గతంలో కొన్నాళ్ళు మా తమ్ముడు చెన్నైలో ఉన్నాడు. ఆ సమయంలో కొన్ని తమిళ్ పాటల గురించి చెప్తుండేవాడు. ఒకరోజు 'చాలా బావుంది వినవే..' అని "మున్బే వా..ఎన్ అన్బే వా.." పాట గురించి చెప్పాడు.. . సినిమా పేరు "Sillunu Oru Kaddhal". పాట అర్థం తెలికపోయినా రెహ్మాన్ ట్యూన్ నచ్చేసి ఆ పాటని ఎన్నిసార్లు విన్నానో లెఖ్ఖలేదు.. ! Shankar Tucker తన "shruthibox" లో పాడించిన ఈ తమిళ పాట ఇక్కడ వినేయండి:
ఆ తర్వాత ఆ పాట తెలుగులో వచ్చింది విను అని మళ్ళీ తమ్ముడే చెప్పాడు.. "నువ్వు నేను ప్రేమ" అనే టైటిల్ తో రీమేక్ చేసినట్లున్నారు ఆ తమిళ్ సినిమాని. సిన్మా చూడలే కానీ వేటూరి అనువదించిన ఆ పాట మాత్రం నాకు బాగా నచ్చేసింది. డిటైల్డ్ గా వింటే సాహిత్యాన్ని వేటూరి ఎంత చక్కగా రాసారో అనిపిస్తుంది. తమిళంలో, తెలుగులో కూడా శ్రేయా ఘోషాల్, నరేష్ అయ్యర్ పాడారు.
చిత్రం: నువ్వు నేను ప్రేమ
పాడినది: శ్రేయా ఘోషాల్, నరేష్ అయ్యర్
సంగీతం: రెహ్మాన్
సాహిత్యం: వేటూరి
ప్రేమించే ప్రేమవా, ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా, పూవ్వలే పుష్పించే
నే...నేనా అడిగా నన్ను నేనే
నే..నీవే హృదయం అన్నదే
ప్రేమించే ప్రేమవా, ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా, పువ్వలే ఫుష్పించే..
రంగు రంగోలీ గోరింటే నువ్వు పెట్టే
రంగే పెట్టిన రేఖలు మెరిసి
గాజుల సవ్వడి.. ఘల్ ఘల్ ....
రంగు రంగోలీ గోరింటే నువ్వు పెట్టే
రంగే పెట్టిన రేఖలు మెరిసి
సుందరి కన్నుల చందనం అద్దిన
చల్లని పున్నమి వెన్నెల నవ్వులు...
ఆఆ..ఆ..ఆఆ....హో...
పువ్వైనా పూస్తున్నా, నీ పరువంగానే పుడతా
మధుమాసపు మాలల మంటలు రగిలించే ఉసురే...
నీవే నా మదిలో ఆడా, నేనే నీనటనై రాగా
నా నాడుల నీ రక్తం, నడకల్లో నీ శబ్దం.. ఉందే... హో....
తోడే.... దొరకని నాడు....విల విలలాడే.... ఒంటరి మీనం.... ((ప్రేమించే ప్రేమవా))
నెల నెల వాడొక అడిగి, నెలవంకల గుడి కడదామా
నా పొదరింటికి వేరే అతిథులు రా..తరమా.....
తుమ్మెద తేనెలు తేలే నీ మదిలో చోటిస్తావా
నే ఒదిగే ఎదపై ఎవ్వరో నిదురించ తరమా........
నీరు... సంద్రము చేరే....గల గల పారే.... నది తెలుసా.... ((ప్రేమించే ప్రేమవా))
ఆ తర్వాత ఆ పాట తెలుగులో వచ్చింది విను అని మళ్ళీ తమ్ముడే చెప్పాడు.. "నువ్వు నేను ప్రేమ" అనే టైటిల్ తో రీమేక్ చేసినట్లున్నారు ఆ తమిళ్ సినిమాని. సిన్మా చూడలే కానీ వేటూరి అనువదించిన ఆ పాట మాత్రం నాకు బాగా నచ్చేసింది. డిటైల్డ్ గా వింటే సాహిత్యాన్ని వేటూరి ఎంత చక్కగా రాసారో అనిపిస్తుంది. తమిళంలో, తెలుగులో కూడా శ్రేయా ఘోషాల్, నరేష్ అయ్యర్ పాడారు.
చిత్రం: నువ్వు నేను ప్రేమ
పాడినది: శ్రేయా ఘోషాల్, నరేష్ అయ్యర్
సంగీతం: రెహ్మాన్
సాహిత్యం: వేటూరి
ప్రేమించే ప్రేమవా, ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా, పూవ్వలే పుష్పించే
నే...నేనా అడిగా నన్ను నేనే
నే..నీవే హృదయం అన్నదే
ప్రేమించే ప్రేమవా, ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా, పువ్వలే ఫుష్పించే..
రంగు రంగోలీ గోరింటే నువ్వు పెట్టే
రంగే పెట్టిన రేఖలు మెరిసి
గాజుల సవ్వడి.. ఘల్ ఘల్ ....
