ఆ మధ్యన నాన్నగారి పుస్తకాలు సర్దుతూంటే ఈ ప్రత్యేక సంచిక దొరికింది. '74 లో రాజమండ్రి లో జరిగిన బాపూ బొమ్మల కొలువన్నమాట ! ఆ పుస్తకం ఇప్పుడు దొరకటం అరుదు కాబట్టి అందులోని చాలామటుకు చిత్రాలకు ఫోటోలు తీసాను బ్లాగ్మిత్రుల కోసం. క్రిందన ఉన్న ఆ చిత్రాలు మీరూ చూసి ఆనందించండి..
పుస్తకం ముందు భాగంలో ఆరుద్ర గారు రాసిన కవిత, శ్రీ ఎం.వీ.ఎల్ గారు బాపూ గారి గురించి రాసిన వ్యాసం కూడా ఫోటోల్లో పెడుతున్నాను. ఫోటో సైజ్ పెద్దగా చేసుకుని ఎం.వీ.ఎల్ గారి వ్యాసం చదవవచ్చు.
11 comments:
Wow!
Great Collection :)
:)
అద్భుతం. ఒకసారి మీ నాన్నగారి దగ్గరికి దండయాత్ర చేయాలయితే.
డియర్ తృష్ణా,ఏమెస్కొ పాకెట్ బుక్స్ మీద బాపుగారి బొమ్మలు చూస్తుంటే ఎంత ఆనందం కలిగిందో!మళ్ళీ ఆ పుస్తకాలన్నీ అదే సైజులో ప్రింటు చేస్తే ఎంత బాగుంటుందో కదా!!ఇలాంటి అపురూపమైనవి సేకరించడం ఒక ఎత్తు,జాగ్రత్త పరచడం ఒక ఎత్తు. మీ నాన్న గారి అభిరుచి మీకూ వుండటం అదృష్టం!!!
నానారి ఆర్టికిల్ కూడా పంచినందుకు వంద వందనాలు. మీ పోస్టు ఓ పోస్టుడు జ్ఞాపకాలు తట్టి లేపింది.
బాపు చిత్ర కళా ప్రదర్శనలు ఆంధ్రదేశమంతటా జరగాలని - ఓ అభిమాని గా కోరుకుని - అందుకు తన వంతు కృషి చేశారు నానారు
నానారు రమణ గారి సాహిత్యం పై చేసిన పరిశోధన కానుక. 1970's లో నలభై ఏళ్ళ తెలుగు రచయిత ( అందునా సినీమా రచయిత ... హవ్వ :)) మీద ముప్ఫై ఏళ్ళ సాటి తెలుగు రచయిత పరిశోధన చేయటం విధి విపరీతం కాక మరేమిటి :)
http://mvl-yuvajyothi.blogspot.no/2011/09/blog-post_21.html
ఎమ్వీయల్ గారబ్బాయి
కొరోసిన్ స్టవ్ మీద వంట చేస్తున్న అమ్మాయి కూచున్న భంగిమ ఎంత సహజంగా ఉందో!
Nice collection Trishna! Thanks for sharing.
38 ఏళ్ళలో బొమ్మల కొలువు లో ఎంతటి తేడా...
అయినా అప్పటికీ ఇప్పటికీ అద్భుతమైన చిత్రరాజాలు మాత్రం అవే...
చాలా అరుదైన ఆ నాటి కొలువు పేజీలు బాగా సేకరించారు.
కళాతృష్ణ ఎన్నటికీ తీరదు.
WOW తృష్ణ గారు. నాకైతే లోటరి విన్ అయినట్టు ఫీల్ అయ్యాను. మాతో share చేసుకున్నందుకు చాలా చాలా థంక్స్ అండి! Really a great post.
Literally, Beautiful Post
అత్యద్భుతం ...
మాటల్లో వ్యక్తం చెయ్యలేనండి ఈ అనుభూతి ని !!
మీ నాన్న గారికి - మీకు పాదాభి వందనాలు.
Post a Comment