సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, September 15, 2012

Is life beautiful?


Is life beautiful?

yes Of course...! But if it comes to the telugu film.."Life is beautiful"..i felt.. some colours are really missing ! అందుకే ఆ జీవితం నాకు పెద్దగా అందంగా కనబడలేదు:(

మళ్లీ మరోసారి స్టుడెంట్స్ ..కాలేజ్ లైఫ్ చుట్టూ మనల్ని తిప్పే ఈ కథకు కాసింత ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా జతఅయ్యింది. కొత్త పిల్లలు(నటులు) తమవంతు కృషిని, శ్రమను తెరపై చూపెట్టగలిగారు కానీ ఎందుకో నాకు సినిమాలో ఏదో మిస్సయింది అనిపించింది నాకు. చాలారోజులకు అమల ను చూద్దాం అని ఉత్సాహపడిన నాకు తన పాత్ర ఎక్కువలేకపోవటం నిరుత్సాహాన్ని కలిగించింది. బహుశా నేను సినిమా నుండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసానేమో అనిపించింది.

శేఖర్ కమ్ముల మొదటి సినిమాను చూడలేదు కానీ 'ఆనంద్', 'గోదావరి', 'హేపిడేస్' మూడు బాగా నచ్చాయి నాకు. ఆవకాయ్ బిర్యాని, లీడర్ పర్వాలేదు అనుకున్నా. ఇక ఈసారి అమల, కొత్త నటులు, రెఫ్రెషింగ్ థీమ్,కాన్సెప్ట్ కూడా బాగుంది....ఇవన్నీ విని,చదివి ఎక్కువే ఆశ పడిపోయాను. mother sentiment, చిన్న పాప నటన నన్ను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా చివరిలో పాప మాటలు బాగున్నాయి. కంట తడి తెప్పించాయి..! కానీ సంగీతం కూడా శేఖర్ పాత సినిమాల ధోరణిలోనే కాస్త డల్ గా అనిపించింది.

ఇక నాకు అస్సలు నచ్చని విషయం చిన్నపిల్లలా ప్రేమ వ్యవహారాలూ. పదహారు,పదిహేడు వయసు పిల్లలతో తీసే ప్రేమ సినిమాలు అంటే నాకు భలే కోపం అసలు. ఎందుకని ఇలా ? చివరికి ఏం నీతి చెప్తే ఏమిటి? సినిమా అంతా చూపిస్తున్నారా లేదా? మన ఇంట్లో మనం మన ఇళ్ళల్లో అ వయసులో అలాంటి వ్యవహారాల్లోకి దిగితే సహించగలమా? ఎంసెట్ కి ప్రిపెరయ్యే పిల్లలు, డిగ్రి చదివే పిల్లలు.. కాలం అలానే ఉంది ప్రపంచాన్ని చూసి మాట్లాడు తల్లీ అనొచ్చు ఎవరన్నా! కానీ ఎందుకో నాకైతే చిన్న పిల్లలతో అలా సినిమాల్లో ప్రేమ,దోమ చూపిస్తే నచ్చదు. అసలు 'శ్రియ' లాంటి సీనియర్ నటిని ఆ చిన్న పిల్లాడి పక్కన చూస్తేనే నాకు వికారం వచ్చింది. 'u too brutus?' అన్నట్లు 'u too sekhar?' అని అడగాలనిపించింది. నాకు ఇష్టమైన దర్శకుల్లో ఒకరైన జంధ్యాల చదువుకునే పిల్లలతో తీసిన సినిమాలనే నేను విమర్శించేదాన్ని. ఏదో కొత్త రకంగా తీస్తున్నాడని, తెలుగు తెరకు మరో విభిన్న దర్శకుడు దొరికాడేమో అని సరదాపడ్డాను. ప్చ్..!

తన టార్గెట్ ప్రేక్షకులు మధ్యతరగతి యువత అని ఒక ఎఫ్ ఎం.రేడియోలో శేఖర్ చెప్పినట్లు ఈ సినిమా యువతకు బాగా నచ్చవచ్చు. But i feel sekhar has definetly lost his magic somewhere around "happy days" itself! ఇకపోతే, "Beauty lies in the eyes of the beholder " అన్నట్లు చూసే కళ్ళను బట్టే కదా.. నా కళ్ళలోనే ఏదన్నా దోషం ఉందేమో మరి..అందుకేనేమో నాకు ఈ 'లైఫ్' బ్యూటిఫుల్ గా ఉన్నా కాస్త రంగు తక్కువగానే కనపడింది..

7 comments:

Tejaswi said...

మీ అభిప్రాయంతో 100% ఏకీభవిస్తాను. హ్యాపీడేస్ లోనే డేటింగ్ కల్చర్ ను బాగా ప్రమోట్ చేసినట్లు నాకు అనిపించింది. అయితే ఈ కొత్త సినిమాలో కూడా అలాగే చేశాడన్నమాట.

లీడర్ అంటూ పెద్ద సందేశాలతో సినిమాను తీసిన శేఖర్, కాలేజ్ పిల్లలలో ఈ విధమైన పెడధోరణి(ప్రతి ఒక్కరికీ గర్ల్/బాయ్ ఫ్రెండ్ తప్పనిసరిగా ఉండాలి) ప్రోత్సహించడం సామాజిక బాధ్యతపట్ల అతని నిబద్ధతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

ప్రేరణ... said...

మీ రివ్యూ బాగుందండి.

R Satyakiran said...

నాకైతే సినిమా నచ్చింది. మళ్లీ కూడా చూస్తా

నిరంతరమూ వసంతములే.... said...

మీ రివ్యు బాగుంది తృష్ణ గారు. మీతో నేను ఏకీభవిస్తున్నాను. తను ముందు తీయబోయే సినిమాలలో శేఖర్ జాగ్రత్త పడతాడని ఆశిద్దాం!

భాస్కర్ కె said...

వినాయక చవితి శుభాకాంక్షలు!

Saahitya Abhimaani said...

u too brutus?' అన్నట్లు 'u too sekhar?'

In fact I wanted to keep caption as You Too Sekh.... But by the time thought came I already posted a mildly worded views of mine in my blog.

I am quite disappointed by the Movie.

తృష్ణ said...

@tejaswi garu,
@prErana gaaru,
@నిరంతరమూ వసంతములే....,
thank you for the comments.

@the tree,thanks for the wishes.

@శివరామప్రసాదు కప్పగంతు: me too sir!
thanks for the comment.