సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, October 21, 2013

"అట్లతద్దోయ్ ఆరట్లోయ్ .."





మరేమో ఇవాళ అట్లతద్ది కదా.. పొద్దున్న అమ్మ ఫోన్లో మాట్లాడుతూ "మునుపు రేడియోలో అట్లతద్ది పాటలు వేసేవారు 'జనరంజని'లో అయినా... ఇవాళ ఒక్క పాటా వెయ్యలేదే.." అంది. సరే నే వినిపిస్తానుండు అని నెట్లో వెతికి ఫోన్లోనే రెండు పాటలు వినిపించా.. అమ్మ సంతోషపడింది. సరే ఆ పాటలు బ్లాగ్లో పెడితే అమ్మాలాగా అట్లతద్ది పాటలు వినాలనుకునేవారెవరన్నా వింటారు కదా.. అని అవుడియా వచ్చింది. అదన్నమాట..:)


నేను అట్లతద్ది నోములాంటివి ఏమీ నోచలేదు కానీ అమ్మ ప్రతి ఏడూ గోరింటాకు పెట్టేది. అమ్మావాళ్ళు చిన్నప్పుడు ఎంత సరదాగా అట్లతద్ది చేసుకునేవారో చెప్పేది. "అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్.." అని ఫ్రెండ్స్ అందరూ అరుచుకుంటూ వెళ్ళి ఉయ్యాలలూ అవీ ఉగడం, అమ్మమ్మ అట్లు చేయడం మొదలైన కబుర్లు ప్రతి ఏడూ అప్పుడే వింటున్నట్లు మళ్ళీ కొత్తగా వినేవాళ్లం!
అట్లతద్ది నోము కథ లింక్ దొరికింది..చూడండి:
http://www.teluguone.com/devotional/content/atla-taddi-nomu-113-1441.html 


పాత సినిమాల్లో అట్లతద్ది పాటలు కాసిని ఉన్నాయి గానీ నాకు మూడ్నాలుగే దొరికాయి.. అవే పెడుతున్నాను..

 
1) రక్త సింధూరం చిత్రంలో పాట "అల్లిబిల్లి పిల్లల్లారా ఇల్లా రండి మీరు.. ఇలా రండి అట్లాతద్ది కన్నెనోము నోచాలండి.. నేడే నోచాలండి.." సుశీల బృందం పాడారు..ఆరుద్ర రచన ..

2) పవిత్రబంధం చిత్రంలో ఓ పాట ఉంది.. "అట్లతద్దోయ్ ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్ మూడట్లోయ్ ఆటలనోము అట్లతద్ది ఆడపిల్లలు నోచేతద్ది వేడుకమీరగ కోరిక తీరగ ఓ చెలియా నోచవే జీవితమే పూచునే.." అని!


3) "అట్లతద్ది ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్.." అంటూ పాడిపంటలు సినిమాలో మరో పాట ఉంది కాని అది ఓ పట్నం అమ్మాయిని ఉడికిస్తూ పాడే పాట. అందుకని అట్లతద్ది కన్నా ఎక్కువ తెలుగుతనం ఉట్టిపడేలా ఎలా ఉండాలో చెప్పేపాట ఇది.
పాట ఇక్కడ వినండి:
 http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=3112 



4) బొబ్బిలి యుధ్ధం లో "ముత్యాల చెమ్మచెక్క.." పాట అట్లతద్ది పాట అవునో కాదో గుర్తులేదు కానీ అందులో "ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె.." అనే వాక్యం ఉంటుంది.. కాబట్టి బాగుంటుందని ఆ పాటని కూడా జతచేస్తున్నానిక్కడ :)

5 comments:

Manasa Chamarthi said...


తృష్ణగారికీ, సునీత గారికీ థాంకూలు. :) - తేనెతుట్టను కదిలించినందుకు..;). కొన్ని కుడతాయేమో ఇప్పుడు :))--- నా పూచీ కాదు.

నాకు జీవితం మొత్తమ్మీదా ఒకట్రెండు సార్లు జరుపుకున్నట్లు గుర్తు. అది కూడా చాలా చిన్నప్పుడు. అప్పుడు మాత్రం అట్లూ తిన్నాం, గోరింటాకూ పెట్టుకున్నాం, ఉయ్యాలలూ ఊగాం. ముద్దపప్పు, గోంగూర పచ్చడి తెల్లవారుఝామునే ఎవరో ముద్దలు కలిపి పెట్టినట్టు గుర్తు- పిల్లలందరినీ పోగేసి. ఇప్పుడు ఆమాట ఎవరికైనా చెప్తే, "అమ్మో! ఎసిడిటీ రాలేదూ...?" అంటారేమో..

గోరింటాకు అంటే గుర్తొచ్చింది, ఎర్రగా పండిన గోరింట చేతుల్లో చందమామ చూసుకోవడం నాకెప్పుడూ ఇష్టంగా అనిపించే కొన్నింటిలో ఒకటి. వేళ్ళకి టోపీలు పెట్టుకుంటే, కొన్నాళ్ళకు గోళ్ళు పెరిగే కొద్దీ అర్థచంద్రం మిగులుతూ పోతుంది కదా, అదీ ఇష్టమే. ఒకప్పుడు ఆ గోళ్ళను చూసి జనాలు ఎంత వెటకారాలు చేసేవాళ్ళూ!! ఇప్పుడు "French Tippping" వచ్చింది...అది ఈ గోరింట వేళ్ళను చూసిన వాడెవడో కాపీ కొట్టేయలేదు కదా అని అనిపిస్తూనే ఉంటుంది. :)))

నోముల సంగతేంటో నాకు తెలీదు :). అత్తారింట్లోనూ ఆనవాయితీ ఉన్నట్టు లేదు, ఐనా పది మందీ కలిసేవన్నీ ఏపేరు పెట్టి చేసినా నాకు సరదాగానే అనిపిస్తాయ్. ఆఫీసుల్లో పడి, శనాదివారాలు కూడా జనాలను తప్పించుకు తిరగడం ఒక అలవాటుగా మారిపోయింది తెలీకుండానే .." You need time for yourself" ఒప్పుకోవాల్సిన మాటే కానీ, మరీ ఎటుపోతున్నాం అనిపిస్తోంది ఈ మధ్య . కనీసం ఇలాంటివి కొన్ని ఉంటే కలుస్తాం కదా సరదాగా అనిపిస్తుంది. 

sarma said...

టపా బాగుంది. మీ టపా లింక్ నా బ్లాగులో ఇస్తున్నాను.అంగీకరించగలందులకు విన్నపం.

సూర్యుడు said...

Good one, thanks for sharing your memories about this festival.

In future, we may not even know that there is a festival like this :(

తృష్ణ said...

@manasa: great! sweet memories..isn't it! Thank a lot for sharing them here..

@sarma:thanks sarma gaaru..my pleasure :)

@suryudu:yes..:( we have to carry them as far as we can...
thanks for the visit.

Sudha Rani Pantula said...

తృష్ణగారు, మీ లింక్స్ బాగున్నాయి. నాకు ఈ బొబ్బిలి యుద్ధం పాట మాత్రమే తెలుసు. అందుకే దానిగురించే రాసాను.