సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, November 7, 2012

అన్నయ్య కోసం 'కమల్ హాసన్' పాటలు...




మా అన్నయ్యకి నటుడు కమల్ హాసన్ అంటే బోలెడు ఇష్టం. అన్నయ్య కాకినాడలో పెరిగాడు. మేము విజయవాడలో ఉండేవాళ్లం. కమల్ కొత్త సినిమా రిలీజ్ అవ్వగానే మేము చూసేదాకా చూసారా...? లేదా? అని సినిమా చూసేదాకా గోల పెట్టేసేవాడు. కమల్ పోస్టర్లు తలుపులకీ, బీరువాలకి అంటించేవాడు. అలా అంటించిన "సత్య" సినిమా లో కమల్ ఫోటో నాకింకా గుర్తు. ఆ విధంగా కమల్ సినిమాలన్నీ చూసి చూసి అన్నయ్య ఇష్టం మాకూ ఇష్టం అయిపోయింది :) ఇవాళ కమల్ పుట్టినరోజని ఈ టపా మా అన్నయ్య కోసం కమల్ హాసన్ పాటలతో...

1)దశావతారం - ముకుందా ముకుందా



 2)ఇది కథ కాదు - తకథిమితక థిమితకథిమి

3)ఆకలిరాజ్యం - కన్నెపిల్లవని
  


4)సొమ్మొకడిది సోకొకడిది - తొలివలపు
  



 5)అందమైన అనుభవం - కుర్రాళ్ళోయ్ కురాళ్ళు

6)సాగరసంగమం - నాద వినోదము
  

7)క్షత్రియపుత్రుడు - సన్నజాజి పడక



8)గుణ - కమ్మని ఈ ప్రేమ లేఖనే
  



 9)మరో చరిత్ర - భలే భలే



10)డాన్స్ మాస్టర్ - రేగుతున్నదొక రాగం
  



 11)వసంత కోకిల - ఈ లోకం అతి పచ్చన



12)మహానది - శ్రీరంగరంగనాథుని



















13)మైఖేల్ మదనకామ రాజు సుందరి నీవు




14)రాఘవన్ - వెన్నెలవే వెండివెన్నెలవే



15)సత్య - పరువాలు కనివిని ఎరుగని
  




 16)భారతీయుడు - పచ్చని చిలుకలు



17) విచిత్ర సోదరులు - నిన్ను తలచి
 



18) నాయకుడు - నీలాల కన్నుల్లో


















19)నాయకుడు - ఏదో తెలియని బంధమిది
 http://ww.raaga.com/play/?id=38155


 20)భామనే సత్యభామనే - నీ జతే నేనని
 http://ww.raaga.com/play/?id=161042 



21) హేరామ్ - जन्मॊं की ज्वाला थी मन मॆं
http://ww.smashits.com/hey-ram/janmon-ki-jwala/song-14348.html


22)అమావాస్య చంద్రుడు - సుందరమో సుమధురమో... 
http://www.in.com/music/track/amaavasya-chandrudu-songs/sundaramo-sumadhuramo-461575.html




15 comments:

సుజాత వేల్పూరి said...

తృష్ణా,
మీరెప్పుడైనా నా కోసం ఒక పోస్టు రాయాల్సిన సందర్భం వస్తే..ఇదిగో ఈ పోస్టే రిపీట్ చేసేయండి. చాలు! కమల్ హాసన్ కి హార్డ్ కోర్ ఫాన్స్ ఇక్కడ

Thanks...:-))

Kishore said...

నేనూ కమల్ అభిమానినే. మీ అన్నయ్య తో పాటు ఈ పోస్ట్ నాకు, నాలాంటి చాలామందికి చాలా అనందం కలిగిస్తుంది. ధన్యవాదములు.

ధాత్రి said...

తృష్ణ గారూ..చాలా చాలా మంచి పాటలు గుర్తు చేసారు..
రేగుతున్నదొక రాగం..
కన్నెపిల్లవని..
నాద వినోదము..
శ్రీ రంగ రంగ నాధుని..
నాకు చాలా ఇష్టమైన పాటలు..
Thank you for the links..:)

మాలా కుమార్ said...

మంచి పాటలు పెట్టారండి . ఇందులా చాలా పాటలు నాకిష్టమైనవే వున్నాయి . థాంక్ యు .

R Satyakiran said...

కమల్ పాటలు అన్నీ చూపించినందుకు చాలా Thanks. నాకింకా గుర్తు. సత్య సినిమా నేను ఇంటర్ లో ఉన్నప్పుడు వచ్చింది. కాలేజీ మానేసి చుసా ఆ సినిమా. నేను కాలేజీ మానేసి చుసిన సినిమా అదొక్కటే. నాయకుడు అయితే ఇంకా ఇష్టం కాని అది school లో ఉన్నప్పుడు వచ్చింది. అప్పుడు అంత freedom లేదు. లేకపోతే అదీ అలాగే చూసే వాణ్ణి !!!

ఈ రోజు మీ పోస్ట్ చదువుతుంటే బ్లాగ్ పోస్ట్ లా లేదు. టీవీ ప్రోగ్రాం చూసినట్టుంది :-)

సుభ/subha said...

సూపర్ పాటలన్నీ పెట్టారండీ.. దేనికదే సాటి అసలు :)

వేణూశ్రీకాంత్ said...

అన్నీ సూపర్ పాటలేనండీ.. భలే సెలెక్ట్ చేశారు థాంక్స్. కమల్ హసన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు :)

ramjee said...

నేను కూడ చాలా ధాంక్స్

UG SriRam said...

ఈ తమిళ సినేమా పాటలు కూడా మీకు నచ్చితే మీబ్లాగులో పేట్టుకొండి.

Ninaivo Oru Paravai (ఎర్ర గులాబీలు)
http://www.youtube.com/watch?v=1igvh1-CODE

indha minminikku kannil oru minnal
http://www.youtube.com/watch?v=jGTrZDp4c1A


Anthi mazhai -Raaja paaravai (అమవాస్య చందృడు)
http://www.youtube.com/watch?v=J7ThzbP32QI

Azhagae Azhagu -Raaja paaravai
http://www.youtube.com/watch?v=OhnIGSkRxrI

kadhal vandhuduchu kalyanaraman
http://www.youtube.com/watch?v=LoVx8T8au0k


Perai Sollava from Guru .
http://www.youtube.com/watch?v=56FAqFVL30Y

UG SriRam said...

Ore Naal Unnai Naan (వయసు పిలిచింది)

http://www.youtube.com/watch?v=th3LJyFDZzY

జ్యోతి said...

సత్య లో పాట, సుందరమో సుమధురమో మిస్ చేసారేమో అనుకున్నా తృష్ణ :) ఈ రెండు పాటలు తమిళంలో విన్నారా ? సత్య పాట తమిళంలో ఇంకా బాగున్నట్లనిపిస్తుంది నాకు, ఒక్క ముక్క అర్థం కాకపోయినా. మా తమ్ముడు కూడా కమల్ హాసన్ కి వీర ఫాన్ , నేను మాత్రం రజనీ పార్టీ .

తృష్ణ said...

@UG SriRam: టపా పెద్దదయిపోతుందని చాలా కష్టపడి పాటలు కుదించేసానండి.;) ఇంకా నాకు నచ్చే స్వాతిముత్యం , శుభసంకల్పం మొదలైన వాటిల్లోవి songs పెట్టనేలేదు..:( మంచి పాటలు అందించినందుకు ధన్యవాదాలు. మీ వ్యాఖ్యలో ఉన్నాయి కదా అలా ఉంచేద్దాం. సరేనాండి :)Thanks a lot for the songs.

తృష్ణ said...

@సుజాత గారూ, గుర్తుంచుకుంటానండీ...ధన్యవాదలు.
@కిశోర్ గారూ, ధన్యవాదలు.
@ధాత్రి గారూ, ధన్యవాదలు.
@మాలగారూ, అవునా.. బావుంది. ధన్యవాదలు.
@కిరణ్ గారూ, పోనీ టివీ చూస్తున్నాననుకోండీ..:)
@శుభగారూ, థాంక్స్ అండీ.

తృష్ణ said...

@వేణు గారూ, ధన్యవాదాలు.
@రాంజీ గారూ, ధన్యవాదాలు.
@మహెక్: సత్య లో పాట మిస్ చేస్తే అన్నయ్య చంపేస్తాడు..:) "సుందరమో.." నేను మానలేను..:)
అసలు ఇంకా బోలెడు మిగిలిపోయాయి..:((
Thanks a lot :)

చాణక్య said...

కమల్ వీరాభిమానిగా మీకు నా కృతజ్ఞతలు! దాదాపు అన్నీ నాకు ఇష్టమైన పాటలే! :)