నిన్న ఒక టపా రాసాను "ఈ పళ్ళు ఏమిటో తెలుసా? " అని. పైన ఫోటో లోనిది ఆ పళ్ళు కాసే చెట్టు.నిన్నటి టపాలో ఇద్దరు(కృష్ణ గారు, సైలజ గారు) సరైన సమాధానం రాసారు.
ఇది ఒక ఔషధవృక్షం. ఈ పళ్ళను "మోరీ పళ్ళు" అంటారు. ఇవి ఈ సీజన్లోనే దొరుకుటాయి. చెట్టు నిండా పళ్ళు విరగ కాస్తాయి.జనవరి ఫిబ్రవరిల్లో ఈ చెట్టు నిండా పువ్వులతో నిండిపోతుందిట. ఇలా
మార్చి, ఏప్రిల్ నెలల్లో పళ్ళు కాస్తాయిట. గుండ్రంగా, ఆకుపచ్చ గా ఉండి తర్వాత నల్లగా మారిపోతాయి ఈ పళ్ళు. అచ్చం నేరేడు పళ్లలాగే వగరుగా,తియ్యగా,పుల్లగా ఉంటుందీ పళ్ళ రుచి.
వీటిలోపల గింజలను ఎండబెట్టి ఓపిగ్గా కొట్టుకుంటే లోపల పప్పు ఉంటుంది. ఆ పప్పునే మనం "సారపప్పు" అంటాం. ఇంగ్లీషు లో chironji అంటారు. స్వీట్స్ లోనూ, ఖీర్ లోనూ వేస్తారు.
ఈ చెట్టు వివరాలు, సారపప్పు వివరాలూ ఆసక్తి ఉన్నవారు క్రింద వెబ్సైట్ లింక్స్ లోకి వెళ్ళి చూడవచ్చు.
4 comments:
అవునా.. ఇంటరెస్టింగ్... నేనెప్పుడూ చూడలేదు ఈ పళ్ళు.. మీకు మాత్రం భలే దొరుకుతాయండీ.. :)
mouth watering
neneppudu chudaledu,vinaledu :) first time :)
సారపప్పు పళ్ళని చూడటం ఇదే ఫస్ట్ టైమండీ. కుసింత రేర్ చెట్లలా ఉన్నాయి. ఎప్పుడూ చూడలేదు.
Post a Comment