సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, April 3, 2013

500 !






మేనెల చివరకి నాలుగేళ్లవుతాయి బ్లాగ్ మొదలుపెట్టి. నా జీవితంలో దాదాపు నాలుగేళ్ళ కాలాన్ని తన సంచీలో వేసేసుకుందీ బ్లాగ్లోకం :)
నాలుగేళ్ల ముందు దాకా నా జీవితం ఒక ఎత్తు. ఇక్కడ అడుగుపెట్టాకా మారిన జీవితం ఒక ఎత్తు ! 
ఈ నలభై ఆరు నెలల్లో ఎన్నో మార్పులు వచ్చాయి నా జీవితంలో... ఆరోగ్యంలో.. మనస్తత్వంలో... !!
ఏదెలా జరిగినా, నేను ఎప్పుడూ - ఎప్పటికీ నమ్మేది ఒక్కటే... "ఏది జరిగినా మన మంచికే" అని. 

ఈ బ్లాగ్జీవనయానంలో, జీవితపు ఒడిదొడుకుల మధ్యన నాకు ఆటవిడుపుని అందించిన ప్రత్యేక నేస్తం నా "తృష్ణ". నాలో జరుగుతూ వచ్చిన మార్పులకి ఒక స్పెక్టేటర్ అన్నమాట. 

"ఈ బ్లాగ్ నా సొంతం. నాకు తోచిన రాతలు రాసుకుంటాను.." అని ఆనందించినంత సేపు పట్టలేదు ఇక్కడ కూడా జీవితంలో మాదిరి ఎంత చీకటి దాగుందో తెలియటానికి. బ్లాగ్లోకంలో ఆనందించిన క్షణాల కన్నా నేర్చుకున్న పాఠాలే ఎక్కువ. ఇక్కడందరు మంచివాళ్ళే! కానీ మంచివాళ్ళు ఇన్నిరకాలుగా  ఉంటారని ఇక్కడే తెలిసింది ! 

ఏదేమైనా నా లోకం నాది. నా లోకంలోకి తొంగి చూసే అవకాశాన్ని మాత్రం నా బ్లాగ్ ద్వారా ఇస్తున్నాను. నచ్చితే చదవండి. లేకపోతే ముందుకి సాగిపొండి. ఈ టపాతో "తృష్ణ" బ్లాగ్లో 500 టపాలు పూర్తవుతాయి! ఎవరికైనా సమయం ఎంతో విలువైనది. నా సమయాన్ని వెచ్చించి రాసిన ఈ టపాలన్నీ మీ విలువైన సమయాన్ని వెచ్చించి చదివి, నన్ను ప్రోత్సహించిన బ్లాగ్మిత్రులకూ, శ్రేయోభిలాషులకూ హృదయపూర్వక ధన్యవాదాలు. 


28 comments:

MURALI said...

500 లా? :o

బాబోయ్ తృష్ణగారూ, మీరు గ్రేటండి. మీకు 500ల వీరతాళ్ళు :)

శ్రీనివాస్ పప్పు said...

పంచశతకటపాభినందనలు తృష్ణ గారీ మీరిలా అప్రతిహతంగా సాగిపోతూ సహస్రం కూడా తొందర్లోనే పూర్తిచెయ్యాలని కోరుకుంటున్నా

మధురవాణి said...

500 is a very big number.. Congratulations.. Way to go! :-)

Unknown said...

శుభాకాంక్షలండి .

నిరంతరమూ వసంతములే.... said...

Congrats Trushna garu..:)

శశి కళ said...

ఓహ్...గ్రేట్.అభినందనలు

Sujata M said...

అవునా ! భలే కదూ ! మీ బ్లాగు ప్రయాణం లో మొదట్నించీ మాది మీ ఎదుటి బెర్తే ! దాదాపు అన్ని పోస్టులూ చదువుతూ ఉంటాం మేం ! ఒక వేళ ఎపుడన్నా మిస్ అయితే, మళ్ళోసారి వీలు చూసుకుని బాక్లాగ్ లన్నీ కవర్ చేసుకుంటూ చదూతూంటాం కాబట్టి మాక్కూడా మీతో ప్రయాణం చాలా బాగుందనిపించింది. అభినందనలు ! మంచీ చెడూ జాంతా నై ! మీ పొస్టులన్నీ మంచివే ! మీ బ్లాగులన్నీ సూపరే ! ఇంకా బొల్డంత రాయాలని కోరుకుంటూ, చల్తే రహేంగే !

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఐదు వందలా అంటే ఫైవ్ హండ్రెడ్ అనగా పాంచ్ సౌ.
నిజంగా మీ కృషిని, ఓర్పుని, ఉత్సాహాన్ని మెచ్చుకోవాలి.
సహస్ర అభినందనలు.
మరింత ఉత్సాహంతో మరెన్నో వ్రాయాలని కోరుకుంటున్నాను.

Dantuluri Kishore Varma said...

శుభాభినందనలు. మీ బ్లాగ్ ప్రయాణంలో మరెన్నో ఉత్కృష్ఠమైన మైలురాళ్ళని విజయవంతంగా దాటాలని కోరుకొంటూ........

Indira said...

తృష్ణ అనే బ్లాగర్ తెలిసుండక పోతే నాకు అస్సలు ఈ బ్లాగ్ ప్రపంచమే పరిచయం అయ్యేది కాదు.మీ ప్రతి పోస్టు నేనెంతో ఎంజాయ్ చేస్తాను.మీ ప్రయాణం ఇలాగే "నిరంతరమూ వసంతములే" లాగాసాగాలి.

వేణూశ్రీకాంత్ said...

అమ్మో ఐదొందలా మీకు హృదయపూర్వక అభినందనలండీ. ఈసారి రెండేళ్ళలోపే మరో ఐదొందలు పూర్తి చేసేయాలని కోరుకుంటున్నాను :)

A Homemaker's Utopia said...

500 పోస్టులు అంటే మాటలు కాదు..మా ప్రియతమ బ్లాగ్గర్ కి హృదయపూర్వక అభినందనలు..:-)

BVV Prasad said...

అభినందనలు తృష్ణ గారూ..
ఇక్కడందరూ మంచివాళ్ళే! కానీ, మంచివాళ్ళు ఇన్నిరకాలుగా ఉంటారని ఇక్కడే తెలిసింది! :)

జ్యోతిర్మయి said...

అభినందనలు తృష్ణ గారు.

తృష్ణ said...

@murali:: "వీరతాళ్ళు" పదం చూడగానే చప్పున శంకర్ గుర్తుకొచ్చాడు.. తన మొదటి కామెంట్ లేదనే లోటు తీర్చినందుకు ధన్యవాదాలు.

@శ్రీనివాస్ పప్పు: "పంచశతకటపాభినందనలు" పప్పుగారూ, భలే గొప్పగా ఉండి పదం. ధన్యవాదాలు.

@మధురవాణి: ధన్యవాదాలు మధురా.

తృష్ణ said...

@unknown:ధన్యవాదాలు.
@నిరంతరమూ వసంతములే.... : ధన్యవాదాలు.
@శశికళ: ధన్యవాదాలు.

తృష్ణ said...

@sujata:ఆహ్లాదాన్ని పంచే మీవంటి తోటిప్రయాణికులు ఎప్పటికి గుర్తుంటారు.. మీ అభిమానానికి కృతజ్ఞతలు.

@బులుసు సుబ్రహ్మణ్యం: మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు బులుసుగారూ.

@Dantuluri kishore varma:ధన్యవాదాలు కిషోర్ వర్మగారూ.

తృష్ణ said...

@indira: ఎక్కువగా సన్నిహిత పరిచయాలు పెంచుకోని నాకు, బ్లాగ్లోకంలో ఎదురైన అన్ని అవాంతరసమయాల్లోనూ తోడు నిలిచి, అడుగడుగునా మీరందించిన ధైర్యానికీ, స్ఫూర్తికీ, అభిమానస్పర్శకీ "కృతజ్ఞత" అన్నమాట చిన్నదయిపోతుంది ఇందిరగారూ !

@వేణూ శ్రీకాంత్: అమ్మో... అనుమానమేనండి.. ఇప్పటికే పడుతూ లేస్తూ నానాతంటాలు పడ్డాను :) ధన్యవాదాలు.

తృష్ణ said...

@నాగినిగారూ, అపురూపమైన మీ స్నేహం నాకు ప్రియమైనదేనండి.. ధన్యవాదాలు.

@Bvv prasad: :-) ధన్యవాదాలు.

@జ్యోతిర్మయి: ధన్యవాదాలు జ్యోతిర్మయిగారూ.

srinivas said...

500 టపాల మైలురాయిని విజయవంతంగా చేరుకున్నందుకు శుభాకాంక్షలు.మరెన్నో మంచి మంచి టపాలతో, వెయ్యి టపాల మైలు రాయిని చేరుకోవాలని, మీ బ్లాగు ప్రస్థానం మరింత విజయవంతంగా సాగాలని మనస్పూర్తిగా కొరుకుంటున్నాను.

తృష్ణ said...

@srinivas:ధన్యవాదాలు శ్రీనివాస్ గారూ.

జయ said...

తృష్ణ గారు, గ్రేట్ అండి. మీ పయనం ఇలా ముందుకు సాగిపోతూనే ఉండాలి. మీకోసం ఇంకో కవిత రాయమంటారా....:) I wish you all the best.

తృష్ణ said...

@jaya: jaya gaaru, i still remember your poem !! the first ever written for me :)Thanks for being a good friend.

ఫోటాన్ said...

Great!
Congrats Trushna garu :)

రాజ్ కుమార్ said...

అభినందనలండీ....

అనంతం కృష్ణ చైతన్య said...

meeru chala great andi.......
congrats meeru ilagey inko 1000 episodes run cheyali mee blog lo....... :) wish u very all the best..........

PRASAD said...

Hearty congrats madam,

Prasad Sarma

తృష్ణ said...

@ఫోటాన్: థాంక్స్ హర్షా!
@రాజ్ కుమార్: థాంక్స్ రాజ్!
@అనంతం కృష్ణ చైతన్య: నేను గ్రేట్ కాదండి.. చాలా స్మాల్...:) సాధించాల్సింది చాలా ఉంది..Thanks for the wishes.
@ప్రసాద్: ధన్యవాదాలు ప్రసాద్ గారూ.