రంగు రంగోలీ గోరింటే నువ్వు పెట్టే
రంగే పెట్టిన రేఖలు మెరిసి
సుందరి కన్నుల చందనం అద్దిన
చల్లని పున్నమి వెన్నెల నవ్వులు...
ఆఆ..ఆ..ఆఆ....హో...
పువ్వైనా పూస్తున్నా, నీ పరువంగానే పుడతా
మధుమాసపు మాలల మంటలు రగిలించే ఉసురే...
నీవే నా మదిలో ఆడా, నేనే నీనటనై రాగా
నా నాడుల నీ రక్తం, నడకల్లో నీ శబ్దం.. ఉందే... హో....
తోడే.... దొరకని నాడు....విల విలలాడే.... ఒంటరి మీనం.... ((ప్రేమించే ప్రేమవా))
నెల నెల వాడొక అడిగి, నెలవంకల గుడి కడదామా
నా పొదరింటికి వేరే అతిథులు రా..తరమా.....
తుమ్మెద తేనెలు తేలే నీ మదిలో చోటిస్తావా
నే ఒదిగే ఎదపై ఎవ్వరో నిదురించ తరమా........
నీరు... సంద్రము చేరే....గల గల పారే.... నది తెలుసా.... ((ప్రేమించే ప్రేమవా))
8 comments:
మంచి పాట. శంకర్ పాడించిన వర్షన్ కూడా బావుంది. :)
ఎంతో మంచి పాట...అందరూ ఇష్టపడే పాట....థాంక్యూ తృష్ణ గారు.
చాలా మంచి పాటండీ.. నేను తరచూ వినే పాట. ఇందులోనే ఇంకొంచెం ఫాస్ట్ ట్యూన్ తో ఇంకోపాట ఉంటుంది విన్నారా. "న్యూ యార్క్ నగరం నిదురోయేవేళా నేనే ఒంటరి" అని అది కూడా బాగుంటుంది కుదిరితే వినండి.
"మున్బే వా.." కాదు. "అన్బే వా.. ఎన్ అన్బే వా.."
అన్బు అంటే తమిళంలో ప్రేమ అని అర్థం.
@chanakya: thanks chanakya.
@jaya:ధన్యవాదాలు జయ గారూ.
@venu srikanth:ఊ తెలుసండి.. అది కూడా ఇష్టం నాకు. ధన్యవాదాలు.
@Gowri Kirubanandan:గౌరి గారూ, నాకు భాష తెలీదనే రెండు మూడు చోట్ల చెక్ చేసి రాసానండి.. వాటిల్లో "మున్బే వా" అనే ఉంది..
పాట లిరిక్స్ ఉన్న లింక్:
http://www.paadalvarigal.com/255/munbe-vaa-yen-anbe-vaa-sillunu-oru-kaadhal-song-lyrics.html
క్రింద ఉన్న యూ ట్యుబ్ లో లింక్ లో పాట క్రిందన లిరిక్స్ ఉన్నాయి..అందులోనూ "మున్బే వా" అనే ఉందండి..
http://www.youtube.com/watch?v=4UMfBvXr0PY&noredirect=1
ఇవి రెండు కాక టపాలో నేను ఇచ్చిన "శృతిబాక్స్" లింక్లో కూడా "మున్బే వా" అనే పాడారు వాళ్ళు..
ఆ ముక్క అర్థం తెలీదు కానీ పదం మాత్రం అదే మరి..
ధన్యవాదాలు.
గౌరి గారూ/తృష్ణగారూ...
మున్బే వా ఎన్ అన్బేవా సరి ఐనదే అనుకుంటానండి. నా పక్కన కూర్చునే తమిళ్/తెలుగు తెలిసిన మిత్రులనడం ఏమిటంటే.. మున్బే అంటే ముందుకు..
ఎన్ అంటే "నా" - "ప్రియతమా నా ముందుకు రా" అని అనుకుంటా అర్థం..
ఇంకా రెండు భాషలూ వచ్చిన వాళ్ళెవరైనా వచ్చి "ఇది కరెక్టే" అని చెప్తే బాగుండును. :)
@Manasa Chamarth: థాంక్స్ మానసా.. నెట్లో వెతికితే ఈ లింక్ దొరికింది..
http://www.orkut.com/Main#CommMsgs?tid=2567283389418009827&cmm=41348&hl=en
ఆ లింక్ లో రాసి ఉన్న పాటలో పల్లవి అర్థం.. :
munbe vaa en anbe vaa -- come infront, come my dear,
kuda va uyire va -- come with me, come my soul,
munbe vaa en anbe vaa --come infront, come my dear,
poo poovaai poo poovaai -- lets blossom like flowers,
naan naana? kaetten ennai -- is tht me?? i asked myself,
naane naan neeya? nenjam sonnathey -- me, is nothing but you, heart replied..
దీని ప్రకారం "మున్బే వా " అనే పదం కరక్టే.
Post a Comment