క్రితం వారం ఓ సినిమాకెళ్ళినప్పుడు హాల్లో "జబర్ దస్త్" ట్రైలర్ వేసాడు. రొమాంటిక్ కామెడి అనుకుంటా. "అలా మొదలైంది" సినిమా తీసిన నందిని రెడ్డి సినిమా. ట్రైలర్ చూస్తే సిన్మా ఎలా ఉంటుందో ఏమో.. అని అనుమానం కలిగింది కానీ ఈ పాట మాత్రం బావుంది. Fm వాళ్ళు సుప్రభాతంలా రోజూ వినిపించేస్తున్నారు. తినగ తినగ వేము.. అన్నట్లుగా పాట వినీ వినీ నాకు బాగా నచ్చేసింది..:) పాటలో హిందీ వాక్యాలు మాత్ర0 పెట్టకపొతే బావుండేది. ఈ మధ్య ఏమిటో కొత్త పాతల్లో ఆంగ్ల పదాలు..వాక్యాలు, హిందీ పదాలు..వాక్యాలు ఎక్కువయిపోయాయి...:(
"నిన్నిలానే చూస్తూ ఉన్నా, రోజిలాగే కలుసుకున్నా
గుండెలో ఈ అలజడేంటో కొత్తగా..
ఊహలోనే తేలుతున్నా, ఊసులెన్నో చెప్పుకున్నా
నాలో నేనే నవ్వుతున్నా వింతగా..
నిన్నిలా.. నిన్నిలా.. నిన్నిలా "
S.S.Thaman సంగీతం. రాసినది 'శ్రేష్ఠ' ట. ఎక్కడో ఎప్పుడో విన్న పాటలా అనిపిస్తోంది. ప్రత్యేకత ఏంటంటే ఈ పాట నటి "నిత్యా మినన్" పాడింది. 'అలా మొదలైంది' సెంటిమెంట్ తో పాడించారేమో... అయినా ఆ అమ్మాయి బాగానే పాడుతుంది. పెక్యులియర్ వాయిస్. ఆ హస్కినెస్ లోనే అందం ఉంది.
.

No comments:
Post a Comment