాండవీయం,లాంటి పౌరాణికాలు,భక్త ప్రహ్లాద,భక్త రామదాసు, త్యాగయ్య,మహాకవి కాళిదాసు..లాంటి భక్తి చిత్రాలు, మూగ మనసులు,లక్ష్మీ నివాసం, దేవదాసు, ఆరాధన, బాటసారి,మంచి మనసులు,డాక్టర్ చక్రవర్తి లాంటి సామాజిక చిత్రాలు మొదలైనవన్నీ చూపించేది.పాత తెలుగు సినిమాలను,వాటి విలువలను మాకు తెలియచెయ్యాలని అమ్మ తాపత్రయపడేది.
నాన్న Madras film institute student కావటం వల్ల ఆయన ఆ ఇంట్రస్ట్ తో మాకు అన్ని భాషల సినిమాలూ చూపించేవారు.ఫిల్మ్ డివిజన్ వాళ్లు అంతర్జాతీయ చిత్రాలను తెచ్చి ప్రదర్శిస్తూ ఉండేవారు.Russian,German,Italian,Chinese ఇలా వాళ్ళు తెచ్చిన వివిధ దేశాల చిత్రాలను కొన్నింటిని చూపించేవారు నాన్న. బందర్ రోడ్డు చివరికి వెళ్తే "లీలా మహల్" అని ఇంకో హాలు ఉండేది.దానిలో అన్నీ ఇంగ్లీషు సినిమాలు వచ్చేవి. నాన్న మమ్మలను వాటికి తీసుకువెళ్ళేవారు.The Sound of music,speilberg తీసిన అన్ని సినిమాలు,walt Disney productionsవాళ్లవి,Laurel Hardy వి,Charlie chaplin వి, Jungle book,Sidney poitierది "A patch of blue",BenHar,Ten commandments,20,000 Leagues under the sea,For a fewdollers more , Speed,Absolute power, matrix.... ఇలా "A"సర్టిఫికేట్ సినిమాలు తప్పించి ఆ హాల్లొ కొచ్చిన ఎన్నొ మంచి మంచి సినిమాలు చూపించేవారు నాన్న.అందరం కలిసి అయితే తెలుగు,హిందీ సినిమాలు చూసేవాళ్ళం.తెలుగులో అయితే బాలచందర్,విశ్వనాథ్,బాపు,వంశీ,మణిరత్నం,జంధ్యాల,కృష్ణవంశి....ఇలా కొందరు ఉత్తమదర్శకులు తీసిన సినిమాలే చూపించేవారు...అలా అలవాటయ్యింది మాకు సరైన ఎంపికతొ సినిమాలు చూడటం అనేది.ఒకప్పుడు దూరదర్శన్ లో ప్రాంతీయ భాషాచిత్రాలు,రాత్రిళ్ళు అప్పుడప్పుడు వేసే వివిధ భాషాచిత్రాలు మాత్రమే చూసేవాళ్లం.అలా చూసినవే Satyajit ray,shyam benegal,Guru dutt,Raj kapoor,kishore kumar,bimal roy,Hrishikesh mukharjee...మొదలైన హేమాహేమీల సినిమాలన్ని దురదర్శన్ వాళ్ళు వేస్తే చూసినవే.తరువాత కేబుల్ టి.వి.పుణ్యమా అని వందల కొద్దీ చానల్స్ లో నానారకాల సినిమాలూ..!!వి.సి.డి ల తరువాత సి.డి లు,డి.వి.డీలు....అనేకం ఇవాళ్టిరొజున. ఇప్పుడు వద్దంటే సినిమా...!!
."ఏదో ఒకటి చూసాం అని కాకుండా,ఆ సినిమా చూడటం వల్ల ఏదన్నా ప్రయోజనం ఉందా?అని ప్రశ్నించుకుని ఏ సినిమా అన్నా చూడాలి " అంటారు నాన్న.ఇప్పుడు మాకు మేమై సినిమాలు చూస్తున్నా నాన్న చెప్పిన సుత్రాన్ని ఎన్నడూ మరవలేదు మేము.