సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, July 12, 2023

మౌనం?




ఏమిటీ మౌనం? ఎప్పుడు మళ్ళీ రాస్తావు? అని ఎవరైనా స్నేహితులు అడిగినప్పుడల్లా మనసుకి చాలా ఆనందం కలుగుతుంది. ఒక్కరు కాదు ఇద్దరు ముగ్గురు అడిగారు చాలా రీసెంట్ గా.

మాటల్లో చెప్పలేనంత ఆనందం... 

ఇన్నాళ్లైనా ఇంకా రాయమని అడిగేవారు ఉన్నారన్న తృప్తి,

మళ్ళీ బ్లాగ్ వైపు చూసేలా చేస్తుంది!

ఇది నా ప్రపంచం. 

నా అక్షరాలు నా ఉనికిని వెతుక్కుంటూ దిగంతాల వరకూ పయనించే ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఈ బ్లాగ్లోనే!

ఈ పయనం ఎన్నో అవాంతరాలను, ఆక్రందనలను, అవమానాలను,  తట్టుకుని, దాటుకుని, ఇంకా సాగుతూనే ఉంది.

మౌనంలో కూడా పయనమే ఉంది.

అప్పుడప్పుడూ కొన్ని సమాధానాలు చెప్పాలనిపిస్తుంది..

కానీ మౌనం అన్నింటినీ మించిన గొప్ప సమాధానం కదా!  

నామటుకు నాకు -

అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఇదే సత్యం.

మౌనమే ప్రశ్న.

మౌనమే జవాబు.

మౌనమే ప్రశాంతత.

మౌనమే జ్ఞానం.

ఇంతకు మించి వేరేమీ లేదు.

చివరకు మిగిలేది అంతకన్నా ఏదీ లేదు.


5 comments:

Swapna G said...

Mounaaniki oka bhashaa ,bhaavam untundani baagaa cheppaaru.

అనంతం కృష్ణ చైతన్య said...

మీ ప్రతి అక్షరం నా మేధస్సుకు పడునుపెడుతుంది. మీ ప్రతి భావం నా దృష్టిని విశదపరిస్తుంది. మీ ప్రతి టపా అమ్మ మాటలు లాగా గురువులాగ గురి కుదురుస్తుంది. మీ బ్లాగ్ చదివిన తర్వాతే నేను ఒక పుస్తక అభిరుచిని ఏర్పరుచుకున్నాను.

తృష్ణ said...

@swapna G : Thank you.
@అనంతం కృష్ణ చైతన్య : మీరు రాసిన రెండు, మూడు కామెంట్స్ చదివాను. ధన్యవాదాలు. నా బ్లాగ్ చదువుతున్నందుకు, ఇంకా ఫాలో అవుతున్నందుకు కృతజ్ఞతలు. ఇలా ఎవరైనా పలకరించినప్పుడే చైతన్యం మరోసారి జాగృతమై ఇక్కడ ఆలోచనల అక్షరాలను పోగేయాలనే తృష్ణ పుడుతుంది.

అనంతం కృష్ణ చైతన్య said...

మీ అభిమానిని. మీలాగా మనసును తాకేలాగా వ్రాయాలి అని చాలా కోరిక. మీరు ఎప్పుడూ మమ్మల్ని పలకరించాలి. మీ రచనలలో ఇప్పుడు ఒక తెలియని వేదన ఒక తగిలిన గాయం ఒక చెదిరిన మనసు కనిపిస్తున్నాయి. ఒక 10 యేళ్ళు క్రితం ఒక పిల్ల తెమ్మెర, ఒక శీతాకాలపు వేడి, ఒక వర్షాకాలపు మట్టి వాసన, ఒక గోదవరి నది ప్రయాణం లాగా గుబాళించేవి. ఇప్పుడు ఒక అగాధమంత మౌనం, ఒక మంచు పర్వతం అంత నిస్సంగం, ఎదురుగా కనిపించేంత దూరం ఉన్నా అధిరోహించలేని కైలాస పర్వతం లాంటి భావం ఇప్పుడు మీ రచనలలో కనిపిస్తున్నాయి. ఇది కాలం తెచ్చిన మార్పో, అనుభవం తెచ్చిన నేర్పో తెలియదు. కాని ఎప్పుడూ మీ రచనలు మా మేధ కు క్రొత్త ఆలోచనలని ఇస్తున్నారు. మీకు ఎప్పుడూ మా కృతఙ్ఞతలు.

తృష్ణ said...

ధన్యవాదాలు. ఎంతో కృతజ్ఞతలు. ఇంకా రాయాలనే ప్రయత్నం